'శివ' ఫైట్స్ ఎందుకు క్లిక్ అయ్యాయి? ఆర్జీవీ సీక్రెట్ ఇదే!
ఇప్పటి ఫైట్ల గురించి వర్మ సెటైరికల్‌గా మాట్లాడుతూ, "ఆడియన్స్‌కు ఆ రియాక్ట్ అయ్యే టైమ్ ఇవ్వకుండా, వరసగా పంచ్‌లు, స్లో మోషన్లు వేసుకుంటూ వెళ్తే.. దాన్ని స్టంట్ అంటారో ఏమంటారో నాకు తెలీదు.
By: M Prashanth | 11 Nov 2025 10:51 PM IST"ఫైట్ సీన్‌లో ఒక్క పంచ్ కొట్టాక, ఆ దెబ్బకు ఆడియన్స్ రియాక్ట్ అయ్యే గ్యాప్ ఇవ్వాలి. ఆ గ్యాప్ ఇవ్వకుండా టక టక మని స్లో మోషన్ షాట్లు, ర్యాంప్ షాట్లు వేసుకుంటూ వెళ్తే.. మీకు ఆ స్టంట్ నచ్చొచ్చు ఏమో గానీ, ఆడియన్స్‌కు ఫీల్ రాదు." ఇది 'శివ' యాక్షన్ సీక్వెన్సుల గురించి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చెప్పిన లెసన్. 'శివ' 4K రీ రిలీజ్ ప్రమోషన్లలో భాగంగా, నాగార్జున, వర్మ ఆ సినిమా గురించి చాలా డెప్త్ ఉన్న విషయాలు పంచుకున్నారు. అందులో, 'శివ' ఫైట్స్ ఎందుకు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాయనే విషయంపై అసలు సీక్రెట్ ని రివిల్ చేశారు.
వర్మ మాట్లాడుతూ, "ఒక దెబ్బ తాలూకు అసలైన ఇంపాక్ట్ కొట్టడంలో ఉండదు, ఆ దెబ్బ తిన్నవాడి రియాక్షన్‌లో ఉంటుంది. 'శివ'లో మేము ఆ టైమ్ తీసుకున్నాం. నాగార్జున ఒకరిని కొట్టిన తర్వాత, వాడు కిందపడి ఆ పెయిన్‌ను అనుభవించడం, ఆ తర్వాత నాగ్ డైలాగ్ చెప్పడం.. ఆ 'పాజ్' (ఆగడం) అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పాజ్ ఇవ్వడం వల్లే, ఆడియన్స్‌కు 'ఫ*క్, ఏం దెబ్బ అది!' అని రియాక్ట్ అవ్వడానికి టైమ్ దొరుకుతుంది."
ఇప్పటి ఫైట్ల గురించి వర్మ సెటైరికల్‌గా మాట్లాడుతూ, "ఆడియన్స్‌కు ఆ రియాక్ట్ అయ్యే టైమ్ ఇవ్వకుండా, వరసగా పంచ్‌లు, స్లో మోషన్లు వేసుకుంటూ వెళ్తే.. దాన్ని స్టంట్ అంటారో ఏమంటారో నాకు తెలీదు. కానీ, రియల్ టైమ్‌లో ఫైట్ అలా జరగదు. నిజంగా ఎవరైనా గట్టిగా ఒక్క పంచ్ ఇస్తే, ఆ దెబ్బ చాలా సాలిడ్‌గా ఉంటుంది. ఒక్క దెబ్బకే పడిపోతారు" అని అన్నారు.
"అప్పట్లో థియేటర్లలో కూర్చున్న ఆడియన్స్‌కు ఇలాంటి రియల్ ఫైట్ చూసి ఎక్స్‌పీరియన్స్ ఉందో లేదో నాకు తెలీదు. కానీ, 'శివ' ఫైట్స్ చూసినప్పుడు వాళ్లు కచ్చితంగా ఇది ఫీల్ అయ్యారు. 'ఆ.. నిజంగా ఫైట్ జరిగితే ఇలాగే ఉంటుంది కదా' అని వాళ్లు కనెక్ట్ అయ్యారు. అదే 'శివ' సక్సెస్‌కు కారణం" అని వర్మ తన మార్క్ అనాలిసిస్ ఇచ్చారు.
'శివ'లో సైకిల్ చైన్ సీన్ అయినా, కాలేజ్ గొడవలైనా.. ప్రతీది చాలా రియలిస్టిక్‌గా, రాగా ఉండటానికి కారణం ఇదే. ప్రతీ పంచ్‌కు, ప్రతీ దెబ్బకు వర్మ ఇచ్చిన ఆ 'రియాక్షన్ టైమ్'.. ఆడియన్స్‌ను క్యారెక్టర్‌తో పాటు ట్రావెల్ చేయించింది. అందుకే 35 ఏళ్ల తర్వాత కూడా ఆ ఫైట్స్ గురించి, ఆ సౌండ్ డిజైన్ గురించి జనం మాట్లాడుకుంటున్నారు. ఇక రీ రిలీజ్ లో నేటితరానికి ఈ సినిమా ఫైట్స్ ఎంతవరకు కనెక్ట్ అవుతాయో చూడాలి.
