Begin typing your search above and press return to search.

రామ్‌గోపాల్ వ‌ర్మ‌ మ‌రో 'ఆఫీస‌ర్' చేయ‌డుగా?

సోష‌ల్ మీడియా వేదిక‌గా `ధురంధ‌ర్‌` లాంటి సినిమాలు, సినిమా మేకింగ్‌లో ఏఐ తీసుకొస్తున్న విప్ల‌వాత్మ‌క‌మైన టెక్నాల‌జీకి సంబంధించిన పోస్ట్ పెడుతూ వైర‌ల్ అవుతున్నారు.

By:  Ravindar Gorantla   |   16 March 2026 6:00 PM IST
రామ్‌గోపాల్ వ‌ర్మ‌ మ‌రో ఆఫీస‌ర్ చేయ‌డుగా?
X

ఆర్జీవి..గ‌త కొంత కాలంగా త‌న ప్రాభ‌వాన్ని కోల్పోయి కాంట్రాక్ట్ సినిమాలు చేస్తూ దారుణ ఫ్లాపుల్ని ఎదుర్కొంటూ వ‌స్తున్నారు. సినిమాల కంటే గ‌త కొన్నేళ్లుగా సోష‌ల్ మీడియా ద్వారా వైర‌ల్ అవుతూ వార్త‌ల్లో నిలుస్తూ వ‌స్తున్నారు. గ‌తంలో ట్రెండ్ సెట్ట‌ర్ సినిమాలు తీసినా..బాలీవుడ్‌ని రంగీలా, స‌త్య‌, వాస్తు శాస్త్ర‌, భూత్ వంటి సినిమాల‌తో ఆశ్చర్య‌ప‌రిచినా ఇప్పుడు మాత్రం కేవ‌లం ట్వీట్‌ల‌కే ప‌రిమిత‌మైపోయారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా `ధురంధ‌ర్‌` లాంటి సినిమాలు, సినిమా మేకింగ్‌లో ఏఐ తీసుకొస్తున్న విప్ల‌వాత్మ‌క‌మైన టెక్నాల‌జీకి సంబంధించిన పోస్ట్ పెడుతూ వైర‌ల్ అవుతున్నారు.

ఒక ద‌శ‌లో టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ ట్రెండ్ సెట్ట‌ర్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిల‌వ‌డ‌మే కాకుండా సూప‌ర్‌స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ తో క్రేజీ సినిమాలు చేశారు. ఇప్పుడు మ‌ళ్లీ త‌న‌దైన మార్కు సినిమాతో ప్రేక్ష‌కుల ముందుక రావాల‌నే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. కొన్నేళ్ల క్రితం బాలీవుడ్‌లో సంచ‌ల‌నం సృష్టించిన `స‌ర్కార్‌`కు కొన‌సాగింపుగా ఈ సినిమా ఉంటుంద‌ని, అమితాబ్ బ‌చ్చ‌న్‌, అభిషేక్ బ‌చ్చ‌న్ ఇందులో క‌లిసి న‌టిస్తార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

2005లో ఆర్జీవీ తెర‌కెక్కించిన పొలిటిక‌ల్ క్రైమ్ డ్రామా `స‌ర్కార్‌`. అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది. మ‌హారాష్ట్ర శివ‌సేన అధినేత బాల్ థాక‌రే స్ఫూర్తితో అమితాబ్ క్యారెక్ట‌ర్‌ని వ‌ర్మ క్రియేట్ చేయ‌డం, స‌మ‌కాలీన రాజ‌కీయాల‌కు లింక‌ప్ చేస్తూ సినిమాని రూపొందించ‌డంతో అప్ప‌ట్లో `స‌ర్కార్‌` సంచ‌ల‌నం సృష్టించింది. దీని త‌రువాత `స‌ర్కార్ రాజ్‌`ని కూడా అమితాబ్ బ‌చ్చ‌న్, అభిషేక్ బ‌చ్చ‌న్‌ల కాంబినేష‌న్‌లో చేశాడు. అది కూడా మంచి హిట్ అయింది. కానీ ఫ‌స్ట్ పార్ట్ అంత స‌క్సెస్‌ని మాత్రం సొంతం చేసుకోలేదు.

అయినా స‌రే దీనికి సీక్వెల్‌గా `స‌ర్కార్ 3`ని 2017లో చేసిన వర్మ చేతులు కాల్చుకున్నాడు. దీంతో వ‌ర్మ‌పై విమర్శ‌లు వెల్లువెత్తాయి. ఇదే సీక్వెల్ సిరీస్‌కు ముగింపు సినిమా అంటూ అంతా వ‌ర్మ‌ని విమ‌ర్శించారు. దీంతో ఇక `స‌ర్కార్‌` సీక్వెల్స్‌కి ఎండ్ కార్డ్ ప‌డిన‌ట్టున‌ని అంతా భావించారు. అయితే ఇన్నేళ్ల విరామం త‌రువాత మ‌ళ్లీ `స‌ర్కార్‌`కు సీక్వెల్ చేయాల‌ని, డైరెక్ట‌ర్‌గా స్ట్రాంగ్ క‌మ్ బ్యాక్ ఇవ్వాల‌ని వ‌ర్మ ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టాడు. వ‌ర్మ‌లో ఇది అక‌స్మాత్తుగా క‌లిగిన ఆలోచ‌నా.. లేక `ధురంధ‌ర్‌` ఇచ్చిన స్ఫూర్తా? అన్న‌ది ఎవ‌రికి అర్థం కావ‌డం లేదు.

`సర్కార్ 4`ని అమితాబ్ బ‌చ్చ‌న్‌, అభిషేక్ బ‌చ్చ‌న్‌ల‌తో ఏప్రిల్ 4న ప్రారంభించ‌బోతున్నాడ‌ట‌. అభిషేక్ క్యారెక్ట‌ర్‌ని సెకండ్ పార్ట్‌లోనే ముగించిన వ‌ర్మ ఈ సీక్వెల్ కోసం మాత్రం కొత్త క‌థ‌ని ఎంచుకున్నాడ‌ని వార్త‌లు వ‌నిపిస్తున్నాయి. అయితే ఇక్క‌డో సందేహం. గ‌తంలో నాగార్జున‌తో కొత్త త‌ర‌హా సినిమా చేస్తాన‌ని న‌మ్మించి `ఆఫీస‌ర్‌`ని తీసి మ‌రోసారి వ‌ర్మ సినిమా అంటూ పాయిపోయేలా చేయ‌డం తెలిసిందే. ఇన్నేళ్ల త‌రువాత అమితాబ్‌, అభిషేక్‌ల‌తో `స‌ర్కార్ 4` అంటూ హ‌డావిడి చేస్తున్న వ‌ర్మ మ‌రో `ఆఫీస‌ర్‌` చేయ‌డుగా? అని అంతా సందేహం వ్య‌క్తం చేస్తున్నారు.