VODKA గ్లాసులో ఒంపి SPIRIT అనేశారు.. వంగాను చెడగొడుతున్నారా?
టాలీవుడ్ సంచలన దర్శకులు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) - `యానిమల్` డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తాజా భేటీ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
By: Sivaji Kontham | 25 Sept 2026 10:06 PM ISTటాలీవుడ్ సంచలన దర్శకులు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) - `యానిమల్` డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తాజా భేటీ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కలయికకు సంబంధించి ఆర్జీవీ తనదైన శైలిలో సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఫోటో నెట్టింట తెగ వైరలవుతోంది. వోడ్కా లేదా డ్రింక్ గ్లాసు పట్టుకుని ఉన్న ఆర్జీవీ.. సందీప్ రెడ్డి వంగాతో కలిసి దిగిన ఈ ఫోటోగ్రాఫ్‌కు ''హావింగ్ ఎ స్పిరిట్ విత్ ది SPIRIT'' అంటూ ప్రభాస్ సినిమా టైటిల్‌ను జోడించి ఇచ్చిన క్యాప్షన్ అందరినీ ఆకర్షిస్తోంది.
శివ, సత్య, రంగీల, కంపెనీ వంటి మాస్టర్ పీస్‌లతో ట్రెండ్ సెట్ చేసిన ఆర్జీవీ ఆ తర్వాత తనదైన బో*ల్డ్ స్టేట్‌మెంట్లు.. వివాదాస్పద వ్యవహారశైలితో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నారు. మరోవైపు అర్జున్ రెడ్డి, కబీర్‌సింగ్, యానిమల్ చిత్రాలతో బాక్సాఫీస్ రికార్ధులు తిరగరాసి ప్రస్తుతం ప్రభాస్‌తో `స్పిరిట్` సినిమా తెరకెక్కిస్తున్న సందీప్ రెడ్డి వంగా కూడా అదే తరహా రెబల్ కంటెంట్‌తో దూసుకుపోతున్నారు. ఈ ఇద్దరు టాలెంటెడ్ డైరెక్టర్ల మధ్య ఉన్న పోలికలు.. ఒకరినొకరు మించిపోయే ఆలోచనలు ఎప్పుడూ చర్చనీయాంశమవుతుంటాయి.
ఆర్జీవీ తన కెరీర్‌లో ప్రయోగాలు చేస్తూ ఒక దశలో కావాలనే ఫేడవుట్ కావాలని డిసైడ్ అయినట్లు అనిపించినా.. సందీప్ రెడ్డి వంగా మాత్రం తన గోల్స్ విషయంలో ఎంతో స్పష్టంగా ఉన్నారు. ఇంటర్నేషనల్ రేంజ్‌కు వెళ్లాలనే కసితో.. తన మిషన్‌ను ఎక్కడా తప్పుదారి పట్టించకుండా వంగా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. తన కంటే భిన్నంగా ఆలోచిస్తూ వెండితెరపై సంచలనాలు సృష్టిస్తున్న వంగాను చూసి ఆర్జీవీ కూడా తన పాత వైభవాన్ని గుర్తుచేసుకుంటున్నారేమో అనే ఆశ పుట్టించింది ఈ ఫోటోగ్రాఫ్.
ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న `స్పిరిట్` సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉండగా.. ఈ చిత్రం 2027 మార్చి 5న విడుదల కానుంది. మరోవైపు రామ్ గోపాల్ వర్మ కూడా `పోలీస్ కంపెనీ` అనే యాక్షన్-క్రైమ్ డ్రామా ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. ఈ ఇద్దరు రెబల్ దర్శకుల కలయిక కేవలం ఒక సరదా భేటీ మాత్రమే కాకుండా.. భవిష్యత్తులో రానున్న తమ సినిమాలపై అంచనాలను పెంచే ప్రయత్నంగాను అనుకోవచ్చు.
ఎన్ని విమర్శలు, ఫ్లాపులు ఎదురైనా అభిమానులు ఆర్జీవీని ఆరాధిస్తూనే ఉన్నారు. ఆర్జీవీ ప్రభావం భవిష్యత్ తరాల దర్శకులపై ఉందనడానికి సందీప్ రెడ్డి వంగా ఎదుగుదలే ఒక పెద్ద ఉదాహరణ. వంగా ఎప్పుడూ ఆర్జీవీ లాంటి దిగ్ధర్శకులలోని పాజిటివ్ ఎలిమెంట్స్ ని స్టడీ చేసి ముందుకు సాగుతున్న తీరు హర్షణీయం. ఏది ఏమైనా ఈ ఇద్దరు దిగ్గజాలు ఒక్కచోట చేరి సందడి చేయడం టాలీవుడ్ వర్గాల్లో - సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఇద్దరూ కలిసి ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్టుకు పని చేస్తే బావుంటుందేమో!
