Begin typing your search above and press return to search.

రాజమౌళి కన్నా సందీప్ బెటర్ : ఆర్జీవి

సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ తన క్రియేటివ్ టాలెంట్ ని తన సినిమాల మీద కన్నా అవతల వాళ్ల సినిమాల మీద ఎక్కువ ఉపయోగిస్తున్నారు.

By:  Ramesh Boddu   |   9 Sept 2025 1:02 PM IST
రాజమౌళి కన్నా సందీప్ బెటర్ : ఆర్జీవి
X

సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ తన క్రియేటివ్ టాలెంట్ ని తన సినిమాల మీద కన్నా అవతల వాళ్ల సినిమాల మీద ఎక్కువ ఉపయోగిస్తున్నారు. ఇక రీసెంట్ గా అతనికి బాగా నచ్చిన యానిమల్ సినిమా డైరెక్టర్ సందీప్ వంగ తో ఒక స్పెషల్ చిట్ చాట్ లో పాల్గొన్నాడు ఆర్జీవి. జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న ఈ స్పెషల్ షోలో ఇప్పటికే చాలా మంది స్టార్స్ రాగా లేటెస్ట్ గా ఆర్జీవి, సందీప్ వంగ గెస్ట్ లుగా వచ్చి సర్ ప్రైజ్ చేశారు.

రైట్ కైండ్ ఆఫ్ ఎమోషన్..

ఈ క్రమంలో రాజమౌళి, సందీప్ వంగా ఇద్దరిలో ఎవరు బెటర్ అని ఆర్జీవిని అడిగితే. అతనికి సందీప్ వంగ బెటర్ అని చెప్పాడు. సందీప్ వంగ సినిమాలో రైట్ కైండ్ ఆఫ్ ఎమోషన్ అంటే నిజమైన ఎమోషన్ ని చూపిస్తాడు. అంతేకాదు కొత్త పంథాలో అగ్రెషన్ రైటింగ్ తో సీన్ రాస్తాడని అన్నారు. ఐతే రాజమౌళి కమర్షియల్ ఫిల్మ్ మేకర్ అయినా సందీప్ వన లాంటి క్లోజప్ షాట్స్ వాడడని అన్నారు.

ఐతే రాజమౌళి, సందీప్ వంగ ఇద్దరి మీద ఆర్జీవికి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. కొత్త దర్శకులు ఎవరైనా సరే సందీప్ వంగ లాంటి సినిమాలు చూసి నేర్చుకునే ఛాన్స్ ఉందని అన్నారు ఆర్జీవి. ఐతే ఇదే ఇంటర్వ్యూలో సందీప్ వంగ మాత్రం రాజమౌళి తన కన్నా బిగ్గర్ అండ్ బెటర్ డైరెక్టర్ అని అన్నాడు. ఆర్జీవి చేసిన కామెంట్స్ ని సందీప్ వంగ వ్యతిరేకించాడు.

యానిమల్ సినిమాలో క్లాప్ కొట్టిన సీన్స్..

ఇదే ఇంటర్వ్యూలో సందీప్ వంగ వర్కింగ్ స్టైల్ గురించి ఆర్జీవి కామెంట్స్ చేశాడు. ముఖ్యంగా యానిమల్ సినిమాలో తను క్లాప్ కొట్టిన సీన్స్ తో పాటుగా నచ్చని క్యారెక్టరైజేషన్ గురించి కూడా ప్రస్తావించారు. ఇద్దరు క్రేజీ ఫిల్మ్ మేకర్స్ తమ సినిమా అనుభవాలను ఒక ఇంటర్వ్యూ లో షేర్ చేసుకోవడం ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుంది.

ఆర్జీవి అంటే సందీప్ వంగాకి బాగా ఇష్టం. అందుకే ఒకసారి శివ తీసిన ఆర్జీవి ఒక సినిమా చేస్తే చూడాలని ఉందన్న విషయాన్ని ఎప్పుడూ చెబుతూ ఉంటాడు. ఆర్జీవి సందీప్ వంగ మధ్య ఈమధ్య ఎక్కువ ఇంటరాక్షన్ జరుగుతుంది. అర్జున్ రెడ్డి సినిమాతో డైరెక్టర్ గా తన మార్క్ చాటిన సందీప్ వంగ అదే సినిమా బాలీవుడ్ లో తీసి సూపర్ హిట్ కొట్టాడు.

ఇక నెక్స్ట్ యానిమల్ అంటూ అతను చేసిన సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. నెక్స్ట్ ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు సందీప్ వంగ.