రితేష్ దేశ్‌ముఖ్ - ఆర్జీవీ కలయికలో మూవీ.. ఆగలేకపోతున్నానంటూ వర్మ పోస్ట్!
రితేష్ దేశ్‌ముఖ్ విషయానికి వస్తే.. సినిమా నటుడిగా, టెలివిజన్ వ్యాఖ్యాతగా, దర్శకుడిగా, నిర్మాతగా కూడా పేరు సొంతం చేసుకున్నారు.
By: Madhu Reddy | 23 Sept 2025 11:02 AM ISTటాలీవుడ్ డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్న రామ్ గోపాల్ వర్మ అప్పట్లోనే బాలీవుడ్లో పలు సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న వర్మ.. దర్శకుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా సినిమాలు నిర్మిస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు అయిన రితేష్ దేశ్‌ముఖ్ తో వర్మ ఒక కొత్త సినిమా చేయబోతున్నట్లు సమాచారం. అంతేకాదు ఇప్పుడు తమ ఇద్దరి కలయికలో రాబోతున్న సినిమా కోసం తాను వెయిట్ చేయలేకపోతున్నాను అంటూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అసలు విషయంలోకి వెళ్తే.. రితేష్ దేశ్‌ముఖ్ మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ పాత్రలో నటిస్తున్నారు. మహారాష్ట్రకు గర్వకారణంగా నిలిచేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తామని రాంగోపాల్ వర్మ తెలిపారు. ఈ ప్రాజెక్టులో రితేష్ దేశ్‌ముఖ్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తారని వర్మ స్పష్టం చేశారు. ఈ మేరకు వీరిద్దరికి సంబంధించిన ఫోటోని వర్మ షేర్ చేస్తూ.. "నేను రాజా శివాజీతో ఉన్నాను.. చూడటానికి వేచి ఉండలేకపోతున్నాను.. రితేష్ దేశ్‌ముఖ్ తదుపరి దర్శకత్వంలో వస్తున్న ఛత్రపతి శివాజీ మూవీలో నేను భాగమవుతున్నాను. దీని గురించి ఏ వార్త నేను విన్నా సరే ఇది భారతదేశంలో అత్యుత్తమ చారిత్రాత్మక చిత్రం అవుతుంది" అంటూ పోస్ట్ పెట్టడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది వైరల్ గా మారుతోంది.
మొత్తానికైతే రాంగోపాల్ వర్మ , రితేష్ దేశ్‌ముఖ్ కలయికలో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మూవీ రాబోతోందని తెలిసి అందరూ సినిమా కోసం చాలా ఎక్సైట్ గా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రితేష్ దేశ్‌ముఖ్ విషయానికి వస్తే.. సినిమా నటుడిగా, టెలివిజన్ వ్యాఖ్యాతగా, దర్శకుడిగా, నిర్మాతగా కూడా పేరు సొంతం చేసుకున్నారు. ఈయన ఎవరో కాదు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావ్ దేశ్‌ముఖ్ తనయుడు 2018 టైమ్స్ ఆఫ్ ఇండియా టాప్ 20 మోస్ట్ డిజైరబుల్ మెన్ ఆఫ్ మహారాష్ట్రలో మూడవ స్థానాన్ని దక్కించుకున్నారు. పలు చిత్రాలలో హీరోగా చేసి ప్రేక్షకులను అలరించిన ఈయన.. ఇప్పుడు హీరోగానే కాకుండా దర్శకుడిగా కూడా అలాగే నిర్మాతగా కూడా ఒకే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా నటిస్తున్న ' రాజా శివాజీ' సినిమాను వచ్చే యేడాది విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రంతో పాటు మస్తీ 4, ధమాల్ 4 వంటి చిత్రాలలో కూడా నటిస్తున్నారు.
పోతే ఈయన హిందీ సినిమాలే కాకుండా మరాఠి సినిమాలు కూడా చేశారు. అలాగే ఎన్నో కార్యక్రమాలకు హోస్ట్ గా కూడా వ్యవహరించారు. ఇప్పుడు భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ రాజా శివాజీ మూవీతో రితేష్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి. పైగా వర్మ కలయిక కావడంతో అంచనాలు ఇప్పుడు మరింత పెరిగిపోయాయి.
