Begin typing your search above and press return to search.

నీ ఒపీనియన్స్ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టు: RGV

"నీలాంటి అసభ్యకరమైన, డర్టీ గయ్ ని భరించడానికి నీ ఇంట్లో ఆడవాళ్లు సిద్ధంగా ఉంటే.. నువ్వు నీ మోరల్ పోలీసింగ్ ని వాళ్ల దగ్గర చూపించుకో" అంటూ వర్మ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

By:  M Prashanth   |   23 Dec 2025 9:45 PM IST
నీ ఒపీనియన్స్ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టు: RGV
X

'దండోరా' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యల ప్రకంపనలు ఇండస్ట్రీలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే సింగర్ చిన్మయి, యాంకర్ అనసూయ, మహిళా సంఘాలు ఈ విషయంపై సీరియస్ గా స్పందించగా.. ఇప్పుడు కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ రంగంలోకి దిగారు. ఎప్పుడూ తనదైన శైలిలో స్పందించే వర్మ, ఈ ఇష్యూపై శివాజీని ఉద్దేశించి చాలా ఘాటుగా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వర్మ తన ట్వీట్ ని చాలా వ్యంగ్యంగా మొదలుపెట్టారు. అసలు శివాజీ ఎవరో తనకు పూర్తిగా తెలియదన్నట్లుగా సెటైర్ వేశారు. "ఆ ఫెలో పూర్తి పేరు కూడా నాకు తెలియదు, అందుకే ఇక్కడ కామెంట్ చేస్తున్నాను" అంటూ వర్మ తన అభిప్రాయాన్ని చెప్పారు. "హేయ్ శివాజీ.. నువ్వు ఎవరివైనా సరే" అంటూ డైరెక్ట్ గా ఎటాక్ స్టార్ట్ చేశారు. శివాజీ వాడిన భాషకు కౌంటర్ గా వర్మ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు.

శివాజీపై వర్మ కొన్ని కఠినమైన పదాలు వాడారు. "నీలాంటి అసభ్యకరమైన, డర్టీ గయ్ ని భరించడానికి నీ ఇంట్లో ఆడవాళ్లు సిద్ధంగా ఉంటే.. నువ్వు నీ మోరల్ పోలీసింగ్ ని వాళ్ల దగ్గర చూపించుకో" అంటూ వర్మ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అంటే నీ నీతులు నీ ఇంటి వరకే పరిమితం చేసుకోమని ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చారు.

అక్కడితో ఆగకుండా బయట సమాజంలో ఉన్న మహిళల గురించి కూడా వర్మ ప్రస్తావించారు. "సొసైటీలో ఉన్న ఇతర మహిళల గురించి గానీ, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ల గురించి గానీ, ఇంకెక్కడైనా సరే.. నీ ఒపీనియన్స్ ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టు" అంటూ చాలా ఘాటుగా విమర్శించారు. శివాజీకి ఇండస్ట్రీ నుంచే కాకుండా ఇలా వర్మ లాంటి దర్శకుల నుంచి కూడా వ్యతిరేకత రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

సాధారణంగా వర్మ ఇలాంటి విషయాల్లో పెద్దగా కలగజేసుకోరు, కానీ శివాజీ చేసిన కామెంట్స్ "మోరల్ పోలీసింగ్" లా ఉండటంతో వర్మ తనదైన స్టైల్ లో రియాక్ట్ అయినట్లు ఉందని. నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మహిళల స్వేచ్ఛ విషయంలో వర్మ ఎప్పుడూ సపోర్టివ్ గానే ఉంటారని మరికొందరు అంటున్నారు. ఇక శివాజీ క్షమాపణలు చెప్పిన వీడియో బయటకు వచ్చినప్పటికీ, వర్మ వేసిన ఈ ట్వీట్ బాంబ్ వ్యవహారాన్ని ఇంకా చల్లారనివ్వడం లేదు. మరి ఇంకెంత మంది దీనిపై రియాక్ట్ అవుతారో చూడాలి.