చిరుకి క్షమాపణ.. పెద్దిపై పొగడ్త.. ఇదంతా 'శివ' కోసమేనా వర్మ?
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరు వింటేనే కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్. ఆయన ట్వీట్ వేశాడంటే ఏదో ఒక సంచలనం ఉండాల్సిందే.
By: M Prashanth | 11 Nov 2025 1:59 PM ISTరామ్ గోపాల్ వర్మ.. ఈ పేరు వింటేనే కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్. ఆయన ట్వీట్ వేశాడంటే ఏదో ఒక సంచలనం ఉండాల్సిందే. ముఖ్యంగా కొందరిని టార్గెట్ చేస్తూ వర్మ వేసే సెటైర్లు, విమర్శలు ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటాయి. కానీ, గత కొద్ది రోజులుగా సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ఆర్జీవీ సడన్‌గా "మంచి బాలుడు" మోడ్‌లోకి వెళ్లాడు అనే కామెంట్స్ వస్తున్నాయి. ఆయన నుంచి వస్తున్న పాజిటివ్ వైబ్స్ చూసి జనం షాక్ అవుతున్నారు. "ఇది నిజంగా మన వర్మేనా?" అని మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
ఈ మార్పుకు 'శివ' 4K రీ రిలీజ్ ప్రమోషన్స్ కారణమనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. 'శివ' (నవంబర్ 14న రీ రిలీజ్) గురించి రీసెంట్ గా టాలీవుడ్ స్టార్స్ ప్రముఖులలు ఇచ్చిన వీడియో బైట్ లో మెగాస్టార్ చిరంజీవి గొప్పగా మాట్లాడారు. దానికి రెస్పాన్స్‌గా వర్మ.. "థాంక్స్" అని సింపుల్‌గా చెప్పకుండా, "నేను మిమ్మల్ని ఎప్పుడైనా బాధపెట్టి ఉంటే క్షమించండి" అంటూ ట్విట్టర్‌లో పబ్లిక్‌గా ఎమోషనల్ క్షమాపణ చెప్పారు. కెరీర్ మొదట్లో వర్మ చిరంజీవితో ఒక సినిమా స్టార్ట్ చేసి, బాలీవుడ్ కి జంప్ చేశారు. ఆ విషయంలో తనదే తప్పని కూడా వర్మ పలుమార్లు క్లారిటీ ఇచ్చారు.
ఇక మరోసారి శివ రీ రిలీజ్ లో ట్వీట్ రూపంలో క్షమాపణ చెప్పారు. అయితే 'శివ' ప్రెస్ మీట్‌లో ఒక జర్నలిస్ట్ "చిరంజీవి గారి మీద ప్రేమ సడన్‌గా ఎందుకు మారింది?" అని అడిగితే... వర్మ దాన్ని స్కిప్ చేస్తూ, "నేను చెప్పాలనుకున్నది ట్విట్టర్‌లో చెప్పాను, ఇక్కడ 'శివ' గురించి మాట్లాడదాం" అని సున్నితంగా దాటవేశారు.
ఆ ఒక్క షాక్ నుంచి తేరుకోకముందే, వర్మ మరో మెగా హీరోపై పొగడ్తల వర్షం కురిపించారు. రామ్ చరణ్ 'పెద్ది' నుంచి వచ్చిన "చికిరి చికిరి" సాంగ్ చూసి ఆర్జీవీ పాజిటివ్ రివ్యూ ఇచ్చాడు. "సినిమాలోని ప్రతీ క్రాఫ్ట్ హీరోను ఎలివేట్ చేయడానికే ఉండాలి. చాలా కాలం తర్వాత రామ్ చరణ్‌ను అంత 'రా, రియల్, ఎక్స్‌ప్లోజివ్' ఫామ్‌లో చూశాను" అంటూ ట్వీట్ చేశారు.
అక్కడితో ఆగలేదు. డైరెక్టర్ బుచ్చిబాబును ఆకాశానికి ఎత్తేశారు. "అనవసరమైన భారీ సెట్లు, వందల మంది డాన్సర్ల మధ్య హీరో ఒక చుక్కలా కాకుండా.. 'రా'గా ఉన్నప్పుడే బ్రైట్‌గా వెలుగుతాడు. ఆ పాయింట్ అర్థం చేసుకున్నందుకు నీకు హ్యాట్సాఫ్. ఫోకస్ ఎక్కడ ఉండాలో అక్కడే పెట్టావ్.." అంటూ బుచ్చిబాబు విజన్‌ను తెగ పొగిడేశారు.
ఇప్పుడు నెటిజన్ల మైండ్‌లో ఒకటే క్వశ్చన్ రన్ అవుతోంది. సడన్‌గా చిరుకు సారీ చెప్పడం, ఇప్పుడు రామ్ చరణ్‌ను ఇంతలా పొగడటం వెనుక అసలు స్కెచ్ ఏంటి? ఇదంతా 'శివ' 4K రీ-రిలీజ్ (నవంబర్ 14) ప్రమోషన్ కోసమేనా? అనే అనుమానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. 'శివ' రీ రిలీజ్‌ను వర్మ చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకున్నారు. దానికి మాగ్జిమమ్ హైప్ కావాలి. మెగాస్టార్ చిరంజీవికి సారీ చెప్పడం ద్వారా, మెగా ఐకాన్ రామ్ చరణ్‌ను పొగడటం ద్వారా.. వర్మ ఓ స్కెచ్ వేశాడనే కామెంట్స్ వస్తున్నాయి. ఈ స్ట్రాటజీతో యాంటీ మెగా ఫ్యాన్స్ నుంచి వచ్చే నెగటివిటీని తగ్గించి, అదే మెగా ఫ్యాన్స్‌ను 'శివ' థియేటర్ల వైపు తిప్పుకునే మాస్టర్ ప్లాన్ అని కొందరు నెటిజన్లు అంటున్నారు. మరి వర్మ క్షమాపణ, పొగడ్తల కారణంగా శివకు ఏమైనా కలిసిస్తుందో లేదో చూడాలి.
