వర్మా జీ పోలీస్ స్టేషన్ లో ఇంకెంత కాలం?
సినిమా షూట్ ఏ స్టేజ్ లో ఉందన్నది క్లారిటీ లేదు. సినిమా నుంచి ఎలాంటి ప్రచార చిత్రాలు కూడా రిలీజ్ కాలేదు.
By: Srikanth Kontham | 26 March 2026 11:00 AM ISTసంచలనాల రామ్ గోపాల్ వర్మ ఏదైనా ప్రాజెక్ట్ మొదలుపెట్టారంటే? దానిపై అంచనాలు ఎలా ఉన్నా? చర్చ మాత్రం మామూలుగా జరగదు. ప్రస్తుతం వర్మ బాలీవుడ్‌లో `పోలీస్ స్టేషన్ మే బూత్` అనే టైటిల్‌తో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసి చాలా కాలం అవుతుంది. షూటింగ్ కూడా మొదలైంది. కానీ ఆ తర్వాత ఎలాంటి అప్ డేట్ లేదు. ఇది జరిగి ఏడాది అవుతుంది. దీంతో సినిమా పోలీస్ స్టేషన్‌లోనే ఉండిపోతుందా? లేక జనం ముందుకు వస్తుందా? అన్న సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి.
నిజానికి ఈ సినిమా వర్మ కెరీర్‌లో చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే దాదాపు 27 ఏళ్ల తర్వాత `సత్య` హీరో మనోజ్ బాజ్‌పాయీతో వర్మ కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. వీరిద్దరి కాంబినేషన్ అంటేనే ఒకప్పుడు ఒక సంచలనం. దీనికి తోడు జెనీలియా దేశ్‌ముఖ్, రమ్యకృష్ణ వంటి క్రేజీ నటీనటులు కూడా ఈ సినిమాలో నటిస్తుండటంతో బాలీవుడ్ వర్గాల్లో దీనిపై ఆసక్తి నెలకొంది. హర్రర్ కామెడీ అనే కొత్త జోనర్‌లో వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
సినిమా షూటింగ్ అప్‌డేట్స్ విషయానికి మొదలైన నాటి నుంచి వర్మ ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు.
సినిమా షూట్ ఏ స్టేజ్ లో ఉందన్నది క్లారిటీ లేదు. సినిమా నుంచి ఎలాంటి ప్రచార చిత్రాలు కూడా రిలీజ్ కాలేదు.
వర్మ ఈ మధ్య కాలంలో తన సినిమాల్లో ఏ ఐ టెక్నాలజీని విరివిగా వాడుతున్నారు. `పోలీస్ స్టేషన్ మే బూత్` పోస్టర్ల విషయంలో కూడా ఆయన ఏఐ వాడకంపై కొన్ని విమర్శలు వచ్చాయి. బహుశా ఈ సినిమాలో గ్రాఫిక్స్ , విఎఫ్ ఎక్స్ పనులు ఎక్కువగా ఉండటం వల్లే మేకింగ్ లేట్ అవుతుందనే కొంత సమాచారం ఉంది. క్వాలిటీ విషయంలో వర్మ ఎక్కడా రాజీ పడరు. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుంది? అన్న ప్రశ్నకు స్వయంగా ఆర్జీవీనే సమాధానం చెప్పాలి.
కానీ వర్మ మాత్రం తన సినిమా పనులు వదిలేసి ఇతర సినిమాల్ని ప్రమోట్ చేయడం పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. ఇటీవలే రిలీజ్ అయిన `ధురంధర్ 2` భారీ విజయం సాధించడంతో? ఆసినిమా లో నటీనటుల్ని, దర్శకుడిని ఆకాశానికి ఎత్తడమే పనిగా ట్వీట్లు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇది చూసే ఆయన అభిమానులు, ఫాలోవర్లు పోలీస్ స్టేషన్ సినిమా సంగతేంటో తొందరగా తేల్చండి అంటూ సోషల్ మీడియా వేదికగా అడుగుతున్నారు.
