ఆర్జీవీపై మరో కేసు.. ఈసారి కంప్లైంట్ ఇచ్చింది మాజీ IPS ఆఫీసర్
ఇక అసలు వివాదానికి వస్తే... ఈ వెబ్ సిరీస్ లో తన అనుమతి లేకుండా ఆమె తన పేరును వాడారని అంజనా సిన్హా ఆరోపించారు.
By: M Prashanth | 19 Sept 2025 12:28 AM ISTటాలీవుడ్ లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్. తరచూ వివాదాల్లో చిక్కుకునే ఆయన.. తాజాగా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి ఆయనకు లీగల్ చిక్కు వచ్చి పడింది. రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అంజనా సిన్హా వర్మపై ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో వర్మపై కేసు నమోదు చేశారు.
ఈ వివాదానికి మూల కారణం దహనం అనే వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ కు వర్మ నిర్మాతగా ఉన్నారు. ఆయన నిర్మాంలో రూపొందిన తొలి వెబ్ సిరీస్ గానూ ఇది గుర్తింపు పొందింది. 2022 ఏప్రిల్ 14 నుంచి ఇది స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సిరీస్ మావోయిస్టు నేపథ్యంతో రూపొందింది. ఇందులో ఒక మావోయిస్టు నాయకుడి హత్య, అతని కొడుకు తీసుకునే ప్రతీకార ప్రయాణం కథగా సాగుతుంది. అగస్త్య మంజు దర్శకత్వం వహించిన ఈ సిరీస్ తన రాజకీయ నేపథ్యంతో, ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇక అసలు వివాదానికి వస్తే... ఈ వెబ్ సిరీస్ లో తన అనుమతి లేకుండా ఆమె తన పేరును వాడారని అంజనా సిన్హా ఆరోపించారు. అంతేకాకుండా సిరీస్ లోని కొన్ని సన్నివేశాలు ఆమె సూచనల ఆధారంగానే చేర్చామని వర్మ చెప్పారు. అయితే ఇవన్నీ అవాస్తవాలనీ, తన ప్రమేయం లేకుండా సిరీస్ లో పేరును ప్రస్తావించడంతోపాటు కొన్ని సన్నివేశాలు అమె చెప్పినట్లుగా చిత్రీకరించారని చెప్పడం కూడా అబద్ధమనేనని సిన్హా అన్నారు.
ఈ సిరీస్ లో ఆమె సహకారం ఉందన్న వర్మ వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా పరిగణించారు. ఈ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తన పేరును దుర్వినియోగం చేసినందుకు వర్మపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సిన్హా పోలీసులను కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసుపై రామ్ గోపాల్ వర్మ ఇంకా స్పందించలేదు.
మరి ఆయన నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి. ఈ కేసు వివాదస్పదంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే గతంలోనూ రాజకీయలపై సినిమాలు, పలు వ్యాఖ్యలతో వర్మ లీగల్ చిక్కుల్లో ఇరుక్కున్నారు. తాజాగా వెబ్ సిరీస్ తో మరోసారి న్యాయపరమైన వివాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
