గొప్పవాళ్లే సింగిల్స్.. సంచలన పోస్ట్ పెట్టిన వర్మ!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రాంగోపాల్ వర్మ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.
By: Madhu Reddy | 28 Aug 2026 12:14 PM ISTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రాంగోపాల్ వర్మ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. నిత్యం ఏదో ఒక విషయంపై స్పందిస్తూ వివాదాలకు దారి తీసే రాంగోపాల్ వర్మ.. వివాదాస్పద కామెంట్లతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ముఖ్యంగా ఏం మాట్లాడినా సరే విమర్శలు ఎదుర్కోవడం ఆయనకు అలవాటైపోయింది అంటూ నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇక మొన్నటి వరకు విద్యార్థులు, నీట్ అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించిన రాంగోపాల్ వర్మ.. ఇప్పుడు ఏకంగా గొప్ప వాళ్లే సింగిల్స్ అంటూ సంచలన పోస్ట్ పెట్టి అందరిని ఆశ్చర్యపరిచారు.
సక్సెస్ఫుల్ వెనుక వైఫ్ లేదు..
నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక కాంట్రవర్సీ టాపిక్ తో వార్తల్లో నిలిచే రాంగోపాల్ వర్మ .. ఈసారి మరో సంచలన పోస్ట్ పెట్టి అందరిని ఆశ్చర్యపరిచారు. సాధారణంగా ప్రతి మగవాడి విజయం వెనుక ఆడది ఉంటుంది అనే సామెత ఎప్పటికప్పుడు వినిపిస్తూ ఉంటుంది. మగవాళ్ళు లైఫ్లో సక్సెస్ అయ్యారు అంటే.. వారిని వెనకుండి నడిపించిన ఆడవారిదే ఆ సక్సెస్ క్రెడిట్ అంటూ కామెంట్లు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆ కామెంట్స్ ని చిట్టాలో పడేయండి అనే రేంజ్ లో వర్మ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి.
సింగిల్సే గొప్పవాళ్ళు - రాంగోపాల్ వర్మ
వర్మ ఎక్స్ హ్యాండిల్ ద్వారా ఇలా పోస్ట్ పెట్టారు. పీఎం, సీఎం, బాటా, టాటా, కలాం, సల్మాన్, రాహుల్, యోగి.. చివరికి బాబా రామ్ దేవ్ కూడా సింగిలే.. ప్రతి సక్సెస్ఫుల్ పురుషుడి వెనుక మహిళ లేదు. ఉండదు..ఇలా సింగిల్స్ గా ఉన్న వారంతా ఎప్పటికీ గ్రేట్.. వీరంతా సింగిల్సే ఇప్పుడు దేశంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు అంటూ రాంగోపాల్ వర్మ పోస్ట్ పెట్టారు.
ఈ లిస్టులో మీరెక్కడ?
ఇకపోతే రాంగోపాల్ వర్మ గొప్పవాళ్ళు ఎప్పుడు సింగిల్ గానే ఉంటారు అని, గొప్ప వాళ్ళ సక్సెస్ వెనక మహిళలు ఉండరు అంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇవి చూసిన నెటిజన్స్ ఇందులో మీరు ఎక్కడ? అంటూ ఫన్నీగా ప్రశ్నిస్తున్నారు. మరికొంతమంది ఇప్పుడు ఆయన సక్సెస్ఫుల్ మెన్ కాదు అంటూ మరికొంతమంది సెటైర్ వేస్తున్నారు . ఏది ఏమైనా రాంగోపాల్ వర్మ షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా .. దానిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
