Begin typing your search above and press return to search.

ఆర్జీవీ మెగాస్టార్ కాంబోలో మూవీ...ఇంట్రెస్టింగ్ ఫ్లాష్ బ్యాక్

తాజాగా మెగాస్టార్ చిరంజీవికి దర్శకుడు రాం గోపాల్ వర్మ క్షమాపణలు చెప్పారు. అది కూడా చాలా హార్ట్ టచింగ్ గా ఉంది.

By:  Satya P   |   10 Nov 2025 9:56 AM IST
ఆర్జీవీ మెగాస్టార్ కాంబోలో మూవీ...ఇంట్రెస్టింగ్ ఫ్లాష్ బ్యాక్
X

తాజాగా మెగాస్టార్ చిరంజీవికి దర్శకుడు రాం గోపాల్ వర్మ క్షమాపణలు చెప్పారు. అది కూడా చాలా హార్ట్ టచింగ్ గా ఉంది. ధన్యవాదాలు చిరంజీవి గారూ, ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అనుకోకుండా బాధపెట్టి ఉంటే హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను.. మీ విశాల హృదయానికి మరోసారి ధన్యవాదాలు అని వర్మ తాజాగా ట్వీట్ చేశారు. దానికి ముందు శివ సినిమా రీ రిలీజ్ సందర్భంగా ఆ మూవీ గురించి ఎంతో గొప్పగా మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. ఆయన అందులో రాం గోపాల్ వర్మ టాలెంట్ ని కొనియాడారు. ఇక దానికి బదులిస్తూ ఆర్జీవీ థాంక్స్ తో సరిపెట్టకుండా సారీ దాకా వెళ్ళారు. మరి ఎందుకీ సారీ అన్నది అంటే ఎవరికి వారుగా మాట్లాడుకుంటున్నారు.

సినిమా స్టార్ట్ చేసి :

ఇదిలా ఉంటే ఆర్జీవీ మెగాస్టార్ చిరంజీవి కాంబోలో 1997 ప్రాంతంలో ఒక సినిమా స్టార్ట్ అయిన సంగతి చాలా మందికి గుర్తు ఉందో లేదో తెలియదు కానీ ఆ అద్భుతం జరిగింది. అప్పట్లో ఆర్జీవీ టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ మంచి పొజిషన్ లో ఉన్నారు. ఇక టాలీవుడ్ లో టాప్ హీరోగా మెగాస్టార్ గా చిరంజీవి ఉన్నారు. వీరి కాంబోలో ఒక క్రేజీ మూవీ స్టార్ట్ అయింది. దాని పేరు వినాలని ఉంది. ఈ మూవీలో మెగాస్టార్ సరసన టబు మెయిల్ హీరోయిన్ గా ఉంటుంది. ఈ మూవీకి సంగీతం మణి శర్మ. పాటలు కూడా చాలా అద్భుతంగా వచ్చాయి.

కొంత షూట్ జరిగింది :

ఈ మూవీ కొంత షూటింగ్ జరిగింది. ఆ తరువాత సడెన్ గా ఆర్జీవీ ముంబైలో ఒక షూటింగ్ కోసం మధ్యలో ఈ సినిమాను వదిలేసి వెళ్ళిపోయారు అని ప్రచారంలో ఉంది. ఆ తరువాత ఏమి జరిగింది అన్నది పక్కన పెడితే ఈ మూవీ మాత్రం తిరిగి స్టార్ట్ కాలేదు, కొంత వరకూ పాటల చిత్రీకరణ కొంత షూటింగ్ పార్ట్ అయిన తరువాత మెగాస్టార్ మూవీ ఇలా ఆగిపోవడం ఆనాడు ఒక అతి పెద్ద సెన్సేషన్ గానే అంతా భావించారు. ఎందుకంటే మెగాస్టార్ తో సినిమా అంటే ఎంతో మంది వెయిట్ చేసే రోజులు అవి ఆయన కెరీర్ పీక్స్ లో ఉంది. నంబర్ వన్ హీరో. అలాంటి మెగాస్టార్ ఆర్జీవీ కాంబో అంటే ఎంతో ఇంట్రెస్ట్ ఆడియన్స్ లో ఉంది. కానీ ఈ మూవీ మాత్రం బయటకు రాలేదు. ఆ తరువాత మళ్ళీ ఈ ఇద్దరి కాంబో కలిసింది లేదు.

ఒక ల్యాండ్ మార్క్ గా :

అయితే ఈ ఇద్దరూ అపుడు మంచి పీక్స్ లో ఉన్నారు మెగా స్టార్ మోజు ఆర్జీవీ లాజిక్ అన్నీ మిక్స్ చేస్తూ వినాలని ఉంది మూవీ కనుక రిలీజ్ అయి ఉంటే ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచేదేమో అన్న చర్చ అయితే ఉంది. అంతే కాదు ల్యాండ్ మార్క్ గా కూడా ఉండే చాన్స్ కొట్టిపారేయలేమని అంటారు. ఆర్జీవీ అప్పట్లో మంచి సక్సెస్ లో ఉన్నారు. కానీ ఆయన ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారా లేదా అన్నది ఒక మిస్టరీ. ఏది ఏమైనా ఆర్జీవీ తాజా మెగాస్టార్ కి సారీ చెప్పిన నేపధ్యంలో దీనిని కూడా నాటి సినీ విషయాలు గుర్తు ఉన్న సినీ ప్రియులు ఇపుడు గుర్తు చేసుకుంటున్నారు.