Begin typing your search above and press return to search.

వర్మ మళ్లీ బాలీవుడ్ కి.. ఆశలన్నీ ఆ మూవీ పైనే!

రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో బాలీవుడ్లో..'పోలీస్ స్టేషన్ మే భూత్' అనే సినిమా తెరకెక్కుతోంది .

By:  Madhu Reddy   |   24 Oct 2025 11:03 AM IST
వర్మ మళ్లీ బాలీవుడ్ కి.. ఆశలన్నీ ఆ మూవీ పైనే!
X

రామ్ గోపాల్ వర్మ..ఈయన పేరే ఒక బ్రాండ్.. ఇప్పుడు రాజమౌళి పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎలా అయితే గుర్తింపు తెచ్చుకున్నారో.. ఈయన కంటే ముందే ఆర్జీవీ పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన తెలుగు, హిందీ భాషల్లో తీసిన సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేశాయి. నాగార్జునతో తీసిన శివ మూవీ తెలుగు ఇండస్ట్రీ రూపురేఖల్ని మార్చేసింది. హిందీలో రాంగోపాల్ వర్మ డైరెక్షన్లో వచ్చిన సర్కార్, సత్యా వంటి సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీని మార్చేశాయి. అలా దర్శకుడిగా గొప్ప పేరు తెచ్చుకున్న ఈయన ఈ మధ్యకాలంలో ఎలాంటి సినిమాలు చేస్తున్నారో చెప్పనక్కర్లేదు. ఎక్కువగా క్రైమ్, అడల్ట్ కంటెంట్ ఉండే సినిమా స్టోరీలను ఎంచుకుంటూ స్టార్ దర్శకుడిగా ఉన్న ఈయన తన పేరుని మొత్తం చెడగొట్టుకున్నారు అంటూ ఫ్యాన్స్ కూడా కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే.

పైగా గత పదేళ్లలో ఈయన తీసిన సినిమా ఒక్కటంటే ఒక్కటి కూడా పేరు తెచ్చిపెట్టలేదు. అయితే అలాంటి డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టారు. త్వరలోనే బాలీవుడ్ సినిమాతో రాబోతున్నారు. ప్రస్తుతం ఎక్కువగా బాలీవుడ్ సినిమాల పైనే ఫోకస్ పెట్టిన రాంగోపాల్ వర్మ తాజా ఇంటర్వ్యూలో తన డైరెక్షన్లో రాబోయే సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.. రాంగోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "నేను మళ్ళీ తిరిగి బాలీవుడ్ కి వెళ్తున్నాను. త్వరలోనే కొత్త హిందీ సినిమా షూటింగ్ ని ప్రారంభించబోతున్నాను. ప్రస్తుతం నా ఫోకస్ మొత్తం ఆ ప్రాజెక్టు పైనే ఉంది" అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.

రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో బాలీవుడ్లో..'పోలీస్ స్టేషన్ మే భూత్' అనే సినిమా తెరకెక్కుతోంది . ఈ సినిమాలో నటుడు, డైరెక్టర్ అయినటువంటి మనోజ్ బాజ్పేయి తో పాటు జెనీలియా డిసౌజా ప్రధాన పాత్రలో నటిస్తోంది.. ఈ సినిమా హారర్ కామెడీ జానర్ లో రాబోతుంది. మొత్తానికైతే బాలీవుడ్లోకి మళ్ళీ అడుగు పెడుతున్న వర్మ ఈ సినిమా పైనే ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.

ఈ ఏడాది జెనీలియా వరుస సినిమాలతో ప్రేక్షకుల్ని అలరిస్తోంది. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ నటించిన 'సితారే జమీన్ పర్' మూవీతో బీ టౌన్ ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. సౌత్ లో కిరీటిరెడ్డి, శ్రీలీల కాంబినేషన్లో వచ్చిన 'జూనియర్' సినిమాలో కూడా నటించింది.. అలా సితారే జమీన్ పర్ సినిమా వచ్చాక జెనీలియా నటనను మెచ్చుకుంటూ రాంగోపాల్ వర్మ నెక్స్ట్ తన సినిమాలో జెనీలియాని తీసుకోబోతున్నట్టు వెల్లడించారు..

రాంగోపాల్ వర్మ డైరెక్షన్లో వస్తున్న పోలీస్ స్టేషన్ మే భూత్ సినిమా కథ విషయానికి వస్తే.. ఓ పోలీస్ ఎన్కౌంటర్లో చనిపోయిన గ్యాంగ్ స్టర్ దెయ్యంగా మారి పోలీసులను ఎలా వెంటాడుతారు అనేది సినిమా స్టోరీ.. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది.. అయితే ఈ సినిమాలో భయానక దృశ్యాలతో పాటు కామెడీ కాన్సెప్ట్ కూడా ఉంటుంది అని వర్మ ఇటీవలే చిన్న క్లిప్ ద్వారా తెలియజేసిన విషయం తెలిసిందే.

ఈ మధ్యకాలంలో హార్రర్ కామెడీ జానర్ లో వచ్చిన చాలా సినిమాలు హిట్ కావడంతో రాంగోపాల్ వర్మ కూడా ఈ జానర్ ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది.. ఇక దెయ్యం సినిమాలు తీయడంలో రాంగోపాల్ వర్మ దిట్ట. ఈయన హాలీవుడ్ రేంజ్ లో ఉండే దెయ్యం సినిమాలను తెరకెక్కించారు.రాత్రి, దెయ్యం, భూత్ వంటి సినిమాలతో ప్రేక్షకులకు దడ పుట్టించిన ఆర్జీవి మరొకసారి పోలీస్ స్టేషన్ మే భూత్ అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతోంది.. ఈ సినిమాతో ఆర్జీవి కం బ్యాక్ అవుతారా అనేది చూడాలి.. ఇక రీసెంట్గా రాంగోపాల్ వర్మ ఇప్పటినుండి అన్ని మంచి సినిమాలే తీయడానికే ప్రయత్నిస్తానని అందుకే తిరిగి ముంబై వెళ్ళిపోతున్నట్టు ప్రకటించారు. అలా మళ్లీ పాత రాంగోపాల్ వర్మని చూడబోతున్నామని ఆయన మాట్లాడిన మాటలతో అర్థమవుతుంది.