Begin typing your search above and press return to search.

వ‌ర్మ లో రియ‌లైజేష‌న్ నిజ‌మేనా?

ఒక్క క్ష‌మాప‌ణ‌తో త‌ప్పంతా త‌న‌దేన‌ని..త‌న నోటి దురుసు కార‌ణంగానే అప్పుడు అన్న మాట‌ల‌కు ఇప్పుడు సారీ చెప్పిన‌ట్లు క్లియ‌ర్ గా తెలుస్తోంది.

By:  Srikanth Kontham   |   10 Nov 2025 2:17 PM IST
వ‌ర్మ లో రియ‌లైజేష‌న్ నిజ‌మేనా?
X

సంచ‌ల‌నాల రాంగోపాల్ వ‌ర్మ కొంత కాలంగా సైలెంట్ గా ఉంటోన్న సంగ‌తి తెలిసిందే. ఎవ‌రి పై ఎలాంటి కామెంట్లు చేయ‌లేదు. సినిమా వాళ్ల‌పైన గానీ, రాజ‌కీయ నాయ‌కులుపైగానీ ఎలాంటి కామెంట్లు, సెటైర్లు గుప్పించ‌డం లేదు. త‌న ప‌ని తాను చూసుకోవడం త‌ప్ప ఇత‌రుల విష‌యాల్లో వేలు పెట్ట‌డం లేదు. దేవుళ్ల‌పై కూడా నో కామెంట్ అన్న‌ట్లే క‌నిపిస్తోంది. దీంతో వ‌ర్మ‌ను విమ‌ర్శించే వాళ్లు కూడా త‌గ్గారు. డైరెక్ట‌ర్ గా కూడా ఏమంత బిజీగా లేడు. బాలీవుడ్ లో ఓ సినిమా తెర‌కెక్కిస్తున్నాడు. అదీ నెమ్మ‌దిగా సాగుతుంది. వ‌చ్చే ఏడాది రిలీజ్ అయ్యే ప్రాజెక్ట్ అది.

ప‌రిశ్ర‌మ‌లోనూ ఇదే చ‌ర్చ‌:

తాజాగా మెగాస్టార్ చిరంజీవికి వ‌ర్మ క్ష‌మాప‌ణ‌లు చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఒక్క క్ష‌మాప‌ణ‌తో త‌ప్పంతా త‌న‌దేన‌ని..త‌న నోటి దురుసు కార‌ణంగానే అప్పుడు అన్న మాట‌ల‌కు ఇప్పుడు సారీ చెప్పిన‌ట్లు క్లియ‌ర్ గా తెలుస్తోంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ చెప్ప‌ని క్ష‌మాప‌ణ ప‌ని గట్టుకుని ఇప్పుడే చెప్ప‌డం ఏంటి? అనే సందేహం చాలా మంది లో ఉంది. తాను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `శివ` సినిమా గురించి చిరంజీవి గొప్ప‌గా మాట్లాడారు అనే కార‌ణంతోనే క్ష‌మ‌ప‌ణ‌లు చెప్పాడా? లేక వ‌ర్మ‌లో నిజ‌మైన రియ‌లైజేష‌న్ క‌నిపిస్తుందా? అన్న చ‌ర్చ నెట్టింట సాగుతోంది.

చిరు-నాగ్ స్నేహం కార‌ణ‌మా?

అయితే చాలా మంది దీన్ని ఓ రియ‌లైజేష‌న్ గానే భావిస్తున్నారు. కొంత కాలంగా వ‌ర్మ సైలెంట్ గా ఉంటోన్న తీరును చూసి రియ‌లైజ్ అయ్యాడ‌నే కార‌ణంతోనే క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు? అని ఇండ‌స్ట్రీ ఇన్ సైడ్ వ‌ర్గాల్లో కూడా చ‌ర్చ జ‌రుగుతుంది. అలాగే మ‌రో చ‌ర్చ కూడా జరుగుతుందండోయ్. నాగార్జున‌కు చిరంజీవి ఎంతో క్లోజ్. ఇద్ద‌రు బెస్ట్ ప్రెండ్స్. చిరంజీవి గురించి నాగార్జున‌కు చాలా వ్య‌క్తిగ‌త విష‌యాలు తెలుసు. అలాగే నాగార్జున అంటే వ‌ర్మ‌కు ఎంతో ఇష్టం. త‌న‌కు డైరెక్ట‌ర్ గా అవ‌కాశం ఇచ్చాడు అన్న కార‌ణంగా నాగ్ అంటే ఎంతో సాప్ట్ కార్న్ తో వ‌ర్మ ఉంటాడు.

ఎవ‌రి ఇష్టం వారిది:

అలా నాగ్ -వ‌ర్మ స్నేహం, చిరు-నాగ్ బాండింగ్ కార‌ణంగా వ‌ర్మ ఓ మెట్టు దిగి ఉండొచ్చు అన్న‌ది మ‌రో వెర్ష‌న్. మ‌రికొంత మంది ఇదంతా వ‌ర్మ ఆడుతోన్న కొత్త నాటకం అన్న వాళ్లు లేక‌పోలేదు. `శివ` రీ-రిలీజ్ లో భాగంగా ఇండ‌స్ట్రీ నుంచి త‌న‌కు మ‌ద్ద‌తు కావాలంటే? ఇలా ఓ మెట్టు దిగి ఉండ‌క‌పోతే ఆ ప్ర‌భావం సినిమాపై ప‌డుతుంద‌ని..ఆ కార‌ణంగానూ వ‌ర్మ సైలెంట్ గా ఉన్నాడు? క్షమాప‌ణ‌లు చెబుతున్నాడు? అన్న‌ది మ‌రో వెర్ష‌న్. అలా చూసుకుంటే? వ‌ర్మ చిరంజీవికే కాదు ప‌రిశ్ర‌మ స‌హా చాలా మందికి క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి. కానీ ఆయ‌న సారీ చెప్పింది కేవ‌లం చిరంజీవికి మాత్రమే. మ‌రి వ‌ర్మ‌లో ఈ మార్పును ఎవ‌రు ఎలా తీసుకుంటారన్న‌ది వాళ్ల‌కే వ‌దిలేద్దాం.