Begin typing your search above and press return to search.

తమ్ముడూ నేనున్నానంటే కారణం నువ్వే : రామ్

ముఖ్యంగా ఒక అభిమాని ఎలా ఉంటాడు అన్న కాన్సెప్ట్ తోనే తీసిన ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా అని అన్నారు రామ్.

By:  Ramesh Boddu   |   19 Nov 2025 9:42 AM IST
తమ్ముడూ నేనున్నానంటే కారణం నువ్వే : రామ్
X

ఎనర్జిటిక్ స్టార్ ఉస్తాద్ రామ్ హీరోగా మహేష్ బాబు పి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ఆంధ్రా కింగ్ తాలూకా. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించింది. నవంబర్ 27న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కర్నూలులో జరిగింది. చిత్ర యూనిట్ సమక్షంలో జరిగిన ఆంధ్రా కింగ్ తాలూకా ఈవెంట్ కి రామ్ ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు ఎంతోమంది అటెండ్ అయ్యారు. ఈ ఈవెంట్ లో రామ్ స్పీచ్ ఫ్యాన్స్ ని హుశారెత్తించేలా చేసింది. ముఖ్యంగా ఒక అభిమాని ఎలా ఉంటాడు అన్న కాన్సెప్ట్ తోనే తీసిన ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా అని అన్నారు రామ్. తన ప్రతి ఒక్క ఫ్యాన్ ని ఉద్దేశించి మాట్లాడుతూ తమ్ముడూ నువ్వు ఉన్నావని నాకు తెలియకపోవచ్చు.. కానీ నేను ఒకడిని ఉన్నానంటే కారణం మాత్రం నువ్వే అని అన్నారు రామ్.

రామ్ స్పీచ్ మొదలు పెట్టడమే ఎలా ఉంది ట్రైలర్ అని ఫ్యాన్స్ ని అడిగాడు. ఇప్పటిదాకా బ్యాక్ టు బ్యాక్ మాస్ సినిమాలు చేశా.. ఇది వెరీ ఎమోషనల్ మూవీ.. మదర్ సెంటిమెంట్, ఫాదర్ సెంటిమెంట్, లవ్ స్టోరీస్ అన్నీ చేశా.. కానీ ఈ సినిమాకు ఫీలైన ఎమోషన్ ఏ సినిమాకు ఫీల్ అవ్వలేదని అన్నారు. ఎందుకంటే ఆ టైప్ కనెక్షన్ మనదని ఫ్యాన్స్ ని ఉద్దేశించి చెప్పారు రామ్.

ఇప్పటిదాకా నేను మిమ్మల్ని చూడలేదు.. మీరు నన్ను లైవ్ లో చూడలేదు. కానీ ఎప్పటినుంచో తెలుసు అన్న ఫీలింగ్ ఉంది చూశారా అదే ఈ సినిమా అని అన్నారు రామ్. ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా కెరీర్ లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పర్సనల్ ఫిల్మ్ అని అన్నారు రామ్. ఈ విషయాన్ని డైరెక్టర్ మహేష్ కి ఎప్పుడూ చెబుతానని అన్నాడు. ఎప్పటి నుంచో నా మనసులో ఉన్న ఎమోషన్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమాకు బ్యూటిఫుల్ టీం కుదిరిందని.. ఒక సినిమా బాగా రావడానికి టీం బాగా సపోర్ట్ చేయాలి ఈ సినిమాకు అది కుదిరిందని అన్నారు రామ్.

ముఖ్యంగా మైత్రి రవి ప్యాషనేట్ ప్రొడ్యూసర్.. ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ గా సినిమాను నెత్తి మీద పెట్టుకున్నారు. ఇప్పుడు మన నెత్తి మీద పెట్టారని అన్నారు రామ్. మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ అండ్ మెర్విన్.. పల్లవి చరణ్ లాగా ఉంటారు. ఈ మూవీతో తెలుగు పరిశ్రమకు వస్తున్నారు. వన్ ఆది ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ అవుతారని అన్నారు రామ్.

తెలుగులో ఫ్రెష్ సౌండ్ కావాలనే వీళ్లను తీసుకున్నాం.. మీరు విన్న పాటలు బాగున్నాయంటే అది వాళ్ల వర్క్ అని అన్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర సూపర్ స్టార్ గా చేశారు. ఈ సినిమాతో ఆయన నేను బాగా కనెక్ట్ అయ్యామని అన్నారు రామ్.

ఇక ఫ్యాన్స్ ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఈ సినిమా మీ గురించే.. మిమ్మల్ని తీసుకెళ్లి అక్కడ పెట్టానని అన్నారు రామ్. హీరోయిన్ భాగ్య శ్రీ గురించి రామ్ మాట్లాడుతూ.. చాలా ఏళ్ల తర్వాత గ్లామర్ గా కనిపిస్తూ బాగా పెర్ఫార్మ్ చేసే హీరోయిన్ వచ్చింది. ఆమె రేర్ కాంబినేషన్ అని అన్నారు రామ్. డైరెక్టర్ మహేష్ చూడటానికి చాలా ఇన్నోసెంట్ గా ఉంటాడు.. కానీ ట్రైలర్ చూశారుగా అని అన్నారు రామ్.

ఈమధ్య సౌండ్ ఎక్కువ ఉన్న సినిమాలు వస్తున్నాయి.. నేను అలాంటి సినిమాలే చేశా.. కానీ ఈ సినిమా మనలో సౌండ్స్ వచ్చేలా చేస్తుంది. మనం ఊగిపోతామని అన్నారు రామ్. ట్రైలర్ చూస్తేనే అది తెలుస్తుందని అన్నారు. ఇక ఈ ఈవెంట్ కి కోపరేట్ చేసిన పోలీస్ సిబ్బ్బందికి థాంక్స్ చెప్పారు రామ్.

రీసెంట్ గా జరిగిన కర్నూలు యాక్సిడెంట్ కి ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ వ్యక్తి కారణం. అతనొక్కడు తాగడం వల్ల 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్ అని అన్నారు రామ్.

ఇక చివర్లో ఫ్యాన్స్ ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఒక్కొక్కడికి చెబుతున్నా.. మై డియర్ ఫ్యాన్.. తమ్ముడు నువ్వున్నాని నాకు తెలియకపోవచ్చు. కానీ నేను ఒకడిని ఉన్నానంటే దానికి కారణం నువ్వే అని అన్నారు రామ్. ఫైనల్ గా 27న థియేటర్ లో కలుద్దాం.. మిమ్మల్ని అక్కడ చూసుకోవడానికి రెడీగా ఉండడని అన్నారు రామ్.

ఆంధ్రా కింగ్ ఈవెంట్ లో రామ్ స్పీచ్ ఎప్పటిలానే ఎనర్జిటిక్ గా ఉండగా ఈసారి రామ్ నిజంగానే సినిమాలో తను చేసిన ఫ్యాన్ రోల్ ని బాగా ఎక్కించేసుకుని ఉన్నాడని ఆయన్ స్పీచ్ తోనే అర్ధమయ్యింది. అందుకే ఫ్యాన్స్ ప్రతి ఒక్కరికి నువ్వున్నావని నాకు తెలియకపోవచ్చు అని అన్నారు. కానీ నేను ఉన్నానంటే మాత్రం కారణం నువ్వే అని ఫ్యాన్స్ ని ఉత్తేజపరిచే కామెంట్స్ చేశారు.

ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాతో రామ్ ఈసారి డిఫరెంట్ అటెంప్ట్ చేస్తున్నారు. సినిమా ట్రైలర్ చూస్తుంటే కచ్చితంగా సంథింగ్ స్పెషల్ అనిపించేలా ఉంది. మరి ఫ్యాన్ బయోపిక్ గా వస్తున్న రామ్ ఆంధ్రా కింగ్ తాలూకా ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నది చూడాలి.