రామ్ చరణ్ కి సర్జరీ సక్సెస్.. వైద్య బృందంతో ఆకట్టుకుంటున్న స్పెషల్ ఫోటో!
ఈ మేరకు సర్జరీ విజయవంతం అయింది. ఈ విషయాన్ని పెద్ది మూవీ మేకర్స్ అధికారికంగా దిగ్గజ వైద్య నిపుణులతో రామ్ చరణ్ కలిసి దిగిన ఫోటోని ప్రత్యేకంగా పంచుకుంటూ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
By: Madhu Reddy | 28 July 2026 3:27 PM ISTప్రముఖ డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ ఇటీవల నటించిన రూరల్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ పెద్ది. బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించింది. జూన్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రూ.400 కోట్ల క్లబ్లో చేరి సంచలన విజయం అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఆయన చేతి మణికట్టు వద్ద గాయమైంది. అయితే ఆ గాయం కారణంగా సినిమా షూటింగ్ నిలిపివేయకుండా ప్రమోషన్స్ లో కూడా పాల్గొని సినిమా పట్ల తనకున్న నిబద్దతను నిరూపించుకున్నారు. ప్రస్తుతం విరామం దొరకడంతో తన భార్య ఉపాసన , తల్లిదండ్రులు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ కొణిదెలతో కలిసి కోయంబత్తూర్ కి బయలుదేరిన రామ్ చరణ్ గంగా హాస్పిటల్ లో ప్రముఖ వైద్య బృందం సమక్షంలో సర్జరీ చేయించుకున్నారు.
రామ్ చరణ్ కి సర్జరీ పూర్తి.. పెద్ది మేకర్స్ స్పెషల్ విషెస్..
ఈ మేరకు సర్జరీ విజయవంతం అయింది. ఈ విషయాన్ని పెద్ది మూవీ మేకర్స్ అధికారికంగా దిగ్గజ వైద్య నిపుణులతో రామ్ చరణ్ కలిసి దిగిన ఫోటోని ప్రత్యేకంగా పంచుకుంటూ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. "పెద్ది సినిమా షూటింగ్ సమయంలో రాంచరణ్ గాయపడినప్పటికీ నొప్పిని భరిస్తూ కీలకమైన సన్నివేశాల షూటింగ్ ను పూర్తి చేశారు. ఆయన వృత్తిపట్ల చూపిన అంకితభావం ఎంతో స్ఫూర్తిదాయకం" అని వృద్ధి సినిమాస్ కూడా పేర్కొంది. త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని చిత్ర బృందం ఆకాంక్షించింది.
స్పెషల్ వైద్య బృందంతో ఆకట్టుకుంటున్న ఫోటో..
ఈ మేరకు పంచుకున్న ఫోటోలో రామ్ చరణ్ తో పాటు చేతి మణికట్టు వైద్య నిపుణులు అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. ప్రముఖ ఆర్తోపెడిక్ సర్జన్ డాక్టర్ ఎస్ రాజశేఖరన్, అంతర్జాతీయంగా పేరుపొందిన యూఎస్ మియామీకి చెందిన మణికట్టు స్పెషలిస్ట్ డాక్టర్ అలెంజాడ్రో బాడియా, డాక్టర్ ప్రవీణ్ భరద్వాజ్ లు.. సర్జరీ అనంతరం బెడ్ పై ఉన్న రామ్ చరణ్ తో కలిసి దిగిన ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. నిపుణుల సమక్షంలో ఆయనకు సర్జరీ దిగ్విజయంగా పూర్తయిన సందర్భంగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ.. వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇటు రాంచరణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
8 వారాలు విశ్రాంతి..
వైద్యులు తెలిపిన సమాచారం మేరకు.. రామ్ చరణ్ చేతికి సర్జరీ అయిన కారణంగా సుమారుగా 8 వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారట. పెద్ది సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వంలో చేయబోతున్నారు. ప్రస్తుతం పూర్తిగా రికవరీ అయిన తర్వాతనే రామ్ చరణ్, సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో రంగస్థలం సినిమా వచ్చి మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దాంతో మళ్లీ ఈ కాంబో తెరపైకి రాబోతోందని తెలియడంతో అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
