మెగా పవర్ వర్సెస్ మ్యాన్ ఆఫ్ మాసెస్!
ఈ సందర్భంగా తారక్ చిత్రం `డ్రాగన్` కి సంబంధించిన గ్లింప్స్ విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
By: Srikanth Kontham | 13 May 2026 6:02 PM ISTగ్లోబల్ స్టార్ల మధ్య ఆసక్తికరమైన పోరు నెలకొంటుందా? అంటే అవుననే అనాలి. `ఆర్ ఆర్ ఆర్` చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తదుపరి చిత్రాలతో పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు. మే మూడవ వారంలో ఇద్దరు హీరోల సినిమాలకు సంబంధించిన భారీ అప్‌డేట్స్ ఒకేసారి రావడం సోషల్ మీడియా వేదికగా అభిమానుల మధ్య సందడి , పోటీ వాతావరణం నెలకొంది. దీంతో చరణ్ వర్సెస్ తారక్ హంగామా ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మే 18 న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం `పెద్ది` ట్రైలర్ లాంచ్ అవుతుంది.
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఉత్తరాంధ్ర నేపథ్యంతో కూడిన రా అండ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతుంది. చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన పోస్టర్లు ఇప్పటికే సంచలనం సృష్టించగా? రాబోతున్న ట్రైలర్ సినిమా రేంజ్‌ను ఇంకేస్థాయికి తీసుకెళ్తుందో ఊహకే అందడం లేదు. చరణ్ మేకోవర్ - బుచ్చిబాబు మేకింగ్ స్టైల్ ట్రైలర్‌లో హైలైట్‌గా నిలవనున్నాయి. అలాగే చరణ్ సందడి ముగియకముందే? మే 20న మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు ప్రారంభం కానున్నాయి.
ఈ సందర్భంగా తారక్ చిత్రం `డ్రాగన్` కి సంబంధించిన గ్లింప్స్ విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. తారక్ పుట్టినరోజు కానుకగా రాబోతున్న `డ్రాగన్ `గ్లింప్స్ యూట్యూబ్ రికార్డులను తిరగరాయడం ఖాయమని నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇలా ఒకే వారంలో కేవలం రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు అగ్ర హీరోల అప్‌డేట్స్ వస్తుండటంతో ఎవరికి వ్యూస్ ఎక్కువ వస్తాయి? ఎవరి హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంటుంది? అనే అంశంపై ఫ్యాన్స్ మధ్య చిన్నపాటి యుద్ధమే జరుగుతోంది.
డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ పై రికార్డులను కొల్లగొట్టేందుకు రెండు వర్గాల అభి మానులు సిద్ధమవుతున్నారు. `ఆర్ ఆర్ ఆర్` తర్వాత ఇద్దరూ సోలో చిత్రాలతో వస్తుండటంతో ఎవరి స్టామినా ఎంత అనేది నిరూపించుకోవడానికి ఇదొక సవాలుగా మారుతోంది. ఈ రెండు సినిమాలూ పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో విడుదల కాబోతున్నాయి. దర్శకులు బుచ్చిబాబు - ప్రశాంత్ నీల్ ఇద్దరూ తమ తమ హీరోలను మునుపెన్నడూ చూడని రీతిలో ప్రెజెంట్ చేస్తున్నారని సమాచారం. ఈ క్రమంలో రెండు చిత్రాల ప్రమోషనల్ కంటెంట్ బాక్సాఫీస్ వద్ద భారీ హైప్‌ను క్రియేట్ చేయడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.
