Begin typing your search above and press return to search.

బ్రహ్మానందం ఇంటికి చరణ్, ఉప్సీ.. స్పెషల్ ఏంటంటే?

ఇప్పుడు వారిద్దరూ ఫ్రీ టైమ్ చూసుకుని హాస్యబ్రహ్మ బ్రహ్మనందం ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయన కుటుంబసభ్యులతో గడిపారు.

By:  M Prashanth   |   11 Aug 2025 10:57 AM IST
బ్రహ్మానందం ఇంటికి చరణ్, ఉప్సీ.. స్పెషల్ ఏంటంటే?
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన ఎప్పుడూ బిజీ బిజీగా ఉంటారన్న విషయం తెలిసిందే. అటు హీరోగా షూటింగ్స్ లో చరణ్.. ఇటు బిజినెస్ పనుల్లో ఉప్సీ మునిగితేలుతుంటారు. ఇప్పుడు వారిద్దరూ ఫ్రీ టైమ్ చూసుకుని హాస్యబ్రహ్మ బ్రహ్మనందం ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయన కుటుంబసభ్యులతో గడిపారు.


అందుకు సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందులో బ్రహ్మానందం కుటుంబ సభ్యులతో చరణ్, ఉపాసన ఆనందకరమైన క్షణాలను పంచుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. సరదాగా గడిపినట్లు అర్థమవుతోంది. ముఖ్యంగా చరణ్, బ్రహ్మనందం చాలా క్లోజ్ గా ఉన్న పిక్స్ తెగ చక్కర్లు కొడుతున్నాయి.


తమ ఇంటికి విచ్చేసిన వేళ రామ్ చరణ్,ఉపాసన దంపతులకు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బ్రహ్మనందం బహూకరించారు. గోల్డెన్ కలర్ లో విగ్రహం అద్భుతంగా ఉందని చెప్పాలి. అయితే రామ్ చరణ్ దంపతులతో బ్రహ్మానందం తన సతీమణి, కుమారులు, కోడళ్లు సహా మనవడు, మనవరాలుతో కలిసి గ్రూప్ ఫోటో కూడా దిగారు.


అదే సమయంలో పిక్స్ సూపర్ గా ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. బ్రహ్మీ, చరణ్ క్లోజ్ గా ఉన్న ఫోటోలు అయితే అదిరిపోయాయని చెబుతున్నారు. హ్యాపీ మూమెంట్స్ అంటూ హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇస్తున్నారు. అయితే రామ్ చరణ్, ఉపాసన దంపతులు.. బ్రహ్మానందం ఇంటికి ఎందుకు వెళ్లారో మాత్రం తెలియదు.

సాధారణంగా మీట్ అవ్వడానికి వెళ్లి ఉంటారని నెటిజన్లు అంటున్నారు. కాగా.. ఇప్పుడు చరణ్.. తన అప్ కమింగ్ మూవీ పెద్దితో బిజీగా ఉన్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ జోనర్ లో గ్రాండ్ గా రూపొదిద్దుకుంటోంది.

సినిమాలో నెవ్వర్ బిఫోర్ లుక్ లో చరణ్ కనపడనున్నారని ఇప్పటికే అందరికీ క్లారిటీ వచ్చేసింది. రీసెంట్ గా జిమ్ లో పిక్ ను వరుణ్ షేర్ చేయగా.. అందులో చరణ్ వేరే లెవెల్ లో ఉన్నారు. తన యాక్టింగ్ అండ్ లుక్స్ తో మూవీలో అదరగొట్టేటట్టు కనిపిస్తున్నారు. వచ్చే ఏడాది తన బర్త్ డే కానుకగా థియేటర్స్ లో సందడి చేయనున్నారు. మరి ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.