Begin typing your search above and press return to search.

మెగా 'ట్విన్స్' పేర్ల వెనుక అసలు స్టోరీ తెలుసా?

అబ్బాయికి శివరామ్‌ అని, అమ్మాయికి అన్వీరా దేవి అని పేర్లు పెట్టినట్లు తెలిపారు. అయితే ఆ కవలల పేర్లకు అర్థాలు, చరణ్- ఉప్సీ అభిప్రాయాలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

By:  M Prashanth   |   13 Feb 2026 10:55 AM IST
మెగా ట్విన్స్ పేర్ల వెనుక అసలు స్టోరీ తెలుసా?
X

టాలీవుడ్ ప్రముఖ మెగా ఫ్యామిలీలోకి రీసెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ట్విన్స్.. అదేనండీ స్టార్ హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతుల కవల పిల్లల పేర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. జనవరి 31వ తేదీన ఉపాసన.. ఒక బాబు, ఒక పాపకు జన్మనిచ్చారు. ఇప్పటికే చెర్రీ- ఉప్సీకి కూతురు క్లీంకార ఉండగా.. ట్విన్స్ రాకతో ఇప్పుడు ముగ్గురు పిల్లలకు తల్లిదండ్రులయ్యారు.

అయితే ఫిబ్రవరి 11వ తేదీన ఆ ఇద్దరు చిన్నారుల బారసాల జరిగింది. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య పూజా కార్యక్రమం నిర్వహించగా.. రీసెంట్ గా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చరణ్‌ ట్విన్స్ పేర్లను వెల్లడించారు. అబ్బాయికి శివరామ్‌ అని, అమ్మాయికి అన్వీరా దేవి అని పేర్లు పెట్టినట్లు తెలిపారు. అయితే ఆ కవలల పేర్లకు అర్థాలు, చరణ్- ఉప్సీ అభిప్రాయాలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

చరణ్ కొడుకు పేరు శివరామ్ కాగా.. అందులో ఫ్యామిలీ రిలేషన్ క్లియర్ గా కనిపిస్తోంది. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్. అందులో శివను తీసుకుని, చరణ్ పేరులోని రామ్ ను కలిపి శివ రామ్ గా పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో తండ్రిపై చరణ్ చూపించిన ప్రేమ, రెస్పెక్ట్ కు ఇది అసలైన నిదర్శనమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

అదే సమయంలో శివరామ్ పేరుకు.. ఉపాసన కుటుంబానికి చెందిన పురాతన ఆలయలోని విగ్రహంతో కూడా అనుబంధం ఉందని సమాచారం. అటు కుటుంబ ఆచారాలు, ఇటు స్పిరిచ్యువాలిటీ దృష్టిలో పెట్టుకుని ఆ పేరు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కుమార్తెకు అన్వీరా దేవి అని నామకరణం చేయగా.. అన్‌ అంటే అన్ లిమిటెడ్, వీర అంటే ధైర్యం, దేవి అంటే దైవ శక్తి అని అర్థం.

అలా అపరిమితమైన ధైర్యాన్ని, దైవిక శక్తిని సూచించేలా ఆ పేరును సెలెక్ట్ చేసినట్టు అర్థమవుతోంది. అదే సమయంలో దుర్గాదేవిపై భక్తితో కూడా పెట్టినట్లు తెలుస్తోంది. ఎందుకంటే మెగా కుటుంబసభ్యులు దుర్గమ్మను భక్తితో కొలుస్తారు. చిరంజీవి సతీమణి సురేఖ విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని చాలా నమ్ముతారు. అందుకే చరణ్, ఉపాసన రెండో కూతురికి ఆ పేరు పెట్టినట్లు తెలుస్తోంది.

కాగా.. 2012లో రామ్‌ చరణ్‌- ఉపాసన వివాహ బంధంతో ఒక్కటవ్వగా, 2023లో వీరికి క్లీంకార జన్మించింది. ఆమె పేరుకూ ప్రత్యేక అర్థం ఉంది. లలిత సహస్రనామ పారాయణంలో అమ్మవారిని కొలిచే పేర్లలో ఒకటి అది. ఏదేమైనా కుటుంబ వారసత్వం, పెద్దలపై గౌరవం, భక్తి, సంప్రదాయాలను సహా ఇలాంటి ముఖ్య విషయాలు దృష్టిలో పెట్టుకుని చరణ్, ఉపాసన తమ ముగ్గురు పిల్లలకు పేర్లు పెట్టారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.