ఉప్సీ 'ట్విన్స్' వేడుకకు 'ట్విన్స్' మదర్.. ఏంటి మ్యాటర్?
అదే సమయంలో ఆమె తల్లి శోభన కామినేని సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది రామ్ చరణ్, ఉపాసన ట్విన్ బేబీస్ కు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పబోతున్నారని పోస్ట్ ద్వారా స్పష్టం చేశారు.
By: M Prashanth | 24 Oct 2025 12:39 PM ISTమెగా ఇంటి కోడలు, స్టార్ హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల మరోసారి తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. ఆ విషయాన్ని అనౌన్స్ చేస్తూ.. తనకు జరిగిన సీమంతం వేడుకకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీపావళి కచ్చితంగా తమకు సంతోషకరమైన డబుల్ ధమాకా ఇచ్చిందని తెలిపారు.
అయితే ఉపాసన తన పోస్ట్ లో డబుల్ అని మెన్షన్ చేయడంతో.. ఆమెకు కవలలు జన్మించనున్నారని అంతా అంచనా వేశారు. అదే సమయంలో ఆమె తల్లి శోభన కామినేని సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది రామ్ చరణ్, ఉపాసన ట్విన్ బేబీస్ కు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పబోతున్నారని పోస్ట్ ద్వారా స్పష్టం చేశారు.
దీంతో క్లీంకారకు ఇద్దరు సిబ్లింగ్స్ రానున్నారన్నమాట. అయితే ఉపాసన సీమంతంలో మెగా ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు సినీ ప్రముఖులు కూడా సందడి చేసిన విషయం తెలిసిందే. సీనియర్ హీరోలు వెంకటేష్, నాగార్జునలు తమ ఫ్యామిలీస్ తో వచ్చారు. కోలీవుడ్ స్టార్ హీరో నయనతార.. తన భర్త, ఇద్దరు పిల్లలతో అటెండ్ అయ్యారు.
వేడుకలో నయన్ ఫ్యామిలీ మెంబర్స్ నలుగురూ ట్రెడిషనల్ వేర్ లో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ట్విన్స్ అయిన ఆమె కొడుకులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అందుకు సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా నెటిజన్లు, మూవీ లవర్స్ తో పాటు అభిమానులు రెస్పాండ్ అవుతున్నారు. క్యూట్ ఉన్నారని అంటున్నారు.
అదే సమయంలో ట్విన్స్ కు జన్మనివ్వబోయే ఉపాసన సీమంతం వేడుకలో ట్విన్స్ మదర్ అయిన నయన్ సందడి చేయడం స్పెషల్ మూమెంట్ అని అంటున్నారు. అయితే సౌత్ ఇండస్ట్రీలో కవలలు ఉన్న సెలబ్రిటీ జంటల్లో నయనతార, విఘ్నేష్ శివన్ ఒకటి. ఇప్పుడు రామ్ చరణ్, ఉపాసన కపుల్ వారి లిస్ట్ లో చేరనున్నారు.
కాగా, నయన్ ఫ్యామిలీ అటెండ్ అవ్వడం వెనుక అసలు కారణం.. ఆమె చిరుతో ఇప్పుడు సినిమా చేస్తుండడమే. వారిద్దరూ కలిసి సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రస్తుతం ఆ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆ నేపథ్యంలో సతీసమేతంగా అటెండ్ అవ్వమని చిరు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఏదేమైనా యాదృచ్చికంగా జరిగినా.. నయన్ తన ట్విన్స్ తో రావడం మాత్రం స్పెషల్ గా నిలిచింది.
