Begin typing your search above and press return to search.

మోదీకి నిజమైన అభిమానిని.. చరణ్ ఈజ్ బెస్ట్!: ఉపాసన

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   12 Oct 2025 6:07 PM IST
మోదీకి నిజమైన అభిమానిని.. చరణ్ ఈజ్ బెస్ట్!: ఉపాసన
X

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన విషయం తెలిసిందే. రీసెంట్ గా ఢిల్లీ ఆర్చరీ లీగ్ మొదలవగ్గా, నేటితో ముగియనుంది. ఆ లీగ్ సక్సెస్ అయిన సందర్భంగా మోదీతో చరణ్ భేటీ అయ్యారు. ఆయనతోపాటు ఉపాసన కొణిదెల, ఆమె నాన్న, లీగ్‌ ఛైర్మన్‌ అనిల్‌ కామినేని కూడా ఉన్నారు.

ఇప్పటికే మోదీతో భేటీకి సంబంధించిన వివరాలు, ఫోటోలు చరణ్ పంచుకోగా.. తాజాగా ఉపాసన పోస్ట్ పెట్టారు. మోదీతో మాట్లాడిన, దిగిన గ్రూప్ పిక్స్ ను షేర్ చేశారు. ప్రధానికి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బహుకరించిన మూమెంట్స్ ను పంచుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి తాను నిజమైన అభిమాని అని ఉపాసన తెలిపారు.

తాను అథ్లెట్‌ ను కాకపోయినా, ఆరోగ్య సంరక్షణ నేపథ్యం నుంచి వచ్చిన తనకు, శారీరక, మానసిక శ్రేయస్సు కోసం క్రీడా శక్తి ఏమిటో బాగా తెలుసని తెలిపారు ఉపాసన. ఒక దేశ పౌరుడిగా, మనం క్రీడ ద్వారా స్వస్థత పొందాలని అన్నారు. ప్రధానమంత్రి దార్శనికత దీనిని నిజం చేస్తుందని, తాను మోదీజీకి నిజమైన అభిమానిని మెగా కోడలు చెప్పుకొచ్చారు.

మొదటి ఆర్చరీ లీగ్ సక్సెస్ అయినందుకు తండ్రి అనిల్ కామినేనికి కంగ్రాట్స్ తెలిపారు. ఆర్చరీకి ఉత్తమ బ్రాండ్ అంబాసిడర్ చరణ్ అని, మెరుగైన ఆరోగ్యం కోసం ఎక్కువ మంది ఈ క్రీడను ఆదరిస్తారని తాను ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. తన అత్తమామలు చిరంజీవి, సురేఖ తరఫున మోదీకి బాలాజీ విగ్రహాన్ని ఇచ్చినట్లు తెలిపారు.

ప్రస్తుతం ఉపాసన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే మోదీతో భేటీ అనంతరం రామ్ చరణ్ పలు వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో అద్భుతమైన ప్రతిభ ఉందని తెలిపారు. దాన్ని అంతర్జాతీయస్థాయికి తీసుకెళ్లడంలో ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌) ఒక వేదికగా మారిందన్నారు. ప్రధానిని కలవడం సంతోషంగా ఉందని చెప్పారు.

ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌ లక్ష్యాన్ని మోదీకి వివరించామని చరణ్ తెలిపారు. మన సాంస్కృతిక వారసత్వ కళ అయిన విలు విద్యకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా చేయాలన్నదే తమ ఆశయమని చెప్పారు. కాగా, దేశంలో తొలిసారి ఆర్చరీ(విలువిద్య) లీగ్ పోటీలు నిర్వహించారు. మొత్తంగా ఆరు జట్లు పాల్గొనగా, తెలంగాణ, తమిళనాడు, ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్ టీమ్స్ పోటీ పడ్డాయి.