Begin typing your search above and press return to search.

మెగా క్రేజీ కాంబో కుదిరిన‌ట్టేనా?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం చాలా బిజీగా ఉన్నారు. గేమ్ ఛేంజ‌ర్ త‌ర్వాత బుచ్చి బాబు సాన దర్శ‌క‌త్వంలో పెద్ది అనే సినిమాను చేస్తున్నారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   18 Jan 2026 2:19 PM IST
మెగా క్రేజీ కాంబో కుదిరిన‌ట్టేనా?
X

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం చాలా బిజీగా ఉన్నారు. గేమ్ ఛేంజ‌ర్ త‌ర్వాత బుచ్చి బాబు సాన దర్శ‌క‌త్వంలో పెద్ది అనే సినిమాను చేస్తున్నారు. ప్ర‌స్తుతం పెద్ది షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుండ‌గా, మార్చి 27న రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్టు మేక‌ర్స్ ఇప్ప‌టికే అనౌన్స్ చేశారు.

సుకుమార్ తో RC17

పెద్ది సినిమా త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ త‌న 17వ సినిమాను స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చిన రంగ‌స్థ‌లం సినిమా ఇండ‌స్ట్రీ హిట్ గా నిల‌వ‌డంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచ‌నాలున్నాయి. సుకుమార్ ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ ను మొద‌లుపెట్టార‌ని స‌మాచారం.

త్రివిక్ర‌మ్-చ‌ర‌ణ్ కాంబోలో సినిమా?

ఇదంతా అంద‌రికీ తెలిసిందే. ఇక అస‌లు విష‌యానికొస్తే మెగా ఫ్యాన్స్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్న ప్రాజెక్టుకు ఇప్పుడు లైన్ కుదిరేట్టు క‌నిపిస్తుంది. టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు అత్యంత స‌న్నిహితుడైన త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ సినిమా చేసే అవ‌కాశాలున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్ ఎప్ప‌ట్నుంచో వెయిట్ చేస్తున్నారు.

రామ్ చ‌ర‌ణ్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో సినిమా రానుంద‌ని, ఆ సినిమాను ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్రియేటివ్ వ‌ర్క్స్ మ‌రియు హారికా హాసినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మించ‌నున్నాయ‌ని టాలీవుడ్ స‌ర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. పీకే క్రియేటివ్ వ‌ర్క్స్ బ్యార్ లో రామ్ చ‌ర‌ణ్ హీరోగా సినిమాను తీస్తాన‌ని ప‌వ‌న్ గ‌తంలో చాలా సార్లు అనౌన్స్ చేశారు కానీ అది ఇప్ప‌టివ‌ర‌కు సెట్ అవ‌లేదు. ఇప్పుడు ఈ వార్త‌లు రావ‌డంతో నిజ‌మేన‌ని న‌మ్ముతూ మెగాఫ్యాన్స్ ఫుల్ ఆనందంగా ఉన్నారు. ఈ వార్త‌ల్లో నిజ‌మెంత‌న్న‌ది తెలియాల్సి ఉంది. ఒక‌వేళ నిజ‌మే అయితే, టాలీవుడ్ లో ఇది క్రేజీ ప్రాజెక్టు అవ‌డం ఖాయం.