పెద్ది మూవీ నా లైఫ్ నే మార్చేసింది.. రామ్ చరణ్ ఎమోషనల్
బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు అందుకుంటున్న పెద్ది మూవీ రిజల్ట్ తన లైఫ్ నే మార్చేసిందని రామ్ చరణ్ అన్నాడు.
By: M Prashanth | 24 Jun 2026 9:38 AM ISTబాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు అందుకుంటున్న పెద్ది మూవీ రిజల్ట్ తన లైఫ్ నే మార్చేసిందని రామ్ చరణ్ అన్నాడు. మూవీ టీమ్ ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో పాల్గొన్న చరణ్ తన ఫీలింగ్స్ ను అందరితో షేర్ చేసుకున్నాడు. కెరీర్ లో ఎన్నో హిట్స్ వచ్చినా ఈ సినిమా ఇచ్చిన కిక్ మాత్రం చాలా స్పెషల్ అని చెప్పాడు. తన లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేని ఒక బ్యూటిఫుల్ మెమరీని ఆడియన్స్ ఈ సినిమాతో ఇచ్చారని థాంక్స్ చెప్పాడు.
థియేటర్లలో జనాలు ఎంజాయ్ చేస్తున్న తీరు చూస్తుంటే చాలా కొత్తగా అనిపించిందని చరణ్ అన్నాడు. సోషల్ మీడియాలో చిన్న పిల్లలు కూడా మస్సా మస్సా పాటకు స్టెప్పులు వేస్తూ రీల్స్ చేయడం తనకు ఎంతో హ్యాపీగా ఉందన్నాడు. పేరెంట్స్ నమ్మి తమ పిల్లలను థియేటర్లకు తీసుకురావడం డైరెక్టర్ బుచ్చిబాబు చేసిన ప్రయత్నానికి దక్కిన అసలైన రెస్పెక్ట్ అని చెప్పాడు.
పెద్దవాళ్లు కూడా లుంగీలు కట్టుకుని డాన్స్ చేయడం ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ అని ఫీల్ అయ్యాడు. జనాలు ఈ సినిమాకు ఎంతలా కనెక్ట్ అయ్యారో చెప్పడానికి చరణ్ వాళ్ల ఇంట్లో జరిగిన ఒక క్యూట్ విషయాన్ని చెప్పాడు. సినిమా రిలీజ్ అయ్యే వరకు తన కూతురు క్లీంకార తనను నాన్న అని పిలిచేదని, కానీ పెద్ది రిలీజ్ అయ్యాక మాత్రం అదే పేరుతో పిలుస్తోందని నవ్వుతూ చెప్పాడు. జనాలకు రామ్ చరణ్ కంటే ఆ క్యారెక్టర్ పేరే ఎక్కువగా గుర్తుండిపోవడం ఈ సినిమా సాధించిన రియల్ సక్సెస్ అని అన్నాడు.
తన లైఫ్ లో డైరెక్టర్ సుకుమార్ కు ఉన్న ప్లేస్ గురించి చరణ్ ఓపెన్ గా చెప్పాడు. తన కెరీర్ లో ఏవైనా అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు నాన్న తర్వాత తను ఫస్ట్ కాల్ చేసి మాట్లాడేది సుకుమార్ గారికే అని క్లారిటీ ఇచ్చాడు. ఎంతోమందికి లైఫ్ ఇచ్చిన ఆయన తనను కూడా ఎప్పుడూ సరైన రూట్ లో గైడ్ చేయాలని కోరుకున్నాడు. తనను నమ్మి ఇంత మంచి కథను తీసుకొచ్చిన బుచ్చిబాబుకు స్పెషల్ గా థాంక్స్ చెప్పాడు.
తన మొదటి సినిమానే అయినా బడ్జెట్ విషయంలో వెనకాడకుండా ప్రొడ్యూస్ చేసిన సతీష్ కిలారుకు చరణ్ కంగ్రాట్స్ చెప్పాడు. ఫ్యూచర్ లో ఆయన బ్యానర్ లో మరిన్ని సినిమాలు చేయాలని ఉందని అన్నాడు. విజువల్స్ తో మ్యాజిక్ చేసిన రత్నవేలు, మ్యూజిక్ తో ప్రాణం పోసిన ఏఆర్ రెహమాన్ వర్క్ ను బాగా పొగిడాడు. సినిమాకు సపోర్ట్ చేసిన ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు ఆడియన్స్ అందరికీ థాంక్స్ చెప్పాడు.
