లెక్కల మాస్టర్ 'మాస్టర్' ప్లాన్.. ఇది కదా ఫ్యాన్స్ కు కావాల్సింది..
సుకుమార్ సినిమాలంటే కథలో కొత్తదనం, పాత్రల్లో డెప్త్, ప్రతి సీన్ లో లెక్కలు ఉంటాయని ప్రేక్షకులకు తెలిసిన విషయమే.
By: M Prashanth | 26 Jun 2026 10:48 PM ISTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ అంటే టాలీవుడ్ లో ప్రత్యేకమైన క్రేజ్. రంగస్థలంతో ఇండస్ట్రీ హిట్ అందించిన ఆ ఇద్దరూ మరోసారి కలిసి పనిచేస్తుండటంతో అభిమానుల అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి. పెద్ది తర్వాత రామ్ చరణ్ చేయబోయే ఆ ప్రాజెక్టుపై మొదటి ప్రకటన నుంచి పాన్ ఇండియా స్థాయిలో భారీ చర్చ మొదలైంది. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన మరో ప్రచారం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది.
ఆ ప్రాజెక్టును దర్శకుడు సుకుమార్ రెండు భాగాలుగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారట. కథ రేంజ్, సినిమా వరల్డ్ ను మరింత లోతుగా చూపించాలంటే రెండు భాగాలుగా చెప్పడమే సరైన మార్గమని ఆయన భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు తెలుగు స్టార్ హీరోలు చాలా మంది రెండు పార్టుల స్టోరీస్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే రామ్ చరణ్ మాత్రం ఇప్పటివరకు ఆ ట్రెండ్ ను ఫాలో కాలేదు.
దీంతో ఈసారి నిజంగానే రెండు పార్టుల ప్లాన్ ఉంటే.. అది చరణ్ కెరీర్ లో తొలి టూ-పార్ట్ మూవీగా నిలిచే అవకాశం ఉంది. ఇదే అంశం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచుతోంది. సుకుమార్ సినిమాలంటే కథలో కొత్తదనం, పాత్రల్లో డెప్త్, ప్రతి సీన్ లో లెక్కలు ఉంటాయని ప్రేక్షకులకు తెలిసిన విషయమే. కథను ఎంత వరకు చెప్పాలనుకుంటే అంత వరకు మాత్రమే చెప్పే దర్శకుడిగా ఆయనకు పేరుంది.
అలాంటి దర్శకుడు ఒక కథను రెండు భాగాలుగా చెప్పాలనుకుంటున్నాడంటే.. అందులో విషయం ఎంత బలంగా ఉంటుందో అనే చర్చ కూడా మొదలైంది. అందుకే సోషల్ మీడియాలో దీనిని లెక్కల మాస్టర్ ప్లాన్ గా అభిమానులు అభివర్ణిస్తున్నారు. ఈసారి సుకుమార్ పూర్తిగా కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. స్టైలిష్ అర్బన్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో కథ నడుస్తుందని సమాచారం.
కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు స్ట్రాంగ్ ఎమోషన్స్, పవర్ ఫుల్ రోల్స్ కూడా సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. భారతీయ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖ నటులు ఇందులో కీలక పాత్రల్లో కనిపించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల పెద్ది విజయోత్సవ వేడుకల్లో కూడా సుకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఈ సినిమా ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి" అంటూ ఒక్క మాటతో అభిమానుల్లో క్యూరియాసిటీని మరింత పెంచేశారు.
డిసెంబర్ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్‌తో పాటు ఇతర కీలక పాత్రల ఎంపిక కూడా దాదాపు పూర్తయిందని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే రెండు పార్టుల ప్రచారంపై ఇప్పటికీ క్లారిటీ లేదు. అయినప్పటికీ రంగస్థలం తర్వాత ఆ సూపర్ హిట్ కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో ఉన్న నమ్మకం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. కథ, మేకింగ్, విజువల్ గ్రాండియర్ పరంగా మరోసారి సుకుమార్- చరణ్ కాంబో కొత్త రికార్టులు సృష్టిస్తుందనే అంచనాలు ఉన్నాయి.
