Begin typing your search above and press return to search.

సుకుమార్ పాత స్కెచ్ వెనుక అసలు లాజిక్ ఇదేనా?

దీంతో వీళ్లిద్దరి కాంబినేషన్ లో రాబోయే ఆర్సీ 17 ప్రాజెక్ట్ కూడా మళ్లీ అదే రూరల్ మీటర్ లో ఉంటుందా లేక కొత్తగా ట్రై చేస్తారా అనే డైలమా చాలామందిలో ఉంది.

By:  M Prashanth   |   22 Jun 2026 12:51 PM IST
సుకుమార్ పాత స్కెచ్ వెనుక అసలు లాజిక్ ఇదేనా?
X

రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ పెద్ది బాక్సాఫీస్ రన్ చూశాక ఇండస్ట్రీలో ఒక కొత్త చర్చ మొదలైంది. ఊర మాస్, పల్లెటూరి నేపథ్యం ఉన్న కథలు బాగా ఎక్కువైపోయాయనే ఫీలింగ్ ఆడియన్స్ లో కలుగుతుందా అనే సందేహాలు వస్తున్నాయి. దర్శకుడు సుకుమార్ కూడా పుష్ప ఫ్రాంచైజీతో కంప్లీట్ గా రస్టిక్ వరల్డ్ లోనే ఉండిపోయాడు. దీంతో వీళ్లిద్దరి కాంబినేషన్ లో రాబోయే ఆర్సీ 17 ప్రాజెక్ట్ కూడా మళ్లీ అదే రూరల్ మీటర్ లో ఉంటుందా లేక కొత్తగా ట్రై చేస్తారా అనే డైలమా చాలామందిలో ఉంది.

గతంలో ఈ సినిమా బ్యాక్ డ్రాప్ గురించి వచ్చిన పాత లీక్స్ ను చూసుకుంటే.. ఈ సినిమా అల్ట్రా స్టైలిష్ అర్బన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని, అబుదాబి లాంటి ఫారిన్ లొకేషన్లలో భారీ యాక్షన్ సీన్స్ ప్లాన్ చేస్తున్నారని చాలాకాలం క్రితమే వార్తలు వినిపించాయి. దేశభక్తి నేపథ్యంలో సాగే ఒక పవర్ఫుల్ ఇన్వెస్టిగేటర్ పాత్రలో చరణ్ కనిపిస్తాడనే టాక్ అప్పట్లో తెగ వైరల్ అయింది.

అయితే సుకుమార్ కు ఆడియన్స్ పల్స్ బాగా తెలుసు. ఒకే ట్రెండ్ ను పదే పదే ఫాలో అవ్వడం ఆయన స్టైల్ కాదు. గతంలో వన్ నేనొక్కడినే లాంటి సైకలాజికల్ థ్రిల్లర్ కమర్షియల్ గా వర్కౌట్ అవ్వకపోయినా, ఆ తర్వాత నాన్నకు ప్రేమతో సినిమాతో తన స్టైలిష్ మేకింగ్ ఏంటో బాక్సాఫీస్ కు రుచి చూపించాడు. ఇప్పుడు జనాలకు పల్లెటూరి కథల మీద బోర్ కొడుతున్న టైమ్ లో, తన పాత అర్బన్ బ్రెయిన్ గేమ్స్ ఫార్మాట్ ను మళ్లీ భారీ పాన్ ఇండియా స్కేల్ లో దించడానికి ఆయన ముందుగానే స్కెచ్ వేశాడని అర్థమవుతోంది.

హీరో రామ్ చరణ్ ప్లానింగ్ చూసుకున్నా కూడా ఈ రూట్ చేంజ్ కరెక్ట్ అనిపిస్తుంది. గేమ్ ఛేంజర్, పెద్ది సినిమాల్లో బాగా ఇంటెన్స్ రోల్స్ చేశాడు. ముఖ్యంగా పెద్దిలో స్పోర్ట్స్ నేపథ్యంలో డీ గ్లామర్ రఫ్ లుక్ తో కనిపించాడు. వరుసగా ఇలాంటి పాత్రలు చూసిన ఫ్యాన్స్ కు ఒక మంచి చేంజ్ కావాలి. సుకుమార్ మార్క్ యాక్షన్ థ్రిల్లర్ లో చరణ్ ఒక స్టైలిష్ ఇన్వెస్టిగేటర్ లుక్ తో స్క్రీన్ మీదకొస్తే ఆడియన్స్ కు సరికొత్త కిక్ దొరుకుతుంది.

ఈ ప్రాజెక్ట్ గురించి అప్పట్లో రాజమౌళి ఇచ్చిన ఒక చిన్న హింట్ కూడా బాగా హైలెట్ అయ్యింది. ఓపెనింగ్ సీన్ చాలా హార్డ్ హిట్టింగ్ గా ఉంటుందని, ఫస్ట్ ఫ్రేమ్ నుంచే బలమైన ఎమోషన్ క్యారీ అవుతుందని సుకుమార్ తనతో చెప్పినట్లు తెలిపారు. అంటే కేవలం ఫారిన్ లొకేషన్లు, స్టైలిష్ యాక్షన్ మాత్రమే కాకుండా సుకుమార్ మార్క్ స్ట్రాంగ్ ఎమోషన్ కూడా ఈ పాట్రియాటిక్ డ్రామాలో ఉండబోతోందని తెలుస్తోంది. అదే జరిగితే మూస ధోరణిలో వెళ్తున్న కమర్షియల్ సినిమాలకు ఇదొక కొత్త పాఠం అవుతుంది.

ఇండస్ట్రీలో ట్రెండ్స్ మారుతున్న కొద్దీ క్రియేటర్లు కూడా అప్డేట్ అవ్వాల్సిన పరిస్థితి. గతంలో వచ్చిన ఆ ఇంటర్నేషనల్ బ్యాక్ డ్రాప్ వార్తలు నూటికి నూరు శాతం నిజం కాకపోయినా, వాళ్లు కచ్చితంగా ఆ రూరల్ జానర్ నుంచి బయటకు వస్తారని మాత్రం గట్టిగా నమ్మొచ్చు. ప్రేక్షకులకు ఏది కావాలో ముందే పసిగట్టడంలో సుకుమార్ దిట్ట కాబట్టి చరణ్ తో ఆయన చేయబోయే ఈ కొత్త ప్రయోగం బాక్సాఫీస్ కు ఒక ఫ్రెష్ ఫీల్ ఇవ్వడం గ్యారెంటీ.