Begin typing your search above and press return to search.

RC17 టూ పార్ట్స్ ప్లాన్: మెగా పవర్ స్టార్ కెరీర్‌కు మైలురాయిగా మారుతుందా?

`రంగస్థలం` రికార్డుల సంచలనం తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - విలక్షణ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో తెర‌కెక్కుతున్న `RC17` పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.

By:  Srikanth Kontham   |   23 Oct 2026 7:00 PM IST
RC17 టూ పార్ట్స్ ప్లాన్: మెగా పవర్ స్టార్ కెరీర్‌కు మైలురాయిగా మారుతుందా?
X

`రంగస్థలం` రికార్డుల సంచలనం తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - విలక్షణ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో తెర‌కెక్కుతున్న `RC17` పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను రెండు భాగాలుగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారనే వార్త సంచ‌ల‌నంగా మారింది. దీంతో ఇది కథను విశాలంగా చెప్పే ప్రయత్నమా? లేక దానికి వెనుక పక్కా బిజినెస్ వ్యూహం ఉందా? అనేది ఆసక్తికరంగా మారింది.

రెండు భాగాలుగా సినిమా తీసుకురావడం వెనుక భారీ బిజినెస్ లెక్కలు ఉంటాయి. తెలుగు మార్కెట్‌తో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా రేంజ్‌ను క్యాష్ చేసుకోవడానికి రెండు విడతల్లో థియేట్రికల్ ఆదాయం సాధించడానికి ఇది మంచి అవకాశం. అయితే రెండు భాగాలు అనగానే ప్రచారం, నిర్మాణ వ్యయాలు, డిస్ట్రిబ్యూషన్ రిస్క్ రెట్టింపు అవుతాయి. రెండు సినిమాలు తీసినంత మాత్రాన లాభాలు కూడా రెట్టింపు స్థాయిలో వస్తాయని గ్యారెంటీ లేదు.

`రంగస్థలం`లో చిట్టిబాబుగా రామ్ చరణ్ నటన ఓ బెంచ్ మార్క్ సెట్ చేసింది. `RC17`లో అంతకంటే బలమైన, వైవిధ్యమైన పాత్ర పడితే ఆయన నటుడిగా మరో మెట్టు ఎక్కుతారు. అయితే భారీ బడ్జెట్ హంగుల కంటే కథలో ఉన్న ఆత్మ, క్యారెక్టరైజేషన్ ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడం ముఖ్యం. రెండు భాగాలుగా వస్తున్నప్పుడు సహజంగానే అంచనాలు ఆకాశాన్నంటుతాయి. ఆ క్రేజ్‌కు తగినట్లుగానే బాక్సాఫీస్ ఫలితం కూడా ఉండాల్సి ఉంటుంది.

ఇక రెండు భాగాల మధ్య నెలల స్వల్ప వ్యవధిలోనే విడుదలను ప్లాన్ చేస్తున్నారనే వార్త నిజమైతే మొదటి భాగం సృష్టించే హైప్ రెండో భాగానికి ప్లస్ అవుతుంది. సోషల్ మీడియా చర్చలు, ఫ్యాన్ థియరీలు నిరంతరం ట్రెండ్ అవుతూ ప్రమోషన్లకు పెద్ద అసెట్‌గా మారతాయి. అయితే మొదటి భాగం విడుదలయ్యాక ఏ చిన్న ఆలస్యం జరిగినా? లేదా రెండో భాగం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యమైనా? థియేట్రికల్ రన్‌పై ఆ ప్రభావం పడే ప్రమాదం లేకపోలేదు.

ఈ రెండు భాగాల ప్రయోగంలో అసలైన భారం అంతా సుకుమార్ భుజాలపైనే ఉంటుంది. రెండు భాగాలకూ నిలబడేంత బలమైన కథా విస్తరణ ఉండటంతో పాటు మొదటి భాగం ఎక్కడా అర్ధంతరంగా ఆగిపోయిన భావన కలగకూడదు. రెండో భాగం కేవలం మొదటి భాగం విజయంపై ఆధారపడకుండా దేనికది స్వతంత్రంగా మెప్పిం చాలి. అన్నింటికీ మించి రెండు భాగాల మధ్య కథా అనుసంధానం సహజంగా కుదరాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి పూజా కార్యక్రమం, రెగ్యులర్ షూటింగ్ తేదీలు, కథానాయికల ఎంపికపై క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తారనే ప్రచారం జ‌రుగుతోంది.

రెండు భాగాల ప్రణాళికపై అధికారిక సమాచారం వెలువడితేనే అసలు సస్పెన్స్‌కు తెరపడుతుంది. ఏది ఏమైనా? రామ్ చరణ్‌కు గుర్తుండిపోయే పాత్ర.. సుకుమార్ పదునైన కథనం, నిర్మాతలకు సరైన బడ్జెట్ ప్లానింగ్ కుదిరితేనే ఈ రెండు భాగాల వ్యూహం బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుంది.