Begin typing your search above and press return to search.

'పెద్ది' రాకకు ముందే.. చరణ్‌ ఫ్యాన్స్‌కి బిగ్‌ సర్‌ప్రైజ్‌

రామ్‌ చరణ్‌, బుచ్చిబాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న 'పెద్ది' సినిమాను ఈనెలలోనే విడుదల చేయాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు.

By:  Ramesh Palla   |   14 March 2026 12:08 PM IST
పెద్ది రాకకు ముందే.. చరణ్‌ ఫ్యాన్స్‌కి బిగ్‌ సర్‌ప్రైజ్‌
X

రామ్‌ చరణ్‌, బుచ్చిబాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న 'పెద్ది' సినిమాను ఈనెలలోనే విడుదల చేయాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. ఆ తేదీని పవన్‌ కళ్యాణ్ ఉస్తాద్‌ భగత్‌ సింగ్ కోసం వినియోగించడం తెల్సిందే. ఇటీవలే పెద్ది సినిమాను ఏప్రిల్‌ 30, 2026న విడుదల చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. పెద్ది సినిమా తర్వాత చరణ్ చేయబోతున్న సినిమా క్లారిటీ వచ్చింది. సుకుమార్‌ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ వెంటనే కొత్త సినిమాను షురూ చేయబోతున్నాడు. 2027లోనే వచ్చే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. సుకుమార్‌ ఇప్పటికే స్క్రిప్ట్‌ను లాక్ చేసి చరణ్‌ డేట్ల కోసం వెయిట్‌ చేస్తున్నాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. చరణ్‌, చిరంజీవిలు ఇప్పటికే సుకుమార్‌ రెడీ చేసిన స్క్రిప్ట్‌ కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ స్టాంప్ వేయడం జరిగింది. షూటింగ్‌ సమయంలో చిన్న చిన్న మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి.

సుకుమార్‌ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ మూవీ...

పెద్ది సినిమా విడుదల అయ్యే వరకు సుకుమార్‌ దర్శకత్వంలో రామ్‌ చరణ్ చేయబోతున్న సినిమా విషయంలో ఎలాంటి క్లారిటీ రాకపోవచ్చని ఇన్ని రోజులు అంతా అనుకున్నారు. కానీ పెద్ది సినిమా విడుదల ఆలస్యం అయిన నేపథ్యంలో దర్శకుడు సుకుమార్‌ తన పని తాను చేసేందుకు రెడీ అయ్యాడని తెలుస్తోంది. సినీ వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం మార్చ్ 27న రామ్‌ చరణ్ బర్త్‌డే సందర్భంగా సుకుమార్‌ బిగ్‌ సర్‌ప్రైజ్‌ను ప్లాన్‌ చేస్తున్నాడట. రామ్‌ చరణ్‌ బర్త్‌డే స్పెషల్‌గా RC17 సినిమా ప్రీ లుక్ పోస్టర్‌ను విడుదల చేయబోతున్నారు. అందుకోసం రామ్‌ చరణ్‌ ఫోటో షూట్‌ సైతం జరిగిందని తెలుస్తోంది. కాన్సెప్ట్‌ రివీల్‌ చేస్తూ, ఒక మ్యూజిక్ వీడియోను ప్లాన్‌ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. బర్త్‌డేకి ఎక్కువ సమయం లేదు కనుక సుకుమార్‌ ఏం ప్లాన్‌ చేస్తున్నాడో చూడాలి. పెద్ది సినిమాతో రామ్‌ చరణ్‌ బిజీగా ఉన్న కారణంగా సుకుమార్‌ కి ఎక్కువ సమయం ఇచ్చే అవకాశం ఉందా అనేది అనుమానమే అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌.

RC17 మూవీ ప్రీ లుక్‌ పోస్టర్‌...

రామ్‌ చరణ్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందిన 'రంగస్థలం' సినిమా 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చి బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఆ సమయంలో సినిమాను పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల చేసి ఉంటే కచ్చితంగా భారీ వసూళ్లు నమోదు చేసి ఉండేది. సుకుమార్‌ పుష్ప సినిమా తర్వాత చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. రామ్‌ చరణ్‌, సుకుమార్‌ది హిట్‌ కాంబో కావడం వల్ల బడ్జెట్‌ సైతం భారీగా ఖర్చు చేసేందుకు నిర్మాతలు రెడీగా ఉన్నారు. కనుక రామ్‌ చరణ్‌, సుకుమార్‌ కాంబోలో రాబోతున్న RC17 సినిమా భారీ బడ్జెట్‌ సినిమాల్లో ఒకటిగా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రామ్‌ చరణ్ బర్త్‌డే సర్‌ప్రైజ్‌ నుంచి మొదలుకుని ఈ ఏడాది అంతా కూడా రామ్‌ చరణ్‌, సుకుమార్‌ సినిమా గురించి మాట్లాడుకునే అవకాశాలు ఉన్నాయి. తెలుగు సినిమా స్థాయిని మరింతగా పెంచే విధంగా RC17 సినిమా ఉండబోతుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.

పుష్ప 2 సినిమా తర్వాత ...

సుకుమార్‌ పుష్ప సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన నుంచి సినిమా అంటే అంతకు మించి అన్నట్లుగా ప్రేక్షకులు ఆశిస్తారు. పుష్ప మేకర్‌ అనగానే ఉత్తరాది ప్రేక్షకులు కచ్చితంగా RC17 సినిమాపై ఆసక్తి కనబరచడం ఖాయం. అందుకే పాన్‌ ఇండియా రేంజ్‌ మూవీగా, అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే సబ్జెక్ట్‌తో సినిమాను సుకుమార్‌ చేస్తాడని అంతా భావిస్తున్నారు. ఇప్పటి వరకు సినిమా జోనర్‌ ఏంటి, ఎలా ఉండబోతుంది అనే విషయంలో క్లారిటీ లేదు. కానీ రామ్‌ చరణ్ బర్త్‌డే సందర్భంగా రాబోతున్న పోస్ట్‌ లేదా కాన్సెప్ట్‌ వీడియోతో అన్ని విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అతి త్వరలోనే బర్త్‌డే స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ గురించి మరింత స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. పుష్ప 2 తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్న సుకుమార్‌ RC17 సినిమాను చాలా స్పీడ్‌గా చేస్తాడా లేదంటే ఎప్పటిలాగే మెల్లగా తీసి 2028 లో విడుదల చేస్తాడా అనేది చూడాలి.