చెర్రీ- సుక్కూ.. ఈసారి అస్సలు రొటీన్ కాదట!
By: Sravani Lakshmi Srungarapu | 31 Aug 2025 11:03 AM ISTటాలీవుడ్ లో రంగస్థలం సినిమా సాధించిన విజయం, సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. 2018లో రిలీజైన ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులను సృష్టించింది. రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. ఆ సినిమా తర్వాత మళ్లీ వీరిద్దరి కలయికలో ఎప్పుడు సినిమా వస్తుందా అని అందరూ ఎంతో ఎదురుచూస్తున్నారు.
పెద్దితో కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్న చరణ్
పుష్ప ఫ్రాంచైజ్ సినిమాలతో సుకుమార్ స్థాయి విపరీతంగా పెరిగితే, గేమ్ ఛేంజర్ డిజాస్టర్ తో రామ్ చరణ్ డిజాస్టర్ అందుకున్నారు. దీంతో తన తర్వాతి సినిమా అయిన పెద్ది మూవీతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు చరణ్. వచ్చే ఏడాది మార్చిలో పెద్ది మూవీ రిలీజ్ కానుందని మేకర్స్ ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేశారు.
ఆర్సీ17 కోసం సుకుమార్ ప్లాన్స్
పెద్ది తర్వాత రామ్ చరణ్ తన నెక్ట్స్ మూవీ అయిన 17వ సినిమాను సుకుమార్ తో చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం సుకుమార్ చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అసలే పుష్ప2 తర్వాత తన నుంచి వచ్చే సినిమాలపై ఆడియన్స్ కు ఎక్కువ అంచనాలున్న నేపథ్యంలో ఆ అంచనాలను అందుకునేలా ఆర్సీ17ను ప్లాన్ చేస్తున్నారట సుక్కూ.
కొలిక్కి వస్తోన్న ఆర్సీ17 పనులు
దాని కోసమే రీసెంట్ గా తన టీమ్ తో కలిసి బ్యాంకాక్ వెళ్లి స్టోరీ సెషన్స్, ట్రీట్‌మెంట్ గురించి పలు విధాలుగా ఆలోచించి ఆఖరికి ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు పొలిటికల్ డ్రామా, లవ్ స్టోరీ, హై ఆక్టేన్ యాక్షన్ సినిమాలే తీసిన సుకుమార్ ఇప్పుడు చరణ్ తో చేయబోయే సినిమాకు జానర్ ను ఫిక్స్ చేశారని, త్వరలోనే ఫుల్ నెరేషన్ తో పాటూ జానర్ గురించి కూడా రామ్ చరణ్ కు నెరేట్ చేస్తారని సమాచారం.
అయితే ఈసారి రామ్ చరణ్ తో సుకుమార్ చేయబోయే సినిమా రొటీన్ జానర్ కాదని ఎవరూ ఊహించని జానర్ లో సుకుమార్ సినిమా చేయబోతున్నారని ఇన్‌సైడ్ టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఆర్సీ17కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ తో పాటూ మరో వైపు తన సొంత బ్యానర్ అయిన సుకుమార్ రైటింగ్స్ లో సినిమాలను నిర్మిస్తూ సుకుమార్ చాలా బిజీగా ఉన్నారు. మరి రామ్ చరణ్- సుకుమార్ కాంబినేషన్ ఈసారి ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.
