Begin typing your search above and press return to search.

RC17 కాస్టింగ్ సర్ప్రైజ్.. చరణ్‌ తో బాలీవుడ్ బ్యూటీ జత కట్టనుందా?

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న భారీ ప్రాజెక్ట్‌ ‘RC17’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

By:  Madhu Reddy   |   20 Aug 2026 12:39 PM IST
RC17 కాస్టింగ్ సర్ప్రైజ్.. చరణ్‌ తో బాలీవుడ్ బ్యూటీ జత కట్టనుందా?
X

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న భారీ ప్రాజెక్ట్‌ ‘RC17’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 2018లో వచ్చిన ‘రంగస్థలం’తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ ఇండస్ట్రీ హిట్ కాంబో మళ్లీ రిపీట్ అవుతుండటంతో సినిమాపై భారీ హైప్ నెలకొంది. 'పుష్ప'తో సుకుమార్, 'పెద్ది'తో రామ్ చరణ్ పాన్-ఇండియా స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్న నేపథ్యంలో.. ఈ చిత్రంలో నటించబోయే హీరోయిన్లు, కాస్టింగ్‌కు సంబంధించిన ఆసక్తికర వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా హల్‌చల్ చేస్తున్నాయి.

ఇద్దరు భామలు.. బాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ? :

ఈ సినిమాలో కథానాయికగా ఎవరు నటించనున్నారనే దానిపై రోజుకో వార్త బయటకు వస్తోంది. గతంలో కియారా అద్వానీ పేరు వినిపించగా, ఇప్పుడు సినిమాలో ఓ లీడ్ హీరోయిన్ ఉండే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. అందులో ఒక కథానాయికగా బాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్ బ్యూటీని దించబోతున్నారట. అయితే ఆ నార్త్ భామ ఎవరనేది ప్రస్తుతం మేకర్స్ ఎంతో సస్పెన్స్‌గా ఉంచడంతో ఫ్యాన్స్‌లో కుతూహలం పెరుగుతోంది.

నయనతార కీలక పాత్ర? :

మరోవైపు ఈ సినిమాలో ఒక అత్యంత కీలకమైన, పవర్‌ఫుల్ పాత్ర కోసం లేడీ సూపర్ స్టార్ నయనతారను చిత్రబృందం సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక నయనతార కనుక ఈ ప్రాజెక్ట్‌లోకి వస్తే సినిమా రేంజ్ మరింత పెరగడం ఖాయం. అయితే దీనిపై కూడా మైత్రి మూవీ మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

షూటింగ్ అప్‌డేట్ అండ్ రిలీజ్ ప్లాన్:

దర్శకుడు సుకుమార్ ఇప్పటికే ఈ చిత్ర స్క్రిప్ట్‌ను పూర్తి చేసినట్లు సమాచారం. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో సినిమాను గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నారు. రామ్ చరణ్‌ తన చేతి సర్జరీ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత, నవంబర్‌ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని సింగిల్ పార్ట్‌గానే నిర్మిస్తుండగా, 2027 చివర్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

'రంగస్థలం' లాంటి ఆల్ టైమ్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో 'RC17'పై ప్రేక్షకుల్లో, వ్యాపార వర్గాల్లో ఊహించని రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి. ఇక సుకుమార్ మార్క్ టేకింగ్, చరణ్ మాసివ్ యాక్టింగ్ కలసి బాక్సాఫీస్ వద్ద మరోసారి రికార్డుల సునామీ సృష్టిస్తాయని అభిమానులు ధీమాగా ఉన్నారు.