రామ్ చరణ్ హీరోయిన్ క్లారిటీ అప్పుడేనా?
రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న RC17 హీరోయిన్ ఎంపికపై ఆసక్తి నెలకొంది. సారా అర్జున్, సాత్విక వీరవల్లి, రుక్మిణి వసంత్ పేర్లు ప్రచారంలో ఉన్నా చిత్రబృందం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ తొలి వారంలో హీరోయిన్‌ను ఖరారు చేసే అవకాశం ఉందని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
By: Srikanth Kontham | 10 Nov 2026 4:00 PM ISTగ్లోబల్ స్టార్ రామ్ చరణ్- సుకుమార్ కాంబినేషన్‌లో ఆర్సీ 17 లాక్ అయిన సంగతి తెలిసిందే. ఇద్దరి పాన్ ఇండియా ఇమేజ్ నేపథ్యంలో సినిమాపై అంచనాలు అంతకంతకు రెట్టింపు అవుతున్నాయి. అయితే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో చరణ్ సరసన కథానాయికగా ఎవరు? నటిస్తున్నారు అనే అంశంపై టాలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. కానీ కథానాయిక ఎంపిక విషయంలో మేకర్స్ ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. సారా అర్జున్, సాత్విక వీరవల్లి, `కాంతార` ఫేమ్ రుక్మిణి వసంత్ వంటి పలువురి పేర్లు సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చినా? సుకుమార్ మాత్రం ఎంపికను ఎంతో గోప్యంగా ఉంచుతున్నారు.
పాత్రకు తగిన నటి కోసం అన్వేషణ ముమ్మరంగా సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వెలుగులోకి వచ్చింది. హీరోయిన్ ఎంపికపై చిత్రబృందం నవంబర్ ఎండింగ్ లేదా? డిసెంబర్ తొలి వారంలో అధికారికంగా ఖరారు చేస్తారని టాక్ నడుస్తోంది. సుకుమార్ మార్క్ మేకింగ్‌కు తగ్గట్లుగా పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చే నటినే పాత్ర కోసం లాక్ చేయాలని యూనిట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ ఛాన్స్ ఎవరు అందుకుంటారు? అన్నది ఆసక్తికరంగా మారింది. హీరోయిన్ల విషయంలో సుకుమార్ చాలా విషయాలు ఆలోచిస్తారు.
సుకుమార్ మార్కెట్ కంటే పాత్రకు ఎవరు సెట్ అవుతారో? వారికే ఛాన్స్ ఇస్తారు. కొత్త నటి అయినా? ఛాన్స్ తీసుకుంటారు. `పుష్ప` చేస్తున్న సమయంలో రష్మికకు పాన్ ఇండియాలో ఎలాంటి గుర్తింపు లేదు. కానీ పాత్ర కు సెట్ అవుతుంది అన్న కారణంగా తీసుకున్నారు. అంతకు ముందు మహేష్ తో `వన్` సినిమా చేసారు? అందులో హీరోయిన్ గా కృతి సనన్ ని తీసుకున్నారు. అప్పటికి కృతి సనన్ ఎవరో పెద్దగా తెలియదు. నేరుగా ముంబై నుంచి తీసుకొచ్చి హీరోయిన్ గా పెట్టారు. ఈ నేపథ్యంలో చరణ్ సరసన ఛాన్స్ ఎవరైనా అందుకునే అవకాశం ఉంది.
సారా అర్జున్, సాత్విక, రుక్మిణి వసంత్ లలో ఎవరు ఎంపికైనా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఈ ముగ్గురు కాకపోతే ఏమాత్రం గుర్తింపు లేని నటిని అయినా తీసుకొవచ్చు. ఈ విషయంలో పూర్తిగా ఛాన్స్ సుకుమార్ మాత్రమే తీసుకుంటారు. ఇందులో మరొకరి ఇన్వాల్వ్ మెంట్ ఉండదు. మరి ఆ లక్కీ ఛాన్స్ ఎవరు అందుకుంటారు? అనేది చూడాలి. అలాగే ఈ సినిమా షూటింగ్ మునుపటి చిత్రాల్లా కాకుండా వీలైనంత వేగంగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి యూనిట్ పక్కా షెడ్యూళ్లను ప్లాన్ చేస్తోంది. చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.
