RC17 : ఆ విషయంలో సుక్కు ఫైనల్ నిర్ణయం ఏంటో..?
రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో మూవీ కన్ఫర్మ్ కావడం మాత్రమే కాకుండా ప్రీ ప్రొడక్షన్ వర్క్ సైతం దాదాపుగా పూర్తి అయ్యాయి.
By: Ramesh Palla | 21 Oct 2026 4:00 PM ISTరామ్ చరణ్, సుకుమార్ కాంబోలో మూవీ కన్ఫర్మ్ కావడం మాత్రమే కాకుండా ప్రీ ప్రొడక్షన్ వర్క్ సైతం దాదాపుగా పూర్తి అయ్యాయి. సెట్ వర్క్‌తో పాటు, నటీనటుల ఎంపిక జరుగుతోంది. అతి త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్తుందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన రంగస్థలం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో సహజంగానే వీరి కాంబో మూవీపై అంచనాలు పెరగడం ఖాయం. పైగా పుష్ప సినిమాతో పాన్ ఇండియా దర్శకుడిగా సుకుమార్ నిలిచాడు. అందుకే సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా పెరుగుతూనే ఉన్నాయి. సుకుమార్ తన ప్రతి సినిమాలోనూ హీరోయిన్‌కు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు. కనుక ఈ సినిమాలోనూ సుకుమార్ హీరోయిన్ కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
RC17 సినిమాలో రామ్ చరణ్‌కి జోడీగా...
RC17 వర్కింగ్ టైటిల్‌తో రూపొందబోతున్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో విడుదల చేయబోతున్నారు. కనుక హీరోయిన్ బాలీవుడ్ ముద్దుగుమ్మ అయితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సుకుమార్ సైతం మొదటి నుంచి అదే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది, రామ్ చరణ్ ఇమేజ్‌కి సెట్ అయ్యే విధంగా, అన్ని విధాలుగా రామ్ చరణ్ ఎనర్జీని మ్యాచ్ చేసే విధంగా హీరోయిన్ ను ఎంపిక చేయాలనే ఉద్దేశంతో చాలా రోజులుగా చర్చలు జరుపుతున్నారు. మొన్నటి వరకు ధురంధర్ హీరోయిన్ సారా అర్జున్ ను హీరోయిన్గా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. సారా బాల నటిగా తెలుగులో కనిపించింది. కనుక ఇప్పుడు రామ్ చరణ్ కు జోడీగా నటింపజేస్తే సినిమా విడుదల సమయంలో పాత ఫోటోలతో యాంటీ ఫ్యాన్స్ ట్రోల్స్ చేసే ప్రమాదం ఉందని యూనిట్ సభ్యులు భావిస్తున్నారు. అందుకే సారా అర్జున్ ను హోల్డ్ లో పెట్టారనే వార్తలు వస్తున్నాయి.
సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్...
సారా అర్జున్ కాకుంటే రామ్ చరణ్ కు జోడీగా ఈమధ్య కాలంలో బాలీవుడ్ సెన్షేషన్ గా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ అనీత్ పడ్డా ను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ సయ్యారా సినిమాలో హీరోయిన్గా నటించి అనీత్ పడ్డా మంచి గుర్తింపు దక్కించుకుంది. బాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా నిలవడంతో పాటు, భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్న హీరోయిన్‌గానూ పేరు సొంతం చేసుకుంది. రామ్ చరణ్ కి అనీత్ పడ్డా కచ్చితంగా మంచి జోడీ అవుతుందని కొందరు యూనిట్ సభ్యులు భావిస్తున్నారట. ఇప్పటి వరకు సుకుమార్ ఈ విషయమై తుది నిర్ణయం తీసుకోలేదు. రామ్ చరణ్ సైతం హీరోయిన్ విషయమై తుది నిర్ణయ బాధ్యతను పూర్తిగా సుకుమార్ పై వదిలేసినట్లు చెబుతున్నారు. కనుక రామ్ చరణ్ కోసం సుకుమార్ ఏ హీరోయిన్ ను ఎంపిక చేస్తాడా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది.
సారా అర్జున్, అనీత్ పడ్డా హీరోయిన్స్‌గా...
అనీత్ పడ్డా, సారా అర్జున్ ఇద్దరిలో ఏ ఒక్కరిని సెలక్ట్ చేసినా కచ్చితంగా బాలీవుడ్ అటెన్షన్ ను దక్కించుకోవడం ఖాయం. వీరిద్దరూ బాలీవుడ్లో మోస్ట్ ట్రెండింగ్ బ్యూటీస్ అనడంలో సందేహం లేదు. అందుకే ఈ సినిమా కోసం వీరిద్దరిలో ఒకరిని తీసుకుంటే బాలీవుడ్లో బజ్ క్రియేట్ కావడంతో పాటు మంచి మార్కెట్ ను దక్కించుకోవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ మధ్య కాలంలో హీరోయిన్ విషయంలో స్టార్ హీరోల ఫిల్మ్ మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంతకు ముందు మాదిరిగా ఎవరు అయినా పర్వాలేదు అనే ధోరణితో వెళ్లడం లేదు. సుకుమార్ సైతం అదే తీరుతో కాస్త సీరియస్‌గానే హీరోయిన్ ఎంపిక విషయమై చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయి. అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాత సుకుమార్ ఈ ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేయడం ఖాయం. సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే సమయంకు మరో హీరోయిన్ ఎవరైనా తెరపైకి వచ్చేనా అనేది కూడా తెలియాల్సి ఉంది.
