పెద్ది పూర్తీనే కాలేదు.. అప్పుడే సరికొత్త అనుమానాలు.. సుక్కూ క్లారిటీ ఇస్తారా?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దిగ్గజ దర్శక ధీరుడుగా పేరు సొంతం చేసుకున్న రాజమౌళి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పాపులారిటీ అందుకున్నారు.
By: Madhu Reddy | 16 Oct 2025 1:00 PM ISTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దిగ్గజ దర్శక ధీరుడుగా పేరు సొంతం చేసుకున్న రాజమౌళి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పాపులారిటీ అందుకున్నారు. ఈయన దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' సినిమా చేసి ఏకంగా గ్లోబల్ స్టార్ గా ఎదిగిపోయారు రామ్ చరణ్. రాజమౌళితో చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్.శంకర్ తో 'గేమ్ ఛేంజర్' సినిమా చేసి భారీ డిజాస్టర్ ను మూటగట్టుకున్న రామ్ చరణ్.. ఇప్పుడు 'ఉప్పెన' సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు సనా దర్శకత్వంలో 'పెద్ది' సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగు వేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తీనే కాలేదు. అప్పుడే రామ్ చరణ్ నెక్స్ట్ మూవీపై సరికొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. రామ్ చరణ్ సుకుమార్ తో చేయబోయే ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుతుంది? ఎలాంటి నేపథ్యంలో రాబోతోంది? అసలు ఈ అనుమానాలకు సుకుమార్ చెక్ పెడతారా ? అంటూ అభిమానులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తుండగా.. తాజాగా ఊహించని విషయం వెలుగులోకి వచ్చింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
విషయంలోకి వెళ్తే.. రామ్ చరణ్ పెద్ది సినిమా తర్వాత ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అటు సుకుమార్ కూడా ఈ సినిమా స్క్రిప్ట్ పై పని చేయడం మొదలుపెట్టారు. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'రంగస్థలం' సినిమాకు ఈ సినిమా సీక్వెల్ అని.. త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభం అవుతుందని నివేదికలు చెబుతున్నాయి.
వచ్చే ఏడాది ప్రారంభంలోనే రామ్ చరణ్.. పెద్ది సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని.. ఒక చిన్న విరామం తర్వాత సుకుమార్ సినిమా కోసం సిద్ధమవుతారట. గ్రామీణ ఎంటర్టైనర్ నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ ఒక విభిన్నమైన లుక్ లో కనిపించబోతున్నారని సమాచారం. అంతేకాదు ప్రస్తుతం సుకుమార్ అతని బృందం చివరి స్క్రిప్ట్ కోసం దుబాయ్లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు త్వరగానే షూటింగ్ ప్రారంభం కాబోతోంది అని తెలుస్తోంది. ఏది ఏమైనా దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ వెలువడాల్సి ఉంది.
మరోవైపు రామ్ చరణ్ పెద్ది సినిమాకి కూడా సుకుమార్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సినిమా కథ కథనం విషయంలో ఆయన జోక్యం చేసుకోకపోవడం గమనార్హం. వాస్తవానికి పెద్ది సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నది ఎవరో కాదు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన. అయితే తన శిష్యుడు సినిమాకి ఆయన జోక్యం లేకపోవడం అభిమానులు కాస్త అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ చిత్రానికి సహనిర్మాతగా వ్యవహరిస్తున్న సుకుమార్ మరొకవైపు రంగస్థలం సీక్వెల్ స్క్రిప్ట్ పై పూర్తి ధ్యాస పెట్టినట్లు తెలుస్తోంది. అసలుకే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. మరి ఇప్పుడు ఈ సీక్వెల్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
