Begin typing your search above and press return to search.

చరణ్- సుక్కూ మూవీ.. ఆడియన్స్ కు పెద్ద సర్ప్రైజ్?

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   27 Nov 2025 11:11 AM IST
చరణ్- సుక్కూ మూవీ.. ఆడియన్స్ కు పెద్ద సర్ప్రైజ్?
X

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ సినిమా అనౌన్స్మెంట్ గత ఏడాది చరణ్ బర్త్ డే నాడు వచ్చేసింది. దీంతో అప్పటి నుంచే మూవీపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా అప్డేట్స్ కోసం అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

నిజానికి.. ఇప్పటికే చరణ్, సుకుమార్ కలిసి రంగస్థలం మూవీ చేశారు. 2018లో రిలీజ్ అయిన ఆ సినిమా.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. చరణ్ క్రేజ్ ను విపరీతంగా పెంచింది. భారీ వసూళ్లు రాబట్టిన రంగస్థలం.. ఆల్ టైమ్ క్లాసిక్ మూవీగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం సంపాదించుకుందనే చెప్పాలి.

దీంతో ఇప్పుడు రామ్ చరణ్ కోసం సుక్కూ ఎలాంటి కథ రెడీ చేస్తున్నారోనని అనేక మంది నెటిజన్లు, సినీ ప్రియులు, అభిమానులు డిస్కస్ చేసుకుంటున్నారు. రంగస్థలం మూవీ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ ఫిల్మ్ గా తెరకెక్కగా.. ఇప్పుడు ఏ జోనర్ లో సుకుమార్ స్టోరీ సిద్ధం చేస్తున్నారోనని అంతా మాట్లాడుకుంటున్నారు.

అయితే ఇప్పుడు రామ్ చరణ్ - సుకుమార్ కొత్త సినిమా రంగస్థలం లాంటి జోనర్ కాదని తెలుస్తోంది. కంప్లీట్ మోడ్రన్ స్టోరీతో మూవీ ఉండబోతుందట. ఆ విషయాన్ని నిర్మాత, మైత్రీ మూవీ మేకర్స్ అధినేత రవిశంకర్ యలమంచిలి రీసెంట్ గా రివీల్ చేశారు. సమకాలీన కథతోనే చెర్రీ- సుక్కూ మూవీ ఉండబోతుందని తెలిపారు.

దీంతో సినిమాలో రామ్ చరణ్ లుక్.. కచ్చితంగా అల్ట్రా స్టైలిష్ మోడ్ లోనే ఉండబోతుందని అంతా అంచనా వేస్తున్నారు. హీరో లుక్ తో సుకుమార్.. అభిమానులకు పెద్ద సర్ప్రైజ్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నిజానికి.. లెక్కల మాస్టర్ ప్లానింగే వేరు. ఏ మూవీకి అయినా హీరోల లుక్స్ విషయంలో కంప్లీట్ భిన్నంగా వర్క్ చేస్తారు.

అయితే ఇప్పటికే పలు సినిమాల్లోని హీరోలను ఫుల్ స్టైలిష్ గా చూపించారు. వన్ నేనొక్కడినే మూవీలో మహేష్ బాబు, నాన్నకు ప్రేమతో సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ కు అంతా ఫిదా అయ్యారు. వారిద్దరిని సుకుమార్ చూపించిన విధానంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పుడు రామ్ చరణ్‌ ను ఇంకా సూపర్‌ గా చూపించబోతున్నారని నెటిజన్లు, ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. మరి చూడాలి సుకుమార్ ప్లాన్ ఎలా ఉంటుందో? ఎలా సర్ప్రైజ్ చేస్తారో? ప్రస్తుతం ఆయన స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారని వినికిడి.