Begin typing your search above and press return to search.

బన్నీ కంటే ముందు చరణ్ తోనే.. బడా కాంబోపై మైత్రి క్లారిటీ!

​గత కొన్నాళ్లుగా ఇండస్ట్రీలో, ఫ్యాన్స్‌లో ఒకే ఒక్క ప్రశ్న చక్కర్లు కొడుతోంది. "పుష్ప 2' తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి?"

By:  M Prashanth   |   18 Oct 2025 4:32 PM IST
బన్నీ కంటే ముందు చరణ్ తోనే.. బడా కాంబోపై మైత్రి క్లారిటీ!
X

మైత్రీ మూవీ మేకర్స్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఒకవైపు పాన్ ఇండియా అంటూ పెద్ద సినిమాలను లైన్ లో పెడుతూనే మరోవైపు మీడియం రేంజ్ అలాగే చిన్న సినిమాలతో కూడా సక్సెస్ కొడుతున్నారు. ఇక వాళ్లు నిర్మించిన లేటెస్ట్ చిత్రం 'డ్యూడ్' బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్‌తో దూసుకుపోతోంది. ఈ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకోవడానికి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో, నిర్మాత నవీన్ యెర్నేని ఒక బిగ్ అప్‌డేట్‌ను వదిలారు. అది 'డ్యూడ్' గురించి కాదు, టాలీవుడ్ మొత్తం ఎదురుచూస్తున్న ఒక క్రేజీయెస్ట్ కాంబినేషన్ గురించి.

ఈ ఒక్క క్లారిటీతో, సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతోంది.

​గత కొన్నాళ్లుగా ఇండస్ట్రీలో, ఫ్యాన్స్‌లో ఒకే ఒక్క ప్రశ్న చక్కర్లు కొడుతోంది. "పుష్ప 2' తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి?" చాలామంది సహజంగానే అది బన్నీ 'పుష్ప 3' అయి ఉంటుందని ఫిక్స్ అయిపోయారు. ఆ యూనివర్స్‌ను ఆయన అంత త్వరగా వదలరని బలంగా నమ్మారు. ఈ గ్యాప్‌లో రకరకాల రూమర్లు కూడా వినిపించాయి.

​అయితే, ఈ కన్ఫ్యూజన్‌కు, రూమర్లకు 'డ్యూడ్' సక్సెస్ మీట్ వేదికగా ఫుల్‌స్టాప్ పెట్టారు నిర్మాత నవీన్ యెర్నేని. "సుకుమార్ గారి తదుపరి చిత్రం 'పుష్ప 3' కాదు, అది రామ్ చరణ్‌తోనే ఉంటుంది" అని కుండబద్దలు కొట్టారు. ఈ ప్రకటనతో మెగా ఫ్యాన్స్‌లో ఒక్కసారిగా అనుమానాలు బ్లాస్ట్ అయ్యాయి. 'పుష్ప 3' కచ్చితంగా ఉంటుందని, కానీ చరణ్ సినిమా తర్వాతేనని ఆయన స్పష్టం చేశారు.

​ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందనే దానిపై కూడా నవీన్ పూర్తి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో 'పెద్ది' సినిమా చేస్తున్నాడు. "ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యాక, వచ్చే ఏడాది (2026) ఏప్రిల్ లేదా మే నెలలో రామ్ చరణ్, సుకుమార్ ప్రాజెక్ట్ షూటింగ్ మొదలవుతుంది" అని నవీన్ తెలిపారు. దీంతో, ఈ సినిమాపై ఒక అధికారిక టైమ్‌లైన్ కూడా వచ్చేసింది.

​రామ్ చరణ్ సుకుమార్ కాంబో అనగానే అందరికీ 'రంగస్థలం' గుర్తొస్తుంది. చరణ్ కెరీర్‌లోనే ఒక ల్యాండ్‌మార్క్‌గా, నటుడిగా అతన్ని మరో మెట్టు ఎక్కించిన ఆ కల్ట్ క్లాసిక్ తర్వాత, మళ్ళీ ఈ ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారంటే అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయడానికి ఇద్దరూ సిద్ధమవుతున్నారు. ​మొత్తం మీద, ఈ ఒక్క ప్రకటనతో సుకుమార్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై ఉన్న సస్పెన్స్‌కు తెరపడింది. 'పుష్ప 3' కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు కాస్త వెయిటింగ్ తప్పకపోయినా, అంతకుమించిన పవర్ ప్యాక్డ్ ప్రాజెక్ట్ రాబోతోందనే ఆనందం ఇప్పుడు అందరిలోనూ కనిపిస్తోంది.