సుకుమార్ కొత్త ఛాయిస్‌లో ప్లస్‌లు, రిస్క్‌లు
కానీ మారతున్న ఆడియన్స్ టేస్ట్, మేకింగ్ శైలికి తగ్గట్టు వాళ్లు కూడా కొత్త మ్యూజిక్ డైరెక్టర్ల వైపు అడుగులు వేశారు.
By: M Prashanth | 4 Aug 2026 11:51 AM ISTసినిమా ఇండస్ట్రీలో ఒక సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ ఎక్కువ కాలం కొనసాగడం అనేది అంత తేలికైన విషయం కాదు. ఎన్నో ఏళ్లపాటు ట్రాక్ రికార్డ్ ఉన్నప్పటికీ, పరిస్థితులు, బాక్సాఫీస్ లెక్కలు మారేసరికి మార్పులు తప్పవు. ఒకప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ లాంటి స్టార్ డైరెక్టర్లు వరుసగా దేవి శ్రీ ప్రసాద్‌తోనే సినిమాలు చేస్తూ వచ్చారు. కానీ మారతున్న ఆడియన్స్ టేస్ట్, మేకింగ్ శైలికి తగ్గట్టు వాళ్లు కూడా కొత్త మ్యూజిక్ డైరెక్టర్ల వైపు అడుగులు వేశారు.
అయితే కాంబినేషన్‌ను మార్చడం వల్ల ప్రాజెక్ట్‌కి ఒక రకమైన కొత్తదనం వస్తుందనడంలో సందేహం లేదు. సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుంచే సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కోసం దేవి శ్రీ ప్రసాద్ స్థానంలో కొత్త మ్యూజిక్ డైరెక్టర్ పేరు ప్రచారంలోకి రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ విజయం తర్వాత రామ్ చరణ్ సినిమాకు పక్కా డిఫరెంట్ సౌండింగ్ ఇవ్వాలనే ఆలోచనతోనే ఈ ప్రయోగం చేస్తున్నట్లు సమాచారం.
కొత్త కాంబినేషన్ వల్ల ఒకవైపు క్రేజ్, ఫ్రెష్ వైబ్ వస్తుంది కానీ, మరోవైపు అంతకుమించిన రిస్క్ కూడా పొంచి ఉంటుంది. ఆర్య నుంచి రంగస్థలం, పుష్ప వరకు సుకుమార్ దేవి శ్రీ ప్రసాద్ కాంబో ఇండస్ట్రీలో ఆల్ టైమ్ చార్ట్‌బస్టర్ ఆల్బమ్స్ అందించింది. వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సుకుమార్ విజన్ కి దేవి ఇచ్చే మ్యూజిక్ ఎప్పుడూ ఒక రేంజ్ లో సింక్ అయ్యేది. ఇప్పుడు అంతటి ఐకానిక్ ట్రాక్ రికార్డ్‌ను పక్కనపెట్టి కొత్త టెక్నీషియన్‌ను ఎంచుకున్నప్పుడు ఆ అంచనాలను అందుకోవడం అతిపెద్ద సవాల్ గా మారుతుంది.
ట్రెండ్ మారుతున్న సమయంలో ఇలాంటి ప్రయోగాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయనేది అసలు పాయింట్. ఒక మ్యూజిక్ డైరెక్టర్ లోని బెస్ట్ అవుట్‌పుట్‌ను బయటకు తీయడంలో సుకుమార్‌కు మంచి అనుభవం ఉంది. కాబట్టి కొత్త మ్యూజిక్ డైరెక్టర్‌తో ఆయన ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారనేది చాలా కీలకం.
పాత రొటీన్ సౌండింగ్ కి భిన్నంగా, సరికొత్త ఆర్ఆర్‌ఆర్ బాటలో చరణ్ ఇమేజ్ కి తగ్గట్లు గ్లోబల్ అప్పీల్ ఉండే మ్యూజిక్ ఇస్తే మాత్రం ఈ కాంబినేషన్ ఛేంజ్ వర్కౌట్ అయినట్లే. ఈ మార్పుల వల్ల సినిమా బిజినెస్ కి గానీ, క్రియేటివ్ వైబ్‌కి గానీ కొత్త ఎనర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. కాంబినేషన్లు మారడం సినీ పరిశ్రమలో చాలా కామన్ అయినా, సుకుమార్ లాంటి బ్రాండ్ క్రియేటర్ తన మ్యూజిక్ డిపార్ట్‌మెంట్‌ను రీ డిజైన్ చేయడం ఖచ్చితంగా ఒక డిఫరెంట్ గేమ్. చూడాలి మరి ఎం జరుగుతుందో.
