RC17 లో బాలీవుడ్ ఫ్లాప్ హీరోయిన్?
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఈ మూవీ తర్వాత రామ్ చరణ్, సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయనున్నట్టు ఇప్పటికే క్లారిటీ వచ్చింది.
By: Sravani Lakshmi Srungarapu | 23 Sept 2025 1:49 PM ISTగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది అనే పాన్ ఇండియన్ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తుండగా, పెద్దిపై అందరికీ భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఈ మూవీ తర్వాత రామ్ చరణ్, సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయనున్నట్టు ఇప్పటికే క్లారిటీ వచ్చింది.
చరణ్ సరసన బాలీవుడ్ హీరోయిన్?
రంగస్థలం తర్వాత సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలుండగా, ఇప్పుడు ఈ ప్రాజెక్టు గురించి ఓ క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది. చరణ్ కెరీర్లో 17వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో రామ్ చరణ్ సరసన నటించడానికి బాలీవుడ్ భామను తీసుకోవాలని సుకుమార్ భావిస్తున్నారట.
ఫ్లాప్ హీరోయిన్ ను ఎందుకని మెగా ఫ్యాన్స్ నిరాశ
ఆ బాలీవుడ్ బ్యూటీ మరెవరో కాదు. కృతి సనన్. ఇప్పటికే చిత్ర యూనిట్ ఆమెను సంప్రదించిందని, కథా చర్చలు జరుపుతున్నారని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. టాలీవుడ్ లో కృతి ఇప్పటికే మూడు సినిమాలు చేశారు. కానీ ఆ మూడు సినిమాల ఫలితాలూ ఆకట్టుకునే స్థాయిలో లేవనేది కొత్తగా చెప్పనక్కర్లేదు.
కృతి టాలీవుడ్ లో ముందుగా 1 నేనొక్కడినే చేయగా, ఆ తర్వాత దోచెయ్, ఆఖరిగా ఆదిపురుష్ సినిమాలు చేశారు. ఆ మూడు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచే ఫలితాల్నే అందుకున్నాయి. అలాంటి హీరోయిన్ ను ఇప్పుడు రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా తీసుకుంటున్నారని తెలియడంతో మెగా ఫ్యాన్స్ నిరాశ చెందుతూ, ఫ్లాపుల హీరోయిన్ ను ఎందుకు తీసుకుంటున్నారని తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
RC17 స్క్రిప్ట్ పూర్తి
ఇక సుకుమార్ విషయానికొస్తే ఇప్పటికే ఆయన ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేసి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ను జరుపుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈసారి చరణ్ సినిమాకు సుకుమార్ దర్శకుడిగానే కాకుండా నిర్మాణ బాధ్యతలను కూడా చూసుకోనున్నారు. పుష్ప2 తర్వాత సుకుమార్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుకు పాన్ ఇండియా స్థాయిలో మంచి హైప్ వచ్చే అవకాశముంది.
