చరణ్ నెక్స్ట్.. 'మైత్రీ' సౌండ్ లేదేంటి?
స్టార్ హీరో రామ్ చరణ్.. ఇప్పుడు పెద్ది మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
By: M Prashanth | 6 Feb 2026 11:57 AM ISTస్టార్ హీరో రామ్ చరణ్.. ఇప్పుడు పెద్ది మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఆ సినిమా.. సమ్మర్ కానుకగా థియేటర్స్ లోకి రానుంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఆ మూవీ.. చరణ్ బర్త్ డే స్పెషల్ గా మార్చి 27వ తేదీన రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకున్నారు మేకర్స్.
కానీ కొన్ని కారణాల వల్ల ఏప్రిల్ కు వాయిదా వేయగా.. చరణ్ కాస్త లేట్ గా థియేటర్స్ లో సందడి చేయనున్నారు. అయితే పెద్ది సినిమా సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం సోషల్ మీడియాలో నెటిజన్లు, సినీ ప్రియులు డిస్కస్ చేసుకుంటున్నారు. నిజానికి.. పెద్ది తర్వాత జీనియస్ డైరెక్టర్ సుకుమార్ తో వర్క్ చేయనున్నట్లు ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది.
గతంలో చరణ్, సుకుమార్ కలిసి చేసిన రంగస్థలం మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. ఆ కాంబో రిపీట్ అవుతుందని ప్రకటన రాగానే అంతా భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరో భారీ హిట్ పక్కా అని ఫిక్స్ కూడా అయిపోయారు. రంగస్థలం చిత్రానికి మించిన కథనంతో సినిమా ఉంటుందని.. కంప్లీట్ మాస్ జోనర్ లో మూవీ ఉండనుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
కానీ సినిమా షూటింగ్ సహా మిగతా విషయాలపై ఎలాంటి అప్డేట్ రాకపోవడంపై ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించనున్న చరణ్- సుక్కూ మూవీ చిత్రీకరణ సమ్మర్ లో మొదల్వవనుందని వార్తలు వస్తున్నాయి. అందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. కానీ అఫీషియల్ గా మాత్రం ఎలాంటి అప్డేట్ లేదు.
అయితే ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్.. తమ బ్యానర్ పై రూపొందుతున్న చిత్రాలతో బిజీ బిజీగా ఉంది. ఇప్పుడు అనేక సినిమాలను నిర్మిస్తోంది. వాటి రిలీజ్ లు, ప్రమోషన్స్, ప్రొడక్షన్ వర్క్స్ తో తీరిక లేకుండా గడుపుతోంది. అందుకే ప్రకటన ఇవ్వలేదని టాక్ వినిపిస్తోంది. మే నెలలో పూజా కార్యక్రమాలు నిర్వహించి.. రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది.
కాగా.. వచ్చే నెల చివరి కల్లా చరణ్ పెద్ది మూవీ షూటింగ్ ను పూర్తి చేయనున్నారట. ఆ తర్వాత ప్రమోషన్స్ లో పాల్గొనున్నారు. అనంతరం చిన్న గ్యాప్ తీసుకుని.. సుకుమార్ మూవీతో బిజీ అవ్వనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే స్టోరీ వర్క్ పూర్తి చేసిన సుక్కూ.. ప్రీ ప్రొడక్షన్ పనులపై ఫోకస్ చేసినట్లు సమాచారం. ఏదేమైనా అనౌన్స్మెంట్ నుంచి భారీ అంచనాలు క్రియేట్ అవ్వడంతో.. అందుకు తగ్గట్లే సినిమాను గ్రాండ్ గా రూపొందించాలని మేకర్స్ ఇప్పటికే ఫిక్స్ అయ్యారట. అన్ని జాగ్రత్తలు తీసుకుని బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలనే ప్లాన్ లో ఉన్నారని టాక్. మరి చరణ్, సుకుమార్ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో వేచి చూడాలి.
