Begin typing your search above and press return to search.

చరణ్ బీటౌన్ ఎంట్రీ.. మామూలు ప్లాన్ కాదు ఇది!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో భారీ ప్రాజెక్ట్‌ కు సిద్ధమవుతున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారింది.

By:  M Prashanth   |   11 April 2026 4:59 PM IST
చరణ్ బీటౌన్ ఎంట్రీ.. మామూలు ప్లాన్ కాదు ఇది!
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో భారీ ప్రాజెక్ట్‌ కు సిద్ధమవుతున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారింది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో చరణ్ వర్క్ పనిచేయబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోయినా, ఆ కాంబినేషన్‌ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆ ప్రాజెక్ట్ ఒక పీరియడ్ జంగిల్ అడ్వెంచర్‌ గా తెరకెక్కే అవకాశముంది. ఇప్పటి వరకు రాజభవనాలు, చారిత్రక కథలతో ప్రేక్షకులను అలరించిన భన్సాలీ, ఈసారి అడవి నేపథ్యంలో సాగే సాహస కథను ఎంచుకోవడం ప్రత్యేకంగా మారింది. పాత కాలం నాటి అడవుల్లో సాగే ఆ కథలో రామ్ చరణ్ పాత్ర కొత్త కోణంలో కనిపించనుందని తెలుస్తోంది. ఆయన మాస్ ఇమేజ్‌ కు సరిపోయేలా యాక్షన్, అడ్వెంచర్ అంశాలకు పెద్దపీట వేస్తున్నట్లు సమాచారం.

ఆ సినిమాను భారీ కాన్వాస్‌ పై రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని సమచారం. ముఖ్యంగా ప్రత్యేకమైన గ్రాండ్ సెట్స్, అద్భుతమైన విజువల్స్ ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయి. చిత్రాన్ని ప్రధానంగా హిందీలో తెరకెక్కించి, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని భావిస్తున్నారట.

సౌత్ లో చరణ్‌ కు ఉన్న క్రేజ్, నార్త్ లో భన్సాలీకి ఉన్న మార్కెట్ కలిసి ఆ సినిమాకు భారీ ఓపెనింగ్స్ తెచ్చిపెడతాయని అంచనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే రామ్ చరణ్‌ కు కథ వినిపించినట్లు సమాచారం. ఆయన సూచనల మేరకు కథ, స్క్రీన్‌ ప్లేలో కొన్ని మార్పులు చేసినట్టు తెలుస్తోంది. భన్సాలీ నిర్మాతగా వ్యవహరించగా, దర్శకత్వ బాధ్యతలను బాలీవుడ్‌ కు చెందిన మరో ప్రముఖ దర్శకుడు చేపట్టే అవకాశం ఉందని వినికిడి.

ప్రస్తుతం కథా చర్చలు తుది దశలో ఉన్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే మగధీర, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాల్లో పీరియాడిక్ పాత్రలతో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్న రామ్ చరణ్, ఈ జంగిల్ అడ్వెంచర్‌తో మరోసారి కొత్త రికార్డులు సృష్టించగలరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లు చిత్రానికి హైలైట్‌ గా నిలవనున్నాయట.

ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది షూటింగ్‌ తో బిజీగా ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యాక లేదా మధ్యలోనే భన్సాలీ ప్రాజెక్ట్‌ కు సంబంధించిన ముహూర్తం జరిగే అవకాశముందని సమాచారం. అదే సమయంలో ఆయన సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. మొత్తానికి, ఒక వైపు గ్లోబల్ గుర్తింపు పొందిన చరణ్, మరో వైపు విజువల్ గ్రాండియర్‌ కు కేరాఫ్ అడ్రస్ అయిన భన్సాలీ కలయికలో సినిమా రానుండడం నిజమైతే ఫ్యాన్స్ కు పండగే. అదే సమయంలో బాలీవుడ్ లోకి చరణ్ కు గ్రాండ్ ఎంట్రీ దక్కుతుందనే చెప్పాలి.