రామ్ చరణ్ - సందీప్ రెడ్డి వంగ కాంబోలో మూవీ వచ్చేది అప్పుడేనా..?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన కెరియర్ ను మొదలుపెట్టిన రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్' సినిమాతో 'గ్లోబల్ స్టార్' గా అవతరించాడు.
By: Gopi Velupala | 15 Oct 2026 12:07 PM ISTతెలుగు సినిమా ఇండస్ట్రీలో తన కెరియర్ ను మొదలుపెట్టిన రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్' సినిమాతో 'గ్లోబల్ స్టార్' గా అవతరించాడు. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు. రామ్ చరణ్ ఎంచుకునే కథల్లో వైవిధ్యం కనిపిస్తోంది. అతని అభిమానులు సైతం ఆయన నుంచి ఎలాంటి క్యారెక్టర్ ని కోరుకుంటున్నారో అలాంటి పాత్రలను స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడానికి ఆయన ప్రయత్నిస్తూనే ఉంటాడు. ప్రస్తుతం రామ్ చరణ్ తో సినిమాలు చేయడానికి చాలామంది దర్శకులు క్యూ కడుతున్నారు.
సందీప్ రెడ్డి వంగ తో మూవీ...
'అర్జున్ రెడ్డి' మూవీ తో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో అలజడి సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ...ఆయన డైరెక్షన్ లో నటించడానికి స్టార్ హీరోలు ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం 'స్పిరిట్' సినిమా బిజీలో ఉన్న సందీప్ ఈ మూవీ పూర్తయిన వెంటనే తన తదుపరి సినిమాను అనౌన్స్ చేస్తాడట. మొత్తానికైతే రామ్ చరణ్ తో ఒక భారీ యాక్షన్ మూవీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. సందీప్ సినిమాల్లో ఎమోషన్స్ పీక్స్ లెవెల్లో ఉంటాయి, హీరో ఒక ట్రాన్స్ లో ఉంటాడు. హీరో తను నమ్మిన బాటలోనే ముందుకు సాగుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే హీరో తాలూకు ఎమోషన్స్ సైతం చాలా హై రేంజ్ లో చూపిస్తూ స్క్రీన్ ప్లే విషయంలో కూడా సందీప్ చాలా పకడ్బందీగా ముందుకు సాగుతాడు. ప్రేక్షకుడికి బోర్ కొట్టించకుండా సీన్స్ ను డిజైన్ చేయడం లో సందీప్ సిద్ధహస్తుడు.
సినిమాలోని ఇంటెన్సిటి మిస్ అవ్వకుండా ప్రజెంట్ చేయడంలో సందీప్ తర్వాతే ఎవరైనా? అందుకే వీలైనంత తొందరగా రామ్ చరణ్ సందీప్ డైరెక్షన్లో నటించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. కానీ ప్రస్తుతం ఇద్దరికీ ఉన్న కమిట్ మెంట్స్ ప్రకారం వీళ్ళిద్దరి కాంబోలో సినిమా రావాలి అంటే మరో రెండు సంవత్సరాల పాటు వెయిట్ చేయక తప్పదు... రామ్ చరణ్ అభిమానులు సైతం సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో నటిస్తే మరోసారి చరణ్ లోని పూర్తిస్థాయి నటుడు బయటికి వస్తాడని 'రంగస్థలం' సినిమాలో రూరల్ బ్యాక్ డ్రాప్ లో నటించి తనలోని డిఫరెంట్ షేడ్స్ చూపించిన రామ్ చరణ్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో నటిస్తే చాలా స్టైలిష్ గా కనిపిస్తూనే తనలోని పూర్తిస్థాయి నటుడిని మరోసారి బయటికి తీసే అవకాశం ఉందని భావిస్తున్నారు... ఒక క్యారెక్టర్ కోసం పూర్తి డెడికేషన్ తో వర్క్ చేసే రామ్ చరణ్, సందీప్ మూవీ కోసం పూర్తిగా తనకు సరెండర్ అయిపోయే మూవీ చేసే అవకాశాలైతే ఉన్నాయి.
