నిన్న ఎన్టీఆర్.. నేడు రామ్ చరణ్....ఫ్యాన్స్ రిక్వెస్ట్‌కు హీరోల రియాక్షన్ వైరల్!
రీసెంట్‌గా విడుదలైన 'పెద్ది' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయంతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో హీరో రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబుతో కలిసి హైదరాబాద్‌లోని ఒక థియేటర్‌లో సినిమా చూసేందుకు వెళ్లారు.
By: Madhu Reddy | 8 Jun 2026 2:44 PM ISTవెండితెరపై కనిపించే స్టార్ హీరోలు రియల్ లైఫ్‌లో కూడా తమ అభిమానుల మనసు గెలుచుకుంటున్నారు. మొన్న జూనియర్ ఎన్టీఆర్ లైవ్ చాట్‌లో అడిగిన వెంటనే అభిమానికి బిస్కెట్లు పంపించి షాక్ ఇవ్వగా, తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా థియేటర్లలో ఓ ఫ్యాన్ అడిగిన క్రేజీ రిక్వెస్ట్‌కు అదిరిపోయే రిప్లై ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ హీరోలిద్దరూ బ్యాక్ టు బ్యాక్ తమ సింప్లిసిటీతో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూద్దాం.
రామ్ చరణ్ కు ఫ్యాన్ స్పెషల్ రిక్వెస్ట్:
రీసెంట్‌గా విడుదలైన 'పెద్ది' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయంతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో హీరో రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబుతో కలిసి హైదరాబాద్‌లోని ఒక థియేటర్‌లో సినిమా చూసేందుకు వెళ్లారు. అక్కడ చరణ్‌ను చూసిన ఒక అభిమాని ఎమోషనల్ అవుతూ.. "అన్న, సినిమా చిన్నదైనా పెద్దదైనా పర్లేదు.. ఏడాదికి కనీసం ఒక సినిమా అయినా చేయండి. జనాలు మిమ్మల్ని స్క్రీన్ మీద చూడాలనుకుంటున్నారు" అని గట్టిగా అడిగాడు. దానికి చరణ్ నవ్వుతూ సానుకూలంగా థంబ్స్ అప్ సింబల్ చూపిస్తూ ఒప్పుకున్నారు. దీంతో థియేటర్ అంతా ఈలలతో మార్మోగిపోయింది.
200 కోట్ల క్లబ్‌లో ‘పెద్ది’ సంచలనం:
బుచ్చిబాబు దర్శకత్వంలో,చరణ్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్స్ వచ్చిన 'పెద్ది' సినిమా థియేటర్లలో రికార్డుల వేట కొనసాగిస్తోంది. జూన్ 4న విడుదలైన ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ఇక ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. సినిమా సూపర్ హిట్ టాక్‌తో నడుస్తుండటంతో చరణ్ కూడా ఫుల్ జోష్‌లో ఉన్నారు.
మొన్న ఎన్టీఆర్ కుకీస్ మ్యాజిక్:
టాలీవుడ్ స్టార్ హీరోలు ఈ మధ్య అభిమానులతో చాలా క్లోజ్‌గా ఉంటున్నారు. మొన్నటికి మొన్న జూనియర్ ఎన్టీఆర్ ఇన్స్టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చి వంటింట్లో స్వయంగా కుకీస్ తయారు చేశారు. ఆ సమయంలో ఒక అభిమాని "అన్నా, ఆ కుకీస్ నాకు పంపిస్తారా?" అని సరదాగా అడిగితే, తారక్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆ అభిమాని అడ్రస్ కనుక్కొని మరీ కుకీస్ పార్సిల్ పంపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయింది.
ఏది ఏమైనా కోట్లల్లో ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలు, తమను ప్రాణంగా భావించే అభిమానుల కోరికలను గౌరవిస్తూ ఇలా రియాక్ట్ అవ్వడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ ఫ్యాన్స్ అడిగిన దానికి కాదనకుండా ఓకే చెప్పి రియల్ హీరోలనిపించుకున్నారు. చరణ్ ఇచ్చిన మాట ప్రకారం ఇకపై గ్యాప్ ఇవ్వకుండా ఏడాదికి ఒక సినిమా అయినా రిలీజ్ చేయాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు.
