Begin typing your search above and press return to search.

రామ్ చరణ్ ఆ దర్శకుడికి డేట్స్ ఇవ్వడం కష్టమేనా..?

రామ్ చరణ్ జంజీర్ మూవీ లో ఎంతో కష్టపడినప్పటికి ప్రతిఫలం మాత్రం దక్కలేదు. ఆ తర్వాత తనను తాను కొత్తగా ఆవిష్కరించుకొని 'రంగస్థలం' లో చిట్టి బాబు పాత్రతో ఆకట్టుకున్నాడు.

By:  Gopi Velupala   |   7 Oct 2026 3:50 PM IST
రామ్ చరణ్ ఆ దర్శకుడికి డేట్స్ ఇవ్వడం కష్టమేనా..?
X

మెగా స్టార్ తనయుడిగా ఇండస్ట్రీ కి పరిచయమైన రామ్ చరణ్ తన మొదటి మూవీతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆరంభంలోనే పెద్ద హిట్ ను తన ఖాతా లో వేసుకొని అభిమానుల్లో కొత్త జోష్ నింపాడు. డ్యాన్స్, ఫైట్స్ తో విమర్శకులను మెప్పించిన చరణ్ నటన పరంగా కొన్ని విమర్శలను ఎదుర్కున్నాడు... దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'మగధీర' మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత రచ్చ, నాయక్ లాంటి వరుస విజయాలతో టాప్ గేర్ లో దూసుకెళ్తున్నప్పుడు 'జంజీర్' సినిమా చేసి మాయని మచ్చను తన ఖాతాలో వేసుకున్నాడు...

బాలీవుడ్ ఎంట్రీ

'బిగ్ బి అమితాబచ్చన్' ఎవర్ గ్రీన్ క్లాసిక్ 'జంజీర్' రీమేక్ తో అపూర్వ లఖియా రామ్ చరణ్ ను హిందీ చిత్ర సీమ కి పరిచయం చేశారు. రిలీజ్ కి ముందు చరణ్ తో పాటు అతని అభిమానులు ఈ మూవీ మీద భారీ ఆశలు పెట్టుకున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీ లో రామ్ చరణ్ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నాడని భావించారు. సినిమా రిలీజ్ అయ్యాక అనుకున్న విధంగా ఫలితంగా రాలేదు. మొదటి షో తోనే డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది. ముఖ్యంగా డైరెక్టర్ కథ కథనంలో చేసిన మార్పులు ఈ జనరేషన్ ఆడియన్స్ ను మెప్పించలేకపోయాయి... ఫైనల్ గా బాలీవుడ్ వాళ్ళు రామ్ చరణ్ కి యాక్టింగ్ రాదంటూ విమర్శించారు.

విమర్శలకు చెక్...

రామ్ చరణ్ జంజీర్ మూవీ లో ఎంతో కష్టపడినప్పటికి ప్రతిఫలం మాత్రం దక్కలేదు. ఆ తర్వాత తనను తాను కొత్తగా ఆవిష్కరించుకొని 'రంగస్థలం' లో చిట్టి బాబు పాత్రతో ఆకట్టుకున్నాడు. 'త్రిబుల్ ఆర్' సినిమాలో అల్లూరి సీతారామరాజు గా ఆయన చూపించిన అభినయానికి హాలీవుడ్ దర్శకుల నుంచి ప్రశంశలు దక్కాయి. ఈ మూవీస్ లో రామ్ చరణ్ యాక్టింగ్ గురించి జాతీయ, అంతర్జాతీయ మీడియాల్లో కొన్ని కథనాలు వెలువడ్డాయి. దాంతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అంటూ అభిమానులు ప్రశంసలు కురిపించారు. బాలీవుడ్ మీడియా సైతం త్రిబుల్ ఆర్ తర్వాత ఆయనను పొగుడుతూ కొన్ని కథనాలు రాశారు...

డైరెక్టర్ కి డేట్స్ ఇవ్వడం కష్టమే...

రీసెంట్ గా అపూర్వ లాఖియా కొత్త ప్రాజెక్ట్ కోసం రామ్ చరణ్ ను సంప్రదించినట్టు ఫిలింనగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరోసారి రామ్ చరణ్ తో కలిసి పని చేయడానికి తను ఆసక్తిగా ఉన్నాడట. మొదటి సినిమాను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయిన దర్శకుడిని మళ్ళీ నమ్మడం సరైనది కాదని, పైగా చరణ్ అభిమానులను నిరాశపరిచిన ఆ చేదు జ్ఞాపకాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రతిపాదననను తిరస్కరించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం రామ్ చరణ్ సుకుమార్ తో రాబోయే భారీ ప్రాజెక్ట్ మీద దృష్టి పెట్టాడు. దాని తర్వాత ప్రశాంత్ నీల్, సందీప్ రెడీ వంగ కాంబోలో రికార్డులను తిరగరాసే కాన్సెప్ట్ లతో సినిమాలు రానున్నాయి...