స్వేచ్ఛగా పిల్లలతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్!
ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పూర్తి విశ్రాంతిలో ఉన్న సంగతి తెలిసిందే. గాయం అవ్వడంతో సర్జరీ అనంతరం కొన్ని వారాల పాటు విశ్రాంతి అవసరం అని డాక్టర్లు సూచించడంతో? ఇంటికే పరిమితయ్యారు.
By: Srikanth Kontham | 10 Sept 2026 5:00 PM ISTప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పూర్తి విశ్రాంతిలో ఉన్న సంగతి తెలిసిందే. గాయం అవ్వడంతో సర్జరీ అనంతరం కొన్ని వారాల పాటు విశ్రాంతి అవసరం అని డాక్టర్లు సూచించడంతో? ఇంటికే పరిమితయ్యారు.
దీంతో చరణ్ ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నారు. నిరంతరం బిజీ షెడ్యూళ్లు, అవుట్‌డోర్ షూటింగ్‌లతో గడిపే చరణ్‌కు ఈ విరామం అనుకోకుండా లభించినా? దీనిని ఆయన ఎంతో సానుకూలంగా మార్చుకున్నారు.
సాధారణంగా సినిమాలతో బిజీగా ఉన్నప్పుడు నటీనటులకు కుటుంబంతో ప్రశాంతంగా గడిపే సమయం చాలా తక్కువగా దొరుకుతుంది. రోజువారీ షూటింగ్‌ల వల్ల ఉదయాన్నే ఇంటి నుంచి బయలుదేరడం, రాత్రి బాగా ఆలస్యంగా తిరిగి రావడం చరణ్‌కు పరిపాటిగా మారేది. దీంతో ఇంట్లో ఉండే చిన్నారులకు తగినంత సమయం కేటాయించ లేకపోవడం.. వారి మెమోరీస్ ను దగ్గరుండి ఆస్వాదించడం సాధ్యమయ్యేది కాదు.
అయితే గాయం వల్ల లభించిన విశ్రాంతి సమయాన్ని చరణ్ చిన్నారుల కోసం కేటాయిస్తున్నారు. ఇంట్లోనే ఉంటూ పిల్లలతో స్వేచ్ఛగా సమయం గడుపుతున్నారు. వారితో కలిసి సరదాగా ఆడుకోవడం, వారి చిలిపి చేష్టలను ఆస్వాదించడం చరణ్ దినచర్యగా మారిపోయింది. షూటింగ్ ఒత్తిళ్లకు దూరంగా ప్రశాంత వాతావరణంలో చిన్నారులతో సమయం గడపడం చరణ్ కు ఎంతో ఉపశమనాన్ని ఇస్తోంది.
చిన్నారులతో గడిపే ఈ క్షణాలు రామ్ చరణ్‌కు మానసిక ప్రశాంతతను అందించడమే కాకుండా ఆయన కోలుకోవడానికి కూడా ఎంతగానో దోహదపడుతున్నాయి. ఎంతటి భారీ బడ్జెట్ సినిమాలు, పాన్-ఇండియా స్టార్‌డమ్ ఉన్నప్పటికీ ఇంట్లో చిన్నారుల నవ్వుల ముందు అవన్నీ చిన్నబోతాయని ఈ అనుభవం నిరూపిస్తోంది. తండ్రిగా తన బాధ్యతలను, ప్రేమానురాగాలను ఈ సమయం ద్వారా చరణ్ నిండుగా ఆస్వాదిస్తున్నారు.
సాధారణంగా షూటింగ్ హడావుడిలో కుటుంబానికి సరైన సమయం కేటాయించలేకపోయాననే భావన ప్రతి బిజీ నటుడిలోనూ ఉంటుంది. కానీ అనుకోని విరామం ద్వారా పిల్లలతో బలమైన మానసిక బంధాన్ని ఏర్పరచుకోవడానికి చరణ్‌కు అద్భుతమైన అవకాశం లభించింది. పిల్లలు చేసే ప్రతి చిన్న పనిని దగ్గరుండి చూడటం, వారితో చిన్న పిల్లవాడిగా మారిపోవడం చరణ్ దినచర్యలో భాగమైంది.
త్వరలోనే పూర్తి స్థాయిలో కోలుకుని తిరిగి సెట్స్‌పైకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్న రామ్ చరణ్‌కు ఈ విశ్రాంతి సమయం ఓ తీపి జ్ఞాపకంగా మిగిలిపోనుంది. ఒక నటుడిగా వరుస ప్రాజెక్టులతో ఎంత బిజీగా ఉన్నా? కుటుంబానికి, చిన్నారుల ఎదుగుదలకు సమయం కేటాయించడం ఎంత ముఖ్యమో ఈ సమయం ద్వారా చరణ్ మరొకసారి అనుభూతి పొందుతున్నారు.
