Begin typing your search above and press return to search.

RC17 : అప్పుడు ఆది, ఫాహద్‌ ఇప్పుడు రిషికాంత్‌..!

రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న RC17 పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నట్లు సమాచారం. సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా, తమిళ నటుడు రిషికాంత్ రాజేంద్రన్ కీలక పాత్రలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే నటీనటుల ఎంపికపై చిత్రబృందం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

By:  Ramesh Palla   |   10 Nov 2026 1:22 PM IST
RC17 : అప్పుడు ఆది, ఫాహద్‌ ఇప్పుడు రిషికాంత్‌..!
X

రామ్ చరణ్‌ ఫ్యాన్స్‌తో పాటు తెలుగు సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న RC17 మూవీ ఎట్టకేలకు పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. రెగ్యులర్‌ షూటింగ్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రారంభిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ నడుస్తోంది. సుకుమార్‌ సినిమా అంటే సాధారణంగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉంటాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాను సుకుమార్‌ తీస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా రామ్‌ చరణ్‌, సుకుమార్‌ కాంబోలో గతంలో వచ్చిన రంగస్థలం సినిమా బాక్సాఫీస్‌ వద్ద బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే విశ్వాసం అంతా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌, ఇతర నటీనటుల గురించి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే.

రామ్‌ చరణ్‌ కు జోడీగా సాత్విక వీరవల్లి...

మొన్నటి వరకు హీరోయిన్‌ విషయమై పుకార్లు షికార్లు చేశాయి. బాలీవుడ్‌ బ్యూటీ సారా అర్జున్‌ ను హీరోయిన్‌గా ఎంపిక చేశారనే పుకార్లు వినిపించాయి. అంతకు ముందు మరో హీరోయిన్‌ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. చివరగా తెలుగు మూలాలు ఉన్న ముద్దుగుమ్మ సాత్విక వీరవల్లిని హీరోయిన్‌గా ఎంపిక చేశారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈమె యూఎస్‌ లో పుట్టి పెరిగిన తెలుగు అమ్మాయి. ఆకాశంలో ఒక తార అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటించిన ఈ సినిమా ఇదే నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఆ సినిమా విడుదల కాకుండానే రామ్‌ చరణ్‌ కి జోడీగా నటించే అవకాశం ను సాత్విక వీరవల్లి దక్కించుకోవడం ఆశ్చర్యంగా ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుతున్నారు. అయితే సుకుమార్‌ అండ్ టీం నుంచి ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.

ఆర్‌సీ 17 సినిమాలో రిషికాంత్‌ రాజేంద్రన్‌...

ఇక సినిమాలో కీలకమైన పాత్ర కోసం తమిళనటుడు రిషికాంత్‌ రాజేంద్రన్‌ ను ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. యూట్యూబర్‌గా కెరీర్‌ను ప్రారంభించి సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని పెద్ద పోరాటమే చేసిన రిషికాంత్‌ ఈ ఏడాది వచ్చిన డోరతి సినిమాతో అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు. తన నటనతో కేవలం తమిళ్‌ ప్రేక్షకులను మాత్రమే కాకుండా పాన్‌ ఇండియా సినీ ప్రేమికులను సర్‌ప్రైజ్ చేశాడు అనడంలో సందేహం లేదు. లోపల ఉన్న ఆడ మనిషిని దాచి పెట్టి, బయటకు మగ మనిషిగా కనిపించే పాత్రలో రిషికాంత్‌ 'డోరతి' సినిమాలో నటించి మెప్పించాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో రిషికాంత్‌ గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు రిషికాంత్‌ టాలీవుడ్‌లో సుకుమార్‌ సినిమాతో రామ్‌ చరణ్‌ ఢీ కొడుతూ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు ప్రముఖంగా వార్తలు వస్తున్నాయి.

రామ్‌ చరణ్‌, సుకుమార్‌ సినిమా అప్‌డేట్‌...

సుకుమార్‌ తన సినిమాల్లో మెయిన్‌ హీరో కాకుండా మరో హీరోను నటింపజేస్తూ ఉంటాడు. ఆర్య నుంచి మొదలుకుని మొన్నటి పుష్ప వరకు ప్రతి సినిమాలో హీరో కాకుండా మరో హీరోను నటింపజేస్తూ ఉంటాడు. రామ్‌ చరణ్‌ తో సుకుమార్‌ గతంలో తీసిన రంగస్థలం సినిమాలో హీరో ఆది పినిశెట్టి నటించిన విషయం తెల్సిందే. ఇక పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌ తో పాటు మలయాళ స్టార్‌ నటుడు ఫాహద్‌ ఫాసిల్‌ నటించిన విషయం తెల్సిందే. ఇప్పుడు రామ్‌ చరణ్‌తో సుకుమార్‌ తీయబోతున్న ఆర్‌సీ17 సినిమాలో సైతం నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకుని, హీరోగా వరుస సినిమాలు చేస్తున్న రిషికాంత్‌ ను ఎంపిక చేయడం జరిగింది. రిషికాంత్‌ కు ఈ సినిమా కచ్చితంగా కెరీర్‌ లో నిలిచి పోయే సినిమా అవుతుందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది చివరి వరకు నటీనటుల ఎంపిక పూర్తి చేసి సెట్‌ వర్క్‌ ను సైతం మొదలు పెట్టాలని భావిస్తున్నారు. 2028 లో సినిమా విడుదల ఉండే అవకాశం ఉంది.