Begin typing your search above and press return to search.

సుకుమార్.. హీరో లుక్ మళ్లీ మారాల్సిందేనా!

రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో రాబోతున్న RC17 గురించి ఇప్పుడు ఒక కొత్త టాక్ వినిపిస్తోంది.

By:  M Prashanth   |   14 Aug 2026 9:00 PM IST
సుకుమార్.. హీరో లుక్ మళ్లీ మారాల్సిందేనా!
X

రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో రాబోతున్న RC17 గురించి ఇప్పుడు ఒక కొత్త టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం చరణ్ దాదాపు 15 కిలోల బరువు తగ్గుతాడని ఫిల్మ్ సర్కిల్స్‌లో చెప్పుకుంటున్నారు. అంతేకాదు, లాంగ్ హెయిర్ లుక్‌లో కనిపిస్తాడనే ప్రచారం కూడా నడుస్తోంది. మేకర్స్ నుంచి ఎలాంటి అఫీషియల్ అప్‌డేట్ లేకపోయినా, సుకుమార్ ట్రాక్ రికార్డ్ తెలిసిన ఫ్యాన్స్‌కు ఈ వార్త బాగా కనెక్ట్ అవుతోంది.

సుకుమార్ సినిమా అంటే హీరో లుక్ కూడా కొత్తగానే ఉంటుంది. రెగ్యులర్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆయన ఎప్పుడూ సరిపెట్టుకోడు. కథలోని క్యారెక్టర్ ఎలా ఉండాలో ముందే ఫిక్స్ చేసుకుంటాడు. ఎన్టీఆర్‌తో చేసిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమానే బెస్ట్ ఉదాహరణ. అందులో తారక్‌కు ఇచ్చిన హెయిర్ స్టైల్, గడ్డం ట్రిమ్మింగ్, క్లాసీ సూట్స్ అప్పటివరకు ఎవరూ చూడని సరికొత్త లుక్‌ను స్క్రీన్‌పై చూపించాయి.

ఇక రామ్ చరణ్‌తో చేసిన ‘రంగస్థలం’ విషయానికి వస్తే కథ పూర్తిగా మారిపోయింది. అప్పటివరకు కనిపించిన చరణ్ వేరు, ‘చిట్టిబాబు’గా కనిపించిన చరణ్ వేరు. గుబురు గడ్డం, పల్లెటూరి బట్టలు, ఆ వినికిడి లోపం ఉన్న క్యారెక్టర్‌తో అసలు చరణ్ ఇమేజ్‌నే పక్కన పెట్టించాడు. ఆ గెటప్ ఆడియన్స్‌కు ఎంత ఫ్రెష్‌గా అనిపించిందో అందరూ చూశారు.

అల్లు అర్జున్‌తో వచ్చిన ‘పుష్ప’లో ఈ మార్పు మరింత క్లియర్‌గా కనిపించింది. కేవలం జుట్టు, గడ్డం మార్చి వదిలేయలేదు. ఆ పాత్ర కోసం ఒక భుజం ఎగరేసి నడిచే బాడీ లాంగ్వేజ్‌ను సెట్ చేశాడు. ఆ చిత్తూరు యాస, నడక పుష్పరాజ్ పాత్రకు మెయిన్ హైలైట్‌గా మారాయి. థియేటర్లలో ఆ గెటప్ ఏ రేంజ్‌లో క్లిక్ అయిందో బాక్సాఫీస్ నంబర్లే చెప్పాయి.

ఇప్పుడు మళ్లీ చరణ్, సుకుమార్ కలవడంతో RC17 లుక్ పైన అంచనాలు మామూలుగా లేవు. సుకుమార్ ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడంటే హీరో కేవలం యాక్టింగ్ చేస్తే సరిపోదు. కథలో క్యారెక్టర్ కోసం ఫిజికల్‌గా కూడా కంప్లీట్ మేకోవర్ ఇవ్వాల్సిందే. తన హీరోలను ప్రతిసారీ కొత్తగా ప్రెజెంట్ చేయడం సుకుమార్ స్టైల్. రీసెంట్‌గా వచ్చిన ‘పెద్ది’లో చరణ్ మంచి మస్క్యులర్ బాడీతో రగ్గడ్ అవతార్‌లో కనిపించాడు. దానికి పూర్తి ఆపోజిట్‌గా RC17 కోసం లీన్ బాడీ, లాంగ్ హెయిర్‌తో వస్తాడనే టాక్ నిజమైతే లుక్ అదిరిపోతుంది. సుకుమార్ చేతిలో పడిన చరణ్ ఈసారి స్క్రీన్ మీద ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.