RC 17: నాన్నకు ప్రేమతో కాదు.. ఈసారి అమ్మకు ప్రేమతో..!
సుకుమార్ సినిమాల్లో ఏదో ఒక ఎమోషన్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. ఆర్య సినిమాలో ప్రేమను కొత్తగా చూపించి ఆకట్టుకున్న ఆయన, నాన్నకు ప్రేమతో సినిమాలో తండ్రి సెంటిమెంట్‌ను అద్భుతంగా పండించారు.
By: Priya Chowdhary Nuthalapti | 3 Nov 2026 11:21 PM ISTసుకుమార్ సినిమాల్లో ఏదో ఒక ఎమోషన్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. ఆర్య సినిమాలో ప్రేమను కొత్తగా చూపించి ఆకట్టుకున్న ఆయన, నాన్నకు ప్రేమతో సినిమాలో తండ్రి సెంటిమెంట్‌ను అద్భుతంగా పండించారు. ఇప్పుడు రామ్ చరణ్‌తో చేయబోతున్న RC 17 సినిమాలో అమ్మ సెంటిమెంట్‌ను ప్రధానంగా చూపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. రంగస్థలం వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేస్తుండటంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.
ఇక ఈ సినిమాలో బలమైన అమ్మ సెంటిమెంట్ ఉండబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. సాధారణ కమర్షియల్ సినిమాలా కాకుండా, మంచి ఎమోషన్స్‌తో కూడిన సోషల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని సుకుమార్ భావిస్తున్నట్లు సమాచారం.
అలానే RC 17లో బలమైన తల్లి పాత్రను చూపించాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ పాత్ర కోసం అనుభవం ఉన్న సీనియర్ స్టార్ హీరోయిన్ను తీసుకోవాలని చూస్తున్నారట.
ఈ పాత్రకు సరైన నటిని తీసుకోవడం చాలా ముఖ్యమైన పని. సహజమైన నటనతో పాటు బలమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న నటి ఈ పాత్రలో నటిస్తే సినిమాకు మంచి ఎమోషనల్ బలం చేకూరుతుంది. అమ్మ సెంటిమెంట్‌ను ప్రేక్షకుల హృదయాలకు చేరేలా చూపించగలిగితే ఈ సినిమా మరో స్థాయికి వెళ్లే అవకాశం ఉంది.
అన్న సెంటిమెంటుతో వచ్చిన రంగస్థలం తర్వాత రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న ఈ అమ్మ సెంటిమెంట్ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.
