Begin typing your search above and press return to search.

చ‌ర‌ణ్ ను ఫాలో అవుతున్న రామ్

తెలుగు సినిమా హీరోల ట్యాగ్ అప్పుడప్పుడు మారుతూ ఉండ‌టం చాలా సంద‌ర్భాల్లో చూస్తూనే వ‌చ్చాం.

By:  Sravani Lakshmi Srungarapu   |   4 Nov 2025 5:00 PM IST
చ‌ర‌ణ్ ను ఫాలో అవుతున్న రామ్
X

తెలుగు సినిమా హీరోల ట్యాగ్ అప్పుడప్పుడు మారుతూ ఉండ‌టం చాలా సంద‌ర్భాల్లో చూస్తూనే వ‌చ్చాం. హీరో కెరీర్లో బాగా పైకి ఎదిగిన‌ప్పుడో లేదంటే భారీ హిట్ అందుకున్న‌ప్పుడో, ఆ స్థాయికి త‌గ్గ‌ట్టు కొత్త ట్యాగ్ ను పెట్టుకోవాల‌ని భావించి, ఆ ఇమేజ్ కు త‌గ్గ ట్యాగ్స్ ను పెట్టుకుంటారు. అయితే ఆ ట్యాగ్స్ ను ఆడియ‌న్స్ అన్నీ సంద‌ర్భాల్లో యాక్సెప్ట్ చేయాల‌ని లేదు.

గ్లోబ‌ల్ స్టార్ నుంచి మ‌ళ్లీ మెగా ప‌వ‌ర్ స్టార్ చ‌ర‌ణ్‌

ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చ‌ర‌ణ్ ఆ సినిమా త‌ర్వాత త‌న పేరుకు ముందు గ్లోబ‌ల్ స్టార్ అనే కొత్త ట్యాగ్ ను త‌గిలించుకుని, పాత ట్యాగ్ అయిన మెగా పవ‌ర్ స్టార్ ను ప‌క్క‌న పెట్టారు. కానీ చ‌ర‌ణ్ గ్లోబ‌ల్ స్టార్ అనే ట్యాగ్ తో చేసిన ఆచార్య‌, గేమ్ ఛేంజ‌ర్ సినిమాలు ఫ్లాపవ‌డంతో ఆ ట్యాగ్ పై నెట్టింట చాలా విమ‌ర్శ‌లొచ్చాయి. దీంతో త‌న నెక్ట్స్ మూవీ కోసం చ‌ర‌ణ్ త‌న పాత ట్యాగ్ అయిన మెగా ప‌వ‌ర్ స్టార్ గానే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు.

ఉస్తాద్ ను వ‌ద్ద‌నుకుంటున్న రాపో

ఇప్పుడు చ‌ర‌ణ్ ను చూసి మ‌రో యంగ్ హీరో కూడా అదే బాట ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. అత‌ను మ‌రెవ‌రో కాదు, టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని. టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ గా మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్న రామ్, ఇస్మార్ట్ శంక‌ర్ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత త‌న ట్యాగ్ ను ఉస్తాద్ గా మార్చుకున్నారు. ఎన‌ర్జిటిక్ స్టార్ నుంచి ఉస్తాద్ గా మారిన‌ప్ప‌టి నుంచి రామ్ ఇప్ప‌టివ‌ర‌కు హిట్ ను అందుకున్న‌ది లేదు.

పైగా ఆడియ‌న్స్, ఫ్యాన్స్ కూడా రామ్ ను ఉస్తాద్ అనే దానికంటే ఎన‌ర్జిటిక్ స్టార్ అని పిలుచుకోవ‌డానికే ఆస‌క్తి చూపారు. అందుకే ఇప్పుడు రామ్ తిరిగి త‌న పాత ట్యాగ్ కు షిఫ్ట్ అవుతున్నారు. త‌న త‌ర్వాతి సినిమా ఆంధ్రా కింగ్ తాలూకా కోసం రామ్ ఎన‌ర్జిటిక్ స్టార్ అనే ట్యాగ్ నే పెట్టుకుంటున్నారు. కొత్త ట్యాగ్ లు పెట్టుకోవాలంటే ఫ్యాన్స్ కు ఇష్ట‌ముండాల‌ని భావించిన చ‌ర‌ణ్, రామ్ ఇక‌పై త‌మ పాత ట్యాగ్‌ల తోనే కంటిన్యూ అవాల‌ని ఆస‌క్తి చూపుతున్నారు.