Begin typing your search above and press return to search.

చరణ్ ‘రై రై రా రా’.. రెస్పాన్స్ ఎలా ఉందంటే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. 'పెద్ది' మీద అంచనాలు అయితే మామూలుగా లేవు.

By:  M Prashanth   |   3 March 2026 12:16 PM IST
చరణ్ ‘రై రై రా రా’.. రెస్పాన్స్ ఎలా ఉందంటే?
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. 'పెద్ది' మీద అంచనాలు అయితే మామూలుగా లేవు. ఇప్పటికే విడుదలైన 'చికిరీ చికిరి' సాంగ్ యూత్ మధ్య మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మేకర్స్ రెండో సింగిల్ ‘రై రై రా రా’ సాంగ్ తో సోషల్ మీడియాలో అదే వైబ్స్ క్రియేట్ చేస్తున్నారు. బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రంపై రోజురోజుకీ క్యూరియాసిటీ పెరిగిపోతోంది.

ఈ పాటలో రామ్ చరణ్ లుక్ చాలా రఫ్ అండ్ రగ్గడ్ గా ఉంది. మాస్ ఇమేజ్ కి తగ్గట్టుగా గ్రేస్ అండ్ స్టైల్‌తో ఇంటర్నెట్‌లో వైబ్ క్రియేట్ చేస్తున్నారు. ఇక ఏఆర్ రెహమాన్ చాలా కాలం తర్వాత ఒక తెలుగు పాటను స్వయంగా పాడటం ఇక్కడ పెద్ద ప్లస్ పాయింట్. రెహమాన్ వాయిస్ లోని ఇంటెన్సిటీ ఈ మాస్ బీట్‌కు మరింత ఊపునిచ్చింది. మ్యూజిక్ ప్రియులను ఆకట్టుకోవడంలో ఈ కంపోజిషన్ సక్సెస్ అయింది.

చరణ్ వేసిన స్పీడ్ స్టెప్పులు ఇప్పుడు గ్లోబల్ లెవల్‌లో ట్రెండ్ అవుతున్నాయి. ఎఫర్ట్‌లెస్ గా డ్యాన్స్ చేయడంలో ఈ హీరో స్టైలే వేరు. ఇప్పటికే ఈ సాంగ్ మీద ఇన్స్టాగ్రామ్‌లో లక్షలాది రీల్స్ వైరల్ అవుతున్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ పాట గురించి చర్చ జరుగుతోంది. ఈ స్థాయిలో రెస్పాన్స్ రావడం చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర చరణ్ పవర్ ఏంటో అర్థమవుతోంది.

మొదటి పాట సక్సెస్ తర్వాత రెహమాన్ మళ్ళీ ఈ రేంజ్ మాస్ నెంబర్ ఇవ్వడం టీమ్ కి పెద్ద బూస్ట్ అని చెప్పాలి. పబ్లిక్ లోకి ఈ సాంగ్ చాలా స్పీడ్ గా వెళ్ళిపోయింది. ప్రొడ్యూసర్ వెంకట సతీష్ కిలారు మేకింగ్ విషయంలో ఎక్కడా తగ్గకుండా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. పాటలోని విజువల్స్ చూస్తుంటే థియేటర్లలో ఆడియన్స్‌కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అనిపిస్తోంది.

సినిమాలో చరణ్ క్యారెక్టరైజేషన్ చాలా పవర్‌ఫుల్ గా ఉంటుందని ఇన్సైడ్ టాక్. అందుకే ప్రతి అప్‌డేట్ నేటి జనరేషన్ టేస్ట్‌కు తగ్గట్టుగా రిలీజ్ చేస్తున్నారు. బుచ్చిబాబు సానా తన విజన్‌తో ఈ మాస్ ఫీస్ట్ ను కొత్తగా ప్రెజెంట్ చేస్తున్నారు. రెహమాన్ మ్యూజిక్ చరణ్ డ్యాన్స్ కలయికలో వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇంటర్నేషనల్ లెవల్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా మ్యూజికల్ గా కూడా ఈ మూవీ పెద్ద హిట్ అయ్యేలా కనిపిస్తోంది.

ఇక ‘రై రై రా రా’ సాంగ్ తో ‘పెద్ది’ మేకర్స్ బాక్సాఫీస్ దగ్గర పక్కా స్కెచ్ వేశారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. సినిమా రిలీజ్ కోసం మెగా ఫ్యాన్స్ చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు. మార్కెట్ లో ఉన్న పోటీని తట్టుకుని ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. ప్రస్తుతానికైతే ఈ సాంగ్ నెట్టింట టాప్ ట్రెండింగ్ లో ఉంది.