Begin typing your search above and press return to search.

చెన్నైలో సెంటిమెంట్ ర‌గిలించిన 'పెద్ది': CM విజ‌య్‌పై రామ్ చ‌ర‌ణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా స్పోర్ట్స్ డ్రామా `పెద్ది`. బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా శనివారం చెన్నైలో ఒక భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.

By:  Sivaji Kontham   |   31 May 2026 9:39 AM IST
చెన్నైలో సెంటిమెంట్ ర‌గిలించిన పెద్ది: CM విజ‌య్‌పై రామ్ చ‌ర‌ణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!
X

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా స్పోర్ట్స్ డ్రామా `పెద్ది`. బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా శనివారం చెన్నైలో ఒక భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. ''నేను చెన్నైకి వచ్చిన ప్రతిసారి నాకు సొంత ఊరికి వచ్చినట్టే అనిపిస్తుంది'' అంటూ తమిళ ప్రజలపై తనకున్న ప్రేమాభిమానాలను చాటుకున్నారు. ఇదే వేదికపై తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ గురించి చరణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన సీఎం విజయ్ కి రామ్ చరణ్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ``గౌరవనీయులైన సీఎం జోసెఫ్ విజయ్ గారు తన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు.. ఆ స్టార్‌డమ్‌ను .. భారీ పారితోషికాన్ని వదిలిపెట్టి ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చారు`` అని కొనియాడారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక వ్యక్తిగా విజయ్ నిర్ణయంపై తాను ఎంతో గర్వపడుతున్నానని.. ఇండస్ట్రీ విజయాలకు మించి ప్రజాసేవ వైపు అడుగులు వేయడానికి అపారమైన నిబద్ధత, సంకల్పం కావాలని చరణ్ ప్రశంసించారు. ఈ సందర్భంగా తమిళనాడు ప్రజలకు, విజయ్ కి చ‌ర‌ణ్‌ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

నిజానికి ద‌ళ‌ప‌తి విజయ్ రాజకీయాల్లో సాధించిన ఈ అద్భుత విజయానికి రామ్ చరణ్ అభినందించడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ అత‌డు సామాజిక మాధ్యమం `ఎక్స్` (ట్విట్టర్) వేదికగా విజయ్ కి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలతో ఆయనకున్న అనుబంధం, స్పష్టమైన విజన్ తమిళనాడు ఎన్నికల్లో ఘనవిజయానికి కారణమయ్యాయని, రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించడంలో విజయ్ గొప్ప విజయం సాధించాలని చరణ్ ఆకాంక్షించారు. తమిళ ప్రజలు తన చిత్రాలకు అందిస్తున్న నిరంతర ఆదరణకు.. ప్రేమాభిమానాలకు ఈ సందర్భంగా చరణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

తమిళ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్‌గా వెలిగిన విజయ్ ఫిబ్రవరి 2024లో `తమిళగ వెట్రి కజగం` (టీవీకే) పార్టీని స్థాపించి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాలకు గాను సోలోగా 108 స్థానాలు గెలుచుకుని... చరిత్రలో నిలిచిపోయిన డిఎంకే, ఏఐఏడిఎంకే పార్టీలకు ప్రత్యామ్నాయంగా టీవీకేని నిలబెట్టారు. విజయ్ స్వయంగా పెరంబూర్, తిరుచిరాపల్లి ఈస్ట్ అనే రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేసి రెండింటిలోనూ ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్ సహా ఇతర మిత్రపక్షాల మద్దతుతో 10 మే 2026న తమిళనాడు 9వ ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసి 1960ల తర్వాత ఒక నాన్-ద్రావిడ పార్టీ నుండి సీఎం అయిన మొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించారు.

ఇక 4 జూన్ 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు వ‌స్తున్న `పెద్ది` సినిమా విషయానికి వస్తే.. ఇందులో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ త‌దిత‌రులు కీలక పాత్రలు పోషించారు. చెన్నై వేదికగా జరిగిన ఈ ప్రెస్‌మీట్ త‌మిళ‌నాడు వ్యాప్తంగా పెద్ది కలెక్ష‌న్ల‌ను ప్ర‌భావితం చేస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ద‌ళ‌ప‌తి విజ‌య్ అభిమానులు ఇప్పుడు ఈ బాధ్య‌త‌ను తీసుకోనున్నారు. ఇది సినిమా - రాజకీయ వర్గాల మధ్య ఉన్న సత్సంబంధాలను మరోసారి గుర్తుచేస్తుంది.