Begin typing your search above and press return to search.

పెద్ది, ఫౌజీ క్లైమాక్సులు.. కొత్త ట్రెండ్ సెట్ చేస్తాయా?

టాలీవుడ్‌ లో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న పెద్ది, ఫౌజీ సినిమాలకు సంబంధించి ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది.

By:  M Prashanth   |   13 April 2026 10:47 PM IST
పెద్ది, ఫౌజీ క్లైమాక్సులు.. కొత్త ట్రెండ్ సెట్ చేస్తాయా?
X

టాలీవుడ్‌ లో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న పెద్ది, ఫౌజీ సినిమాలకు సంబంధించి ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఆ రెండు సినిమాల క్లైమాక్స్‌ ల గురించే ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చలు జోరుగా సాగుతున్నాయి. సినిమా మొత్తం ఎలా ఉన్నా.. చివరి 20–30 నిమిషాలు ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకునేలా డిజైన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ ప్రేక్షకులకు ఊహించని మలుపు ఇవ్వబోతుందట. కథనం అంతా ఒక విధంగా నడుస్తూ చివర్లో భావోద్వేగాలతో పాటు షాక్ ఇచ్చే ట్విస్ట్‌ తో ముగుస్తుందని టాక్ వినిపిస్తోంది. అదే విధంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సినిమాలో కూడా క్లైమాక్స్ కీలక పాత్ర పోషించబోతుందని తెలుస్తోంది.

ఇప్పటికే టాలీవుడ్‌ లో క్లైమాక్స్ ద్వారా సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిన ఉదాహరణలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ కు దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కించిన ఉప్పెన సినిమా చివరి భాగం ప్రేక్షకుల హృదయాలను కదిలించింది. అదే విధంగా దర్శకుడు హను రాఘవపూడి రూపొందించిన సీతారామం క్లైమాక్స్ కూడా భావోద్వేగాలకు అద్దం పట్టింది. ఆ రెండు సినిమాల క్లైమాక్స్ విధానం ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది.

ఇప్పుడు పెద్ది, ఫౌజీ చిత్రాల క్లైమాక్స్‌ లు ఆ రేంజ్ కు మించి ఉండబోతున్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కథకు తగ్గట్టు మాత్రమే కాకుండా.. ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా ఆ ముగింపు గురించి మాట్లాడుకునేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ముఖ్యంగా ఆ సినిమాల్లో ఎమోషన్స్, యాక్షన్, సర్ప్రైజ్ ఎలిమెంట్స్.. అన్నీ కలిపి ఉండేలా క్లైమాక్స్‌ ను రూపొందిస్తున్నారని తెలుస్తోంది.

ఇటీవల కాలంలో ప్రేక్షకుల అభిరుచి కూడా మారింది. సాధారణ ముగింపులు కంటే కొత్తదనం, అనూహ్య మలుపులు ఉన్న క్లైమాక్స్‌ లను ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దర్శకులు కూడా కథ చివరిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. అదే ఫార్ములాను పెద్ది, ఫౌజీ టీమ్స్ కూడా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఆ రెండు భారీ చిత్రాలు కేవలం స్టార్స్ వల్లే కాకుండా, తమ క్లైమాక్స్‌ ల ద్వారానే ప్రత్యేక గుర్తింపు పొందే అవకాశం ఉందని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు.

విడుదల తర్వాత ఆ సినిమాల గురించి చర్చల్లో ఎక్కువ భాగం చివరి సన్నివేశాల గురించి ఉండబోతుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇక ఆ వార్తలన్నీ నిజమవుతాయా లేదా అనేది తెలుసుకోవాలంటే సినిమాలు విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే. కానీ ఇప్పటికైతే పెద్ది, ఫౌజీ క్లైమాక్స్‌ లపై పెరుగుతున్న అంచనాలు హాట్ టాపిక్‌ గా మారాయి. కొత్త ట్రెండ్ సెట్ చేయనున్నాయా అంటూ అంతా మాట్లాడుకుంటున్నారు.