నెలకు రూ .60 లక్షల జీతమా? ఆ హీరో బాడీగార్డ్‌పై టాక్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రేంజ్ ఇప్పుడు మామూలుగా లేదు. ఆయన సినిమా అప్‌డేట్స్ ఎంత వైరల్ అవుతాయో, ఆయన పర్సనల్ లైఫ్ విశేషాలు కూడా అంతే ట్రెండ్ అవుతాయి.
By: Madhu Reddy | 25 May 2026 5:48 PM ISTగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రేంజ్ ఇప్పుడు మామూలుగా లేదు. ఆయన సినిమా అప్‌డేట్స్ ఎంత వైరల్ అవుతాయో, ఆయన పర్సనల్ లైఫ్ విశేషాలు కూడా అంతే ట్రెండ్ అవుతాయి. తాజాగా చరణ్ నటించిన 'పెద్ది' సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో గ్రాండ్‌గా జరిగింది. అయితే ఈ వేడుకలో సినిమా కన్నా ఎక్కువగా రామ్ చరణ్ పక్కన 'షాడో'లా నిలిచిన ఒక భారీ కాయుడైన బాడీగార్డ్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆయనకు చరణ్ ఇచ్చే జీతం వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే..ఆ విశేషాలు చూద్దాం..
ఎవరీ ఇంటర్నేషనల్ బాడీగార్డ్?: ముంబై ఎయిర్‌పోర్ట్ నుండి ఈవెంట్ ముగిసే వరకు రామ్ చరణ్ వెంటే ఉంటూ రక్షణ కల్పించిన ఆ స్పెషల్ బాడీగార్డ్ పేరు కెవిన్ కుంటా. ఆయన కేవలం ఒక నార్మల్ సెక్యూరిటీ గార్డ్ మాత్రమే కాదు, అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న ఒక పవర్‌ఫుల్ ప్రొఫెషనల్ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) ఫైటర్.
ఇటలీ ఛాంపియన్.. రికార్డుల వేటగాడు: ఆఫ్రికా ఖండంలోని గాంబియా దేశానికి చెందిన కెవిన్, ప్రస్తుతం ఇటలీలో ఉంటున్నారు. ఇటలీ నేషనల్ మిడిల్‌వెయిట్ MMA ఛాంపియన్‌గా ఎన్నో అంతర్జాతీయ రింగ్ ఫైట్స్‌లో రికార్డులు సృష్టించారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ వీఐపీలు, సెలబ్రిటీలకు అత్యున్నత స్థాయి క్లోజ్ ప్రొటెక్షన్ సెక్యూరిటీ ఇవ్వడంలో కెవిన్‌కు భారీ డిమాండ్ ఉంది.
రోజుకు 2 లక్షలు.. నెలకు రూ.60 లక్షలా?: ప్రస్తుతం సోషల్ మీడియాలో కెవిన్ కుంటా జీతం గురించే హాట్ టాపిక్ నడుస్తోంది. రామ్ చరణ్ తన రక్షణ కోసం ఈ ఇంటర్నేషనల్ ఫైటర్‌కు రోజుకు ఏకంగా రూ.2 లక్షల వరకు ఇస్తున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కన చూస్తే నెలకు దాదాపు రూ.60 లక్షల జీతం అన్నమాట. ఇక ఇది విన్న నెటిజన్లు "ఒక బాడీగార్డ్ జీతం ఇంతా! ఇది మన గ్లోబల్ స్టార్ రేంజ్" అంటూ కామెంట్లు పెడుతున్నారు.
జూన్ 4న రాబోతున్న 'పెద్ది': ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. బుచ్చిబాబు డైరెక్షన్‌లో చెర్రీ నటిస్తున్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది'. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ మూవీలో చెర్రీ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌కు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్‌కు అంతర్జాతీయంగా క్రేజ్ పెరగడంతో, ఆయన భద్రత కోసం ఇలాంటి గ్లోబల్ రేంజ్ బాడీగార్డ్‌ను నియమించుకోవడం అవసరమేనని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక ఏదేమైనా ఈ ఇంటర్నేషనల్ బాడీగార్డ్ ముచ్చట ఇప్పుడు ఇండస్ట్రీలో సరికొత్త చర్చకు దారితీసింది.
