Begin typing your search above and press return to search.

మెగా ప‌వ‌ర్ స్టార్ ని చూసి సూప‌ర్ స్టారే జంకుతున్నారా?

టాలీవుడ్- కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఓ ఆసక్తికరమైన పోరు నెలకొంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ న‌టిస్తోన్న‌ `పెద్ది` చిత్రం జూన్ 4న విడుదలకు సిద్ధమవుతోంది.

By:  Srikanth Kontham   |   4 May 2026 10:00 PM IST
మెగా ప‌వ‌ర్ స్టార్ ని చూసి సూప‌ర్ స్టారే జంకుతున్నారా?
X

టాలీవుడ్- కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఓ ఆసక్తికరమైన పోరు నెలకొంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ న‌టిస్తోన్న‌ `పెద్ది` చిత్రం జూన్ 4న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

సరిగ్గా ఎనిమిది రోజుల వ్యవధిలో అంటే జూన్ 12న సూపర్ స్టార్ రజనీకాంత్ మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ `జైలర్ 2` విడుదలకు ప్లాన్ చేసారు. తాజా సమాచారం ప్రకారం ఈ రెండు భారీ చిత్రాల మధ్య పోటీ `జైలర్` టీమ్‌ను ఆలోచనలో పడేసినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ `పెద్ది` మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఈ సినిమాకు జూన్ 4న పాజిటివ్ టాక్ వస్తే? ఆ ప్రభావం కనీసం రెండు మూడు వారాల పాటు బాక్సాఫీస్ వద్ద బలంగా ఉంటుంది.

ఇలాంటి సమయంలో ఎనిమిది రోజుల గ్యాప్‌లో `జైలర్ 2` లాంటి భారీ చిత్రాన్ని బరిలోకి దింపడం రిస్క్ అని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు స‌మాచారం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో `పెద్ది` ప్రభంజనం ముందు రజనీ సినిమాకు థియేటర్ల లభ్యత , వసూళ్ల పరంగా ఇబ్బందులు ఎదురుకావచ్చనే ఆందోళన కనిపిస్తోంది.

సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రాలకు తెలుగులో నూ భారీ మార్కెట్ ఉంది. `జైలర్` మొదటి భాగం ఇక్కడా భారీ వసూళ్లను సాధించింది. కానీ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్‌. ఆయన సినిమాతో నేరుగా తలపడటం ఓపెనింగ్స్ దెబ్బతినే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అందుకే బాక్సాఫీస్ వద్ద క్లాష్‌ను నివారించి సోలో రిలీజ్ ద్వారా గరిష్ట వసూళ్లను రాబట్టాలని `జైలర్ 2` నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే `జైలర్ 2` విడుదలను జూన్ నుండి ఆగస్టు వాయిదా వేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మ‌ధ్య‌లో జులై ఉన్నా? రిలీజ్ అంత అనుకూలంగా ఉండ‌ద‌ని మేక‌ర్స్ భావించి ఆగ‌స్టు వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఆగ‌స్టు నెల అంటే? స్వాతంత్య్ర‌దినోత్స‌వం సెలవు స‌హా, అప్పటికి `పెద్ది` సందడి కూడా తగ్గుముఖం ప‌డుతుంది.

కేవలం వసూళ్లు మాత్రమే కాదు. థియేటర్ల కేటాయింపు విషయంలో కూడా పంపిణీదారులు సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది. రెండు పెద్ద సినిమాలు పది రోజుల వ్యవధిలో రావడం వల్ల స్క్రీన్ల షేరింగ్ సమస్య తలెత్తుతుంది. `పెద్ది` చిత్రానికి లాంగ్ రన్ ఉండే అవకాశం ఉన్నందున `జైలర్ 2` కి ఆశించిన స్థాయిలో థియేటర్లు దొరకడం కష్టమనేది ట్రేడ్ టాక్. ఈ సమీకరణాలన్నీ పరిగణనలోకి తీసుకునే రజనీకాంత్ సినిమా వెనక్కి తగ్గుతున్నట్లు సమాచారం. వాస్త‌వానికి సీనియ‌ర్ల సినిమా రిలీజ్ అవుతుందంటే జూనియ‌ర్ లైన్ పోటీ నుంచి త‌ప్పుకోవాలి. కానీ ఇప్పుడా ప‌రిస్థితులు ఏ ప‌రిశ‌శ్ర‌మ‌లోనూ క‌నిపించ‌లేదు. జూనియ‌ర్ల స్టార్ డ‌మ్ ముందు సీనియ‌ర్లే త‌ప్పుకోవాల్సి వ‌స్తోంది.